Numbers · chapter 18 · verse 12
Numbers 18:12 in Telugu
వారు యెహో వాకు అర్పించు వారి ప్రథమ ఫలములను, అనగా నూనెలో ప్రశస్తమైనదంతయు, ద్రాక్షారస ధాన్యములలో ప్రశస్త మైనదంతయు నీకిచ్చితిని.
Vaaru yeho vaaku arpinchu vaari prathama phalamulanu, anagaa noonelo prashastamainadantayu, draakshaarasa dhaanyamulalo prashasta mainadantayu neekichchitini.
Numbers 18:12 in English
- King James Version (KJV)
- All the best of the oil, and all the best of the wine, and of the wheat, the firstfruits of them which they shall offer unto the LORD, them have I given thee.
- World English Bible (WEB)
- “I have given to you all the best of the oil, all the best of the vintage, and of the grain, the first fruits of them which they give to the LORD.
- American Standard Version (ASV)
- All the best of the oil, and all the best of the vintage, and of the grain, the first-fruits of them which they give unto Jehovah, to thee have I given them.
- Bible in Basic English (BBE)
- All the best of the oil and the wine and the grain, the first-fruits of them which they give to the Lord, to you have I given them.
- Darby Translation (DBY)
- All the best of the oil, and all the best of the new wine, and of the wheat, the firstfruits of them which they give to Jehovah, have I given thee.
- Webster's Bible (WBS)
- All the best of the oil, and all the best of the wine, and of the wheat, the first-fruits of them which they shall offer to the LORD, them have I given to thee.
- Young's Literal Translation (YLT)
- all the best of the oil, and all the best of the new wine, and wheat — their first -[fruits] which they give to Jehovah — to thee I have given them.
Read in context
- 10ప్రతి మగ వాడును దానిని తినవలెను; అది నీకు పరిశుద్ధముగా ఉండును.
- 11మరియు వారి దానములలో ప్రతిష్ఠింపబడి నదియు, ఇశ్రాయేలీయులు అల్లాడించు అర్పణములన్నియు నీవగును. నీకును నీ కుమారులకును నీ కుమార్తెలకును నిత్యమైన కట్టడవలన వాటి నిచ్చితిని; నీ యింటిలోని పవిత్రులందరును వాటిని తినవచ్చును.
- 12వారు యెహో వాకు అర్పించు వారి ప్రథమ ఫలములను, అనగా నూనెలో ప్రశస్తమైనదంతయు, ద్రాక్షారస ధాన్యములలో ప్రశస్త మైనదంతయు నీకిచ్చితిని.
- 13వారు తమ దేశపు పంటలన్ని టిలో యెహోవాకు తెచ్చు ప్రథమ ఫలములు నీవి యగును; నీ యింటిలోని పవిత్రులందరు వాటిని తిన వచ్చును.
- 14ఇశ్రాయేలీయులలో మీదు కట్టబడిన ప్రతి వస్తువు నీదగును.
Cross references
- Exodus 23:19 నిర్గమకాండము 23:19నీ భూమి ప్రథమ ఫలములో మొదటివాటిని దేవుడైన యెహోవా మందిరమునకు తేవలెను. మేకపిల్లను దాని తల్లిపాలతో ఉడకబెట్టకూడదు.
- Deuteronomy 18:4 ద్వితీయోపదేశకాండము 18:4నీ ధాన్యములోను నీ ద్రాక్షారసములోను నీ నూనెలోను ప్రథమ ఫలములను నీ గొఱ్ఱెల మొదటి బొచ్చును అతని కియ్యవలెను.
- Exodus 34:26 నిర్గమకాండము 34:26నీ భూమి యొక్క ప్రథమఫలములలో మొదటివి నీ దేవుడైన యెహోవా మందిరములోనికి తేవలెను. మేకపిల్లను దాని తల్లిపాలతో ఉడకబెట్ట కూడదనెను.
