Numbers · chapter 5 · verse 3
Numbers 5:3 in Telugu
నేను నివసించుచుండు వారి పాళెమును వారు అపవిత్ర పరచకుండునట్లు మగవానినేమి ఆడుదానినేమి అందరిని పంపివేయవలెను; వారిని ఆ పాళెము వెలుపలికి వెళ్లగొట్ట వలెను.
Nenu nivasinchuchundu vaari paalemunu vaaru apavitra parachakundunatlu magavaaninemi aadudaaninemi andarini pampiveyavalenu; vaarini aa paalemu velupaliki vellagotta valenu.
Numbers 5:3 in English
- King James Version (KJV)
- Both male and female shall ye put out, without the camp shall ye put them; that they defile not their camps, in the midst whereof I dwell.
- World English Bible (WEB)
- You shall put both male and female outside of the camp so that they don’t defile their camp, in the midst of which I dwell.”
- American Standard Version (ASV)
- both male and female shall ye put out, without the camp shall ye put them; that they defile not their camp, in the midst whereof I dwell.
- Bible in Basic English (BBE)
- Male or female they are to be put outside the tent-circle, so that they may not make unclean my resting-place among them.
- Darby Translation (DBY)
- both male and female shall ye put out; outside the camp shall ye put them, that they defile not their camps, in the midst whereof I dwell.
- Webster's Bible (WBS)
- Both male and female shall ye put out, without the camp shall ye put them; that they defile not their camps, in the midst of which I dwell.
- Young's Literal Translation (YLT)
- from male unto female ye do send out; unto the outside of the camp ye do send them; and they defile not their camps in the midst of which I do tabernacle.'
Read in context
- 1మరియు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను.
- 2ప్రతి కుష్ఠరోగిని, స్రావముగల ప్రతి వానిని, శవము ముట్టుటవలన అపవిత్రుడైన ప్రతి వానిని, పాళెములో నుండి వెలివేయవలెనని ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించుము.
- 3నేను నివసించుచుండు వారి పాళెమును వారు అపవిత్ర పరచకుండునట్లు మగవానినేమి ఆడుదానినేమి అందరిని పంపివేయవలెను; వారిని ఆ పాళెము వెలుపలికి వెళ్లగొట్ట వలెను.
- 4ఇశ్రాయేలీయులు ఆలాగు చేసిరి; పాళెము వెలుపలికి అట్టివారిని వెళ్లగొట్టిరి. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు ఇశ్రాయేలీయులు చేసిరి.
- 5మరియు యెహోవా మోషేకు ఈలాగు సెలవి చ్చెను నీవు ఇశ్రాయేలీయులతో
Cross references
- Deuteronomy 23:14 ద్వితీయోపదేశకాండము 23:14నీ దేవుడైన యెహోవా నిన్ను విడిపించుటకును నీ శత్రువు లను నీకు అప్పగించుటకును నీ పాళెములో సంచరించు చుండును గనుక ఆయన నీలో అసహ్యమైన దేనినైనను చూచి నిన్ను విడువకుండునట్లు నీ పాళెము పరిశుద్థముగా ఉండవలెను.
- Leviticus 26:11–12 లేవీయకాండము 26:11–12నా మందిరమును మీ మధ్య ఉంచెదను; మీ యందు నా మనస్సు అసహ్యపడదు. నేను మీ మధ్య నడిచెదను మీకు దేవుడనైయుందును; మీరు నాకు ప్రజలై యుందురు.
- Numbers 35:34 సంఖ్యాకాండము 35:34మీరు నివసించు దేశ మును అపవిత్ర పరచకూడదు. అందులో నేను మీ మధ్యను నివసించుచున్నాను. నిజముగా యెహోవా అను నేను ఇశ్రాయేలీయులమధ్య నివసించుచున్నాను.
- Revelation 21:3 ప్రకటన 21:3అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుష్యులతో కూడ ఉన్నది, ఆయన వారితో కాపురముండును, వారాయన ప్రజలైయుందురు, దేవుడు తానే వారి దేవుడైయుండి వారికి తోడైయుండును.
