Nehemiah · chapter 2 · verse 10
Nehemiah 2:10 in Telugu
హోరోనీయుడైన సన్బల్లటును, అమ్మోనీయుడైన టోబీయా అను దాసుడును ఇశ్రాయేలీయులకు క్షేమము కలుగజేయు ఒకడు వచ్చెనని విని బహుగా దుఃఖపడిరి.
Horoneeyudaina sanballatunu, ammoneeyudaina tobeeyaa anu daasudunu ishraayeleeyulaku kshemamu kalugajeyu okadu vachchenani vini bahugaa duhkhapadiri.
Nehemiah 2:10 in English
- King James Version (KJV)
- When Sanballat the Horonite, and Tobiah the servant, the Ammonite, heard [of it], it grieved them exceedingly that there was come a man to seek the welfare of the children of Israel.
- World English Bible (WEB)
- When Sanballat the Horonite and Tobiah the Ammonite servant heard of it, it grieved them exceedingly, because a man had come to seek the welfare of the children of Israel.
- American Standard Version (ASV)
- And when Sanballat the Horonite, and Tobiah the servant, the Ammonite, heard of it, it grieved them exceedingly, for that there was come a man to seek the welfare of the children of Israel.
- Bible in Basic English (BBE)
- And Sanballat the Horonite and Tobiah the servant, the Ammonite, hearing of it, were greatly troubled because a man had come to the help of the children of Israel.
- Darby Translation (DBY)
- And when Sanballat the Horonite, and Tobijah the servant, the Ammonite, heard [of it], it grieved them exceedingly that there had come a man to seek the welfare of the children of Israel.
- Webster's Bible (WBS)
- When Sanballat the Horonite, and Tobiah the servant, the Ammonite, heard [of it] , it grieved them exceedingly that there had come a man to seek the welfare of the children of Israel.
- Young's Literal Translation (YLT)
- and Sanballat the Horonite heareth, and Tobiah the servant, the Ammonite, and it is evil to them — a great evil — that a man hath come in to seek good for the sons of Israel.
Read in context
- 8పట్టణప్రాకారమునకును, మందిరముతో సంబంధించిన కోటగుమ్మములకును, నేను ప్రవేశింపబోవు ఇంటికిని, దూలములు మ్రానులు ఇచ్చునట్లుగా రాజుగారి అడవులను కాయు ఆసాపునకు ఒక తాకీదును ఇయ్యుడని అడిగితిని; ఆలాగు నాకు తోడుగా ఉండి నాకు కృప చూపుచున్న నా దేవుని కరుణా హస్తముకొలది రాజు నా మనవి ఆలకించెను.
- 9తరువాత నేను నది యవతలనున్న అధికారులయొద్దకు వచ్చి వారికి రాజుయొక్క తాకీదులను అప్పగించితిని. రాజు నాతోకూడ సేనాధిపతులను గుఱ్ఱపురౌతులను పంపించెను.
- 10హోరోనీయుడైన సన్బల్లటును, అమ్మోనీయుడైన టోబీయా అను దాసుడును ఇశ్రాయేలీయులకు క్షేమము కలుగజేయు ఒకడు వచ్చెనని విని బహుగా దుఃఖపడిరి.
- 11అంతట నేను యెరూషలేమునకు వచ్చి మూడు దినములు అక్కడనే యుండి
- 12రాత్రియందు నేనును నాతోకూడ నున్న కొందరును లేచితివిు. యెరూషలేమునుగూర్చి దేవుడు నా హృదయమందు పుట్టించిన ఆలోచననునేనెవరితోనైనను చెప్పలేదు. మరియు నేను ఎక్కియున్న పశువుతప్ప మరి యే పశువును నాయొద్ద ఉండ లేదు.
Cross references
- Nehemiah 4:7 నెహెమ్యా 4:7సన్బల్లటును టోబీయాయును అరబీయులును అమ్మో నీయులును అష్డోదీయులును, యెరూషలేముయొక్క గోడలు కట్టబడెననియు, బీటలన్నియు కప్పబడెననియు వినినప్పుడు
- Nehemiah 2:19 నెహెమ్యా 2:19అయితే హోరోనీయుడైన సన్బల్లటును, అమ్మో నీయుడైన దాసుడగు టోబీయా అనువాడును, అరబీయు డైన గెషెమును ఆ మాట వినినప్పుడు మమ్మును హేళన చేసి మా పని తృణీకరించి మీరు చేయు పనియేమిటి? రాజుమీద తిరుగుబాటు చేయుదురా అని చెప్పిరి.
- Proverbs 27:4 సామెతలు 27:4క్రోధము క్రూరమైనది కోపము వరదవలె పొర్లునది. రోషము ఎదుట ఎవడు నిలువగలడు?
- Nehemiah 13:4 నెహెమ్యా 13:4ఇంతకుముందు మన దేవుని మందిరపు గదిమీద నిర్ణయింపబడిన యాజకుడగు ఎల్యాషీబు టోబీయాతో బంధు త్వము కలుగజేసికొని
- Acts 19:26–27 అపొస్తలుల కార్యములు 19:26–27అయితే చేతులతో చేయబడినవి దేవతలు కావని యీ పౌలు చెప్పి, ఎఫెసులో మాత్రము కాదు, దాదాపు ఆసియయందంతట బహు జనమును ఒప్పించి, త్రిప్పియున్న సంగతి మీరు చూచియు వినియు నున్నారు. మరియు ఈ మన వృత్తియందు లక్ష్యము తప్పిపోవుటయే గాక, మహాదేవియైన అర్తెమి దేవియొక్క గుడి కూడ తృణీకరింపబడి, ఆసియయందంతటను భూలోకమందును పూజింపబడుచున్న ఈమెయొక్క గొప్పతనము తొలగిపోవునని భయముతోచుచున్నదని వారితో చెప్పెను.
