Numbers · chapter 35 · verse 34
Numbers 35:34 in Telugu
మీరు నివసించు దేశ మును అపవిత్ర పరచకూడదు. అందులో నేను మీ మధ్యను నివసించుచున్నాను. నిజముగా యెహోవా అను నేను ఇశ్రాయేలీయులమధ్య నివసించుచున్నాను.
Meeru nivasinchu desha munu apavitra parachakoodadu. Andulo nenu mee madhyanu nivasinchuchunnaanu. Nijamugaa yehovaa anu nenu ishraayeleeyulamadhya nivasinchuchunnaanu.
Numbers 35:34 in English
- King James Version (KJV)
- Defile not therefore the land which ye shall inhabit, wherein I dwell: for I the LORD dwell among the children of Israel.
- World English Bible (WEB)
- You shall not defile the land which you inhabit, where I dwell; for I, the LORD, dwell among the children of Israel.’”
- American Standard Version (ASV)
- And thou shalt not defile the land which ye inhabit, in the midst of which I dwell: for I, Jehovah, dwell in the midst of the children of Israel.
- Bible in Basic English (BBE)
- Do not make unclean the land where you are living and in which is my House: for I the Lord am present among the children of Israel.
- Darby Translation (DBY)
- And ye shall not defile the land that ye inhabit, in the midst whereof I dwell; for I am Jehovah who dwell in the midst of the children of Israel.
- Webster's Bible (WBS)
- Defile not therefore the land which ye shall inhabit, in which I dwell: for I the LORD dwell among the children of Israel.
- Young's Literal Translation (YLT)
- and ye defile not the land in which ye are dwelling, in the midst of which I do tabernacle, for I Jehovah do tabernacle in the midst of the sons of Israel.'
Read in context
- 32మరియు ఆశ్రయపుర మునకు పారిపోయినవాడు యాజకుడు మృతినొందక మునుపు స్వదేశమందు నివసించునట్లు వానిచేత విమోచన ధనమును అంగీకరింపకూడదు.
- 33మీరుండు దేశమును అపవిత్రపరచకూడదు; నరహత్య దేశమును అపవిత్రపర చును గదా. దేశములో చిందిన రక్తము నిమిత్తము చిందించిన వాని రక్తమువలననే ప్రాయశ్చిత్తము కలుగును గాని మరి దేనివలనను కలుగదు.
- 34మీరు నివసించు దేశ మును అపవిత్ర పరచకూడదు. అందులో నేను మీ మధ్యను నివసించుచున్నాను. నిజముగా యెహోవా అను నేను ఇశ్రాయేలీయులమధ్య నివసించుచున్నాను.
Cross references
- Numbers 5:3 సంఖ్యాకాండము 5:3నేను నివసించుచుండు వారి పాళెమును వారు అపవిత్ర పరచకుండునట్లు మగవానినేమి ఆడుదానినేమి అందరిని పంపివేయవలెను; వారిని ఆ పాళెము వెలుపలికి వెళ్లగొట్ట వలెను.
- Revelation 21:27 ప్రకటన 21:27గొఱ్ఱెపిల్లయొక్క జీవగ్రంథమందు వ్రాయ బడినవారే దానిలో ప్రవేశింతురు గాని నిషిద్ధమైన దేదైనను, అసహ్యమైనదానిని అబద్ధమైనదానిని జరిగించు వాడైనను దానిలోనికి ప్రవేశింపనే ప్రవేశింపడు.
- Psalm 135:21 కీర్తనలు 135:21యెరూషలేములో నివసించు యెహోవా సీయోనులోనుండి సన్నుతింపబడును గాక యెహోవాను స్తుతించుడి.
- 2 Corinthians 6:16–17 2 కొరింథీయులకు 6:16–17దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమిపొందిక? మనము జీవముగల దేవుని ఆలయమై యున్నాము; అందుకు దేవుడీలాగు సెల విచ్చుచున్నాడు. నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడనై యుందును వారు నా ప్రజలైయుందురు. కావున మీరు వారి మధ్యనుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండుడి; అపవిత్రమైనదానిని ముట్టకుడని ప్రభువు చెప్పుచున్నాడు.