- Psalm 68:18 కీర్తనలు 68:18నీవు ఆరోహణమైతివి పట్టబడినవారిని చెరపట్టుకొని పోతివి మనుష్యులచేత నీవు కానుకలు తీసికొనియున్నావు. యెహోవా అను దేవుడు అక్కడ నివసించునట్లు విశ్వాసఘాతకులచేత సహితము నీవు కానుకలు తీసికొనియున్నావు.
- 2 Corinthians 6:16–17 2 కొరింథీయులకు 6:16–17దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమిపొందిక? మనము జీవముగల దేవుని ఆలయమై యున్నాము; అందుకు దేవుడీలాగు సెల విచ్చుచున్నాడు. నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడనై యుందును వారు నా ప్రజలైయుందురు. కావున మీరు వారి మధ్యనుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండుడి; అపవిత్రమైనదానిని ముట్టకుడని ప్రభువు చెప్పుచున్నాడు.
- Titus 3:10 తీతుకు 3:10మతభేదములు కలిగించు మనుష్యునికి ఒకటి రెండుమారులు బుద్ధిచెప్పిన తరువాత వానిని విసర్జించుము.
- 2 Thessalonians 3:6 2 థెస్సలొనీకయులకు 3:6సహోదరులారా, మావలన పొందిన బోధన ప్రకారముకాక అక్రమముగా నడుచుకొను ప్రతి సహోదరుని యొద్దనుండి తొలగిపోవలెనని మన ప్రభువైన యేసు క్రీస్తు పేరట మీకు ఆజ్ఞాపించుచున్నాము.
- 1 Corinthians 5:7–13 1 కొరింథీయులకు 5:7–13మీరు పులిపిండి లేనివారు గనుక క్రొత్తముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసిపారవేయుడి. ఇంతే కాక క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను గనుక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వమునను పులిపిండితోనైనను కాకుండ, నిష్కాపట్యమును సత్యమునను పులియని రొట్టెతో పండుగ ఆచరింతము. జారులతో సాంగత్యము చేయవద్దని నా పత్రికలో మీకు వ్రాసియుంటిని. అయితే ఈలోకపు జారులతోనైనను, లోభులతోనైనను, దోచుకొనువారితోనైనను, విగ్రహారాధకులతోనైనను, ఏమాత్రమును సాంగత్యము చేయవద్దని కాదు; ఆలాగైతే మీరు లోకములోనుండి వెళ్లిపోవలసివచ్చును గదా? ఇప్పుడైతే, సహోదరుడనబడిన వాడెవడైనను జారుడుగాని లోభిగాని విగ్రహారాధకుడుగాని తిట్టుబోతుగాని త్రాగుబోతుగాని దోచుకొనువాడుగాని అయియున్నయెడల, అట్టివానితో సాంగత్యము చేయకూడదు భుజింపనుకూడదని మీకు వ్రాయుచున్నాను. వెలుపలివారికి తీర్పు తీర్చుట నాకేల? వెలుపలివారికి దేవుడే తీర్పు తీర్చునుగాని మీరు లోపటివారికి తీర్పు తీర్చువారు గనుక ఆ దుర్మార్గుని మీలో నుండి వెలివేయుడి.
- Hebrews 12:15–16 హెబ్రీయులకు 12:15–16మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండ తప్పిపోవునేమో అనియు, చేదైన వేరు ఏదైనను మొలిచి కలవరపరచుటవలన అనేకులు అపవిత్రులై పోవుదురేమో అనియు, ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావువంటి భ్రష్టుడైనను వ్యభిచారియైనను ఉండునేమో అనియు, జాగ్రత్తగా చూచుకొనుడి.
- 1 Kings 7:3 1 రాజులు 7:3మరియు నలు వదియైదు స్తంభములమీద ప్రక్కగదులపైన దేవదారు కఱ్ఱలతో అది కప్పబడెను; ఆ స్తంభములు వరుస వరుసకు పైగా పదునైదేసి చొప్పున మూడు వరుసలు ఉండెను.
- Numbers 19:22 సంఖ్యాకాండము 19:22దాని ముట్టు మనుష్యులందరు సాయం కాలమువరకు అపవిత్రులై యుందురు.