- Deuteronomy 26:2 ద్వితీయోపదేశకాండము 26:2నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న నీ భూమిలోనుండి నీవు కూర్చుకొను భూఫలములన్నిటిలోను ప్రథమ ఫలములను తీసికొని గంపలో ఉంచి, నీ దేవుడైన యెహోవా తన నామ మునకు మందిరమును ఏర్పరచుకొను స్థలమునకు వెళ్లి
- Exodus 22:29 నిర్గమకాండము 22:29నీ మొదటి సస్యద్రవ్యములను అర్పింప తడవు చేయ కూడదు. నీ కుమారులలో జ్యేష్ఠుని నాకు అర్పింపవలెను.
- Leviticus 2:14 లేవీయకాండము 2:14నీవు యెహోవాకు ప్రథమఫలముల నైవేద్య మును చేయు నప్పుడు సారమైన భూమిలో పుట్టిన పచ్చని వెన్నులలోని ఊచబియ్యమును వేయించి విసిరి నీ ప్రథమఫలముల నైవేద్యముగా అర్పింపవలెను.
- Nehemiah 10:35–37 నెహెమ్యా 10:35–37మరియు మా భూమియొక్క ప్రథమ ఫలములను సకల వృక్షముల ప్రథమ ఫలము లను, ప్రతి సవంత్సరము ప్రభువు మందిరమునకు మేము తీసికొని వచ్చునట్లుగా నిర్ణయించుకొంటిమి మా కుమారులలో జ్యేష్ఠపుత్రులు, మా పశువులలో తొలిచూలులను, ధర్మశాస్త్రగ్రంథమందు వ్రాయబడినట్టు మా మందలలో తొలిచూలులను, మన దేవుని మందిరములో సేవచేయు యాజకులయొద్దకు మేము తీసికొని వచ్చునట్లుగా నిర్ణయించుకొంటిమి. ఇదియు గాక మా పిండిలో ప్రథమ ఫలము ప్రతిష్ఠార్పణలు సకలవిధమైనవృక్షముల ఫలములు ద్రాక్షారసము నూనె మొద లైన వాటిని మా దేవుని మందిరపు గదుల లోనికి యాజకుల యొద్దకు తెచ్చునట్లుగాను, మా భూమి పంటలో పదియవ వంతును లేవీయులయొ ద్దకు తీసికొని వచ్చునట్లుగా ప్రతి పట్టణములోనున్న మా పంటలో పదియవ వంతును ఆ లేవీయుల కిచ్చునట్లుగాను నిర్ణయించుకొంటిమి.
- Numbers 15:19–21 సంఖ్యాకాండము 15:19–21మీరు ఆ దేశపు ఆహారమును తినునప్పుడు ప్రతిష్ఠార్పణ మును యెహోవాకు అర్పింపవలెను. మీరు మీ మొదటి పిండిముద్ద రొట్టెను ప్రతిష్ఠార్పణముగా అర్పింపవలెను; కళ్లపు అర్పణమువలె దాని అర్పింపవలెను. మీ తరతరములకు మీ మొదటి పిండిముద్దలోనుండి ప్రతిష్ఠార్పణమును యెహోవాకు అర్పింపవలెను.
- Leviticus 23:20 లేవీయకాండము 23:20యాజకుడు ప్రథమఫల ముల రొట్టెలతో వాటిని ఆ రెండు పొట్టేళ్లను యెహోవా సన్నిధిని అల్లాడింపవలెను. అవి యెహోవాకు ప్రతి ష్ఠింపబడినవై యాజకునివగును.
- Leviticus 23:17 లేవీయకాండము 23:17మీరు మీ నివాసములలోనుండి తూములో రెండేసి పదియవవంతుల పిండిగల రెండు రొట్టెలను అల్లా డించు అర్పణముగా తేవలెను. వాటిని గోధుమపిండితో చేసి పులియబెట్టి కాల్చవలెను. అవి యెహోవాకు ప్రథమఫలముల అర్పణము.