- Psalm 132:14 కీర్తనలు 132:14ఇది నేను కోరినస్థానము, ఇది నిత్యము నాకు విశ్రమ స్థానముగా నుండును ఇక్కడనే నేను నివసించెదను
- Isaiah 57:15 యెషయా 57:15మహా ఘనుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్యనివాసియునైనవాడు ఈలాగు సెల విచ్చుచున్నాడు నేను మహోన్నతమైన పరిశుద్ధస్థలములో నివసించు వాడను అయినను వినయముగలవారి ప్రాణమును ఉజ్జీవింప జేయుటకును నలిగినవారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును వినయముగలవారియొద్దను దీనమనస్సుగలవారియొద్దను నివసించుచున్నాను.
- Exodus 25:8 నిర్గమకాండము 25:8నేను వారిలో నివసించునట్లు వారు నాకు పరిశుద్ధస్థలమును నిర్మింపవలెను.
- Leviticus 20:24–26 లేవీయకాండము 20:24–26నేను మీతో చెప్పిన మాట యిదేమీరు వారి భూమిని స్వాస్థ్య ముగా పొందుదురు; అది, అనగా పాలు తేనెలు ప్రవ హించు ఆ దేశము, మీకు స్వాస్థ్యముగా ఉండునట్లు దాని మీకిచ్చెదను. జనములలోనుండి మిమ్మును వేరుపర చిన మీ దేవుడనైన యెహోవాను నేనే. కావున మీరు పవిత్ర జంతువులకును అపవిత్ర జంతువులకును పవిత్ర పక్షులకును అపవిత్ర పక్షులకును విభజన చేయవలెను. అపవిత్రమైనదని నేను మీకు వేరుచేసిన యే జంతువువల ననేగాని, యే పక్షివలననేగాని, నేల మీద ప్రాకు దేనివల ననేగాని మిమ్మును మీరు అపవిత్రపరచుకొనకూడదు. మీరు నాకు పరిశుద్ధులై యుండవలెను. యెహోవా అను నేను పరిశుద్ధుడను. మీరు నావారై యుండునట్లు అన్య జనులలోనుండి మిమ్మును వేరుపరచితిని.
- Exodus 29:45–46 నిర్గమకాండము 29:45–46నేను ఇశ్రాయేలీ యుల మధ్య నివసించి వారికి దేవుడనై యుందును. కావున నేను వారి మధ్య నివసించునట్లు ఐగుప్తు దేశములో నుండి వారిని వెలుపలికి రప్పించిన తమ దేవుడైన యెహో వాను నేనే అని వారు తెలిసికొందురు. నేను వారి దేవుడనైన యెహోవాను.
- Hosea 9:3 హోషేయ 9:3ఎఫ్రాయిమీయులు ఐగుప్తు నకు మరలుదురు, అష్షూరు దేశములో వారు అపవిత్ర మైన వాటిని తిందురు, యెహోవా దేశములో వారు నివసింపకూడదు.
- 1 Kings 6:13 1 రాజులు 6:13నా జనులైన ఇశ్రాయేలీయులను విడిచిపెట్టక నేను వారిమధ్య నివాసము చేసెదను.
- Leviticus 18:24–25 లేవీయకాండము 18:24–25వీటిలో దేనివలనను అపవిత్రత కలుగజేసికొన కూడదు. నేను మీ యెదుటనుండి వెళ్లగొట్టుచున్న జనములు వా టన్నిటివలన అపవిత్రులైరి. ఆ దేశము అపవిత్రత కలది గనుక నేను దానిమీద దాని దోష శిక్షను మోపుచున్నాను. ఆ దేశమందు కాపురమున్న వారిని వెళ్లగ్రక్కి వేయుచున్నది.