- Ezekiel 25:6–8 యెహెజ్కేలు 25:6–8మరియు ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా మీరు చేతులు చరచుకొని కాళ్లతో నేలతన్ని ఇశ్రాయేలీ యుల శ్రమను చూచి మీ మనస్సులోని తిరస్కారము కొలది ఉల్లసించితిరి గనుక నేను యెహోవానై యున్నానని మీరు తెలిసికొనునట్లు నేను మీకు విరోధినై, మిమ్మును జనములకు దోపుడుసొమ్ముగా అప్పగింతును, అన్యజనులలో ఉండకుండ మిమ్మును నిర్మూలము చేతును, జనము కాకుండ మిమ్మును నశింపజేతును సమూలధ్వంసము చేతును. మరియు ప్రభువైన యెహోవా ఈ మాట సెలవిచ్చు చున్నాడుఇతర జనములన్నిటికిని యూదా వారికిని భేద మేమి యని మోయాబీయులును శేయీరు పట్టణపు వారును అందురు గనుక
- Nehemiah 6:1 నెహెమ్యా 6:1నేను ఇంకను గుమ్మములకు తలుపులు నిలుపకముందుగా దానిలో బీటలులేకుండ సంపూర్ణముగా గోడను కట్టి యుండగా, సన్బల్లటును టోబీయాయును అరబీయుడైన గెషెమును మా శత్రువులలో మిగిలినవారును విని
- Numbers 22:3–4 సంఖ్యాకాండము 22:3–4జనము విస్తారముగా నున్నందున మోయాబీయులు వారిని చూచి మిక్కిలి భయపడిరి; మోయాబీయులు ఇశ్రాయేలీ యులకు జంకిరి. మోయాబీయులు మిద్యాను పెద్దలతో ఎద్దు బీటి పచ్చికను నాకివేయునట్లు ఈ జనసమూహము మన చుట్టు ఉన్నది యావత్తును ఇప్పుడు నాకివేయు ననిరి. ఆ కాలమందు సిప్పోరు కుమారుడైన బాలాకు మోయాబీయులకు రాజు.
- Psalm 112:10 కీర్తనలు 112:10భక్తిహీనులు దాని చూచి చింతపడుదురు వారు పండ్లుకొరుకుచు క్షీణించి పోవుదురు భక్తిహీనుల ఆశ భంగమైపోవును.
- Ecclesiastes 10:7 ప్రసంగి 10:7పనివారు గుఱ్ఱముల మీద కూర్చుండుటయు అధిపతులు సేవకులవలె నేలను నడుచుటయు నాకగపడెను.
- Nehemiah 4:1–3 నెహెమ్యా 4:1–3మేము గోడ కట్టుచున్న సమాచారము విని సన్బల్లటు మిగుల కోపగించి రౌద్రుడై యూదులను ఎగతాళిచేసి షోమ్రోను దండువారి యెదుటను తన స్నేహితుల యెదు టను ఇట్లనెనుదుర్బలులైన యీ యూదులు ఏమి చేయుదురు? తమంతట తామే యీ పని ముగింతురా? బలులు అర్పించి బలపరచుకొందురా?ఒక దినమందే ముగింతురా?కాల్చబడిన చెత్తను కుప్పలుగాపడిన రాళ్లను మరల బలమైనవిగా చేయుదురా? మరియు అమ్మోనీయుడైన టోబీయా అతనియొద్దను ఉండివారు కట్టినదానిపైకి ఒక నక్క యెగిరినట్టయిన వారి రాతిగోడ పడిపోవుననెను.
- Psalm 122:6–9 కీర్తనలు 122:6–9యెరూషలేముయొక్క క్షేమముకొరకు ప్రార్థన చేయుడి యెరూషలేమా, నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు. నీ ప్రాకారములలో నెమ్మది కలుగును గాక. నీ నగరులలో క్షేమముండును గాక. నా సహోదరుల నిమిత్తమును నా సహవాసుల నిమి త్తమును నీకు క్షేమము కలుగును గాక అని నేనందును. మన దేవుడైన యెహోవా మందిరము నిమిత్తము నీకు మేలుచేయ ప్రయత్నించెదను.
Original words (Hebrew)
- Sanballat · H5571סַנְבַלַּט Çanballaṭ
- Horonite · H2772חֹרֹנִי Chôrônîy
- Tobiah · H2900טוֹבִיָּה Ṭôwbîyâh
- servant · H5650עֶבֶד ʻebed
- Ammonite · H5984עַמּוֹנִי ʻAmmôwnîy
- heard · H8085שָׁמַע shâmaʻ
- grieved · H3415יָרַע yâraʻ
- exceedingly · H7451רַע raʻ
- come · H935בּוֹא bôwʼ
- man · H120אָדָם ʼâdâm
- seek · H1245בָּקַשׁ bâqash
- welfare · H2896טוֹב ṭôwb
- children · H1121בֵּן bên
- Israel · H3478יִשְׂרָאֵל Yisrâʼêl