Nahum · chapter 3 · verse 8
Nahum 3:8 in Telugu
సముద్రమే తనకు ఆపుగాను సముద్రమే తనకు ప్రాకారముగాను చేసికొని, బహు జనములచేత చుట్టబడి నైలునది దగ్గర నుండిన నో అమోను పట్టణముకంటె నీవు విశేషమైన దానవా?
Samudrame tanaku aapugaanu samudrame tanaku praakaaramugaanu chesikoni, bahu janamulacheta chuttabadi nailunadi daggara nundina no amonu pattanamukante neevu visheshamaina daanavaa?
Nahum 3:8 in English
- King James Version (KJV)
- Art thou better than populous No, that was situate among the rivers, [that had] the waters round about it, whose rampart [was] the sea, [and] her wall [was] from the sea?
- World English Bible (WEB)
- Are you better than No-Amon, who was situated among the rivers, who had the waters around her, whose rampart was the sea, and her wall was of the sea?
- American Standard Version (ASV)
- Art thou better than No-amon, that was situate among the rivers, that had the waters round about her; whose rampart was the sea, [and] her wall was of the sea?
- Bible in Basic English (BBE)
- Are you better than No-amon, seated on the Nile streams, with waters all round her; whose wall was the sea and her earthwork the waters?
- Darby Translation (DBY)
- Art thou better than No-Amon, that was situate among the rivers, [that had] the waters round about her, whose rampart was the sea, [and] of the sea was her wall?
- Webster's Bible (WBS)
- Art thou better than populous No, that was situated among the rivers, [that had] the waters around it, whose rampart [was] the sea, [and] her wall [was] from the sea?
- Young's Literal Translation (YLT)
- Art thou better than No-Ammon, That is dwelling among brooks? Waters she hath round about her, Whose bulwark [is] the sea, waters her wall.
Read in context
- 6పదిమంది యెదుట నీమీద మాలిన్యమువేసి నిన్ను అవమాన పరచెదను.
- 7అప్పుడు నిన్ను చూచు వారందరు నీయొద్ద నుండి పారిపోయి నీనెవె పాడైపోయెనే, దానికొరకు అంగలార్చువారెవరు? నిన్ను ఓదార్చు వారిని ఎక్కడ నుండి పిలుచుకొని వచ్చెదము అందురు.
- 8సముద్రమే తనకు ఆపుగాను సముద్రమే తనకు ప్రాకారముగాను చేసికొని, బహు జనములచేత చుట్టబడి నైలునది దగ్గర నుండిన నో అమోను పట్టణముకంటె నీవు విశేషమైన దానవా?
- 9కూషీయులును ఐగుప్తీయులును దాని శూరులైరి, వారు విస్తార జనముగా నుండిరి, పూతువారును లూబీయులును నీకు సహాయులై యుండిరి.
- 10అయినను అది చెరపట్టబడి కొనిపోబడెను, రాజమార్గముల మొగల యందు శత్రువులు దానిలోని చిన్న పిల్లలను బండలకు వేసి కొట్టి చంపిరి, దాని ఘనులమీద చీట్లువేసి దాని ప్రధానుల నందరిని సంకెళ్లతో బంధించిరి.
Cross references
- Amos 6:2 ఆమోసు 6:2కల్నేకు పోయి విచారించుడి; అక్కడ నుండి హమాతు మహాపురమునకు పోవుడి, ఫిలిష్తీయుల పట్టణమైన గాతునకు పోవుడి; అవి ఈ రాజ్యములకంటె గొప్పవి గదా; వాటి సరిహద్దులు మీ సరిహద్దులకంటె విశాలమైనవి గదా.
- Ezekiel 30:14–16 యెహెజ్కేలు 30:14–16పత్రోసును పాడుచేసెదను. సోయనులో అగ్నియుంచెదను, నోలో తీర్పులు చేసెదను. ఐగుప్తునకు కోటగా నున్న సీనుమీద నా క్రోధము కుమ్మరించెదను, నోలోని జనసమూహమును నిర్మూలము చేసెదను ఐగుప్తుదేశములో నేను అగ్నియుంచగా సీనునకు మెండుగ నొప్పిపట్టును, నోపురము పడగొట్టబడును, పగటివేళ శత్రువులు వచ్చి నొపుమీద పడుదురు.
- Isaiah 19:5–10 యెషయా 19:5–10సముద్రజలములు ఇంకిపోవును నదియును ఎండి పొడినేల యగును ఏటి పాయలును కంపుకొట్టును ఐగుప్తు కాలువలు ఇంకి యెండిపోవును రెల్లును తుంగలును వాడిపోవును. నైలునదీప్రాంతమున దాని తీరముననున్న బీడులును దానియొద్ద విత్తబడిన పైరంతయు ఎండి కొట్టుకొని పోయి కనబడక పోవును. జాలరులును దుఃఖించెదరు నైలునదిలో గాలములు వేయువారందరు ప్రలాపించెదరు జలములమీద వలలు వేయువారు కృశించిపోవుదురు దువ్వెనతో దువ్వబడు జనుపనారపని చేయువారును తెల్లని బట్టలు నేయువారును సిగ్గుపడుదురు. రాజ్య స్తంభములు పడగొట్టబడును కూలిపని చేయువారందరు మనోవ్యాధి పొందుదురు.
- Jeremiah 46:25–26 యిర్మీయా 46:25–26ఇశ్రాయేలు దేవుడును సైన్యములకధిపతియునగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు నోలోనుండు ఆమోను దేవతను ఫరోను ఐగుప్తును దాని దేవతలను దాని రాజులను ఫరోను అతని నాశ్రయించువారిని నేను దండించు చున్నాను. వారి ప్రాణము తీయజూచు బబులోనురాజైన నెబుకద్రెజరు చేతికిని అతని సేవకులచేతికిని వారిని అప్పగించుచున్నాను ఆ తరువాత అది మునుపటివలెనే నివాసస్థలమగును ఇదే యెహోవా వాక్కు.
- Ezekiel 31:2–3 యెహెజ్కేలు 31:2–3నరపుత్రుడా, నీవు ఐగుప్తు రాజైన ఫరోతోను అతని సమూహముతోను ఇట్లనుము ఘనుడవైన నీవు ఎవనితో సమానుడవు? అష్షూరీయులు లెబానోను దేవదారు వృక్షమైనట్టుండిరి. దాని కొమ్మలు శృంగారములు, దాని గుబురు విశాలము, దానికొన బహు ఎత్తయినందున మేఘములకు అంటెను.