Proverbs · chapter 11 · verse 20
Proverbs 11:20 in Telugu
మూర్ఖచిత్తులు యెహోవాకు హేయులు యథార్థముగా ప్రవర్తించువారు ఆయనకిష్టులు.
Moorkhachittulu yehovaaku heyulu yathaarthamugaa pravartinchuvaaru aayanakishtulu.
Proverbs 11:20 in English
- King James Version (KJV)
- They that are of a froward heart [are] abomination to the LORD: but [such as are] upright in [their] way [are] his delight.
- World English Bible (WEB)
- Those who are perverse in heart are an abomination to the LORD, but those whose ways are blameless are his delight.
- American Standard Version (ASV)
- They that are perverse in heart are an abomination to Jehovah; But such as are perfect in [their] way are his delight.
- Bible in Basic English (BBE)
- The uncontrolled are hated by the Lord, but those whose ways are without error are his delight
- Darby Translation (DBY)
- The perverse in heart are abomination to Jehovah; but they that are perfect in [their] way are his delight.
- Webster's Bible (WBS)
- They that are of a froward heart [are] abomination to the LORD: but [such as are] upright in [their] way [are] his delight.
- Young's Literal Translation (YLT)
- An abomination to Jehovah [are] the perverse of heart, And the perfect of the way [are] His delight.
Read in context
- 18భక్తిహీనుని సంపాదన వానిని మోసము చేయును నీతిని విత్తువాడు శాశ్వతమైన బహుమానము నొందును.
- 19యథార్థమైన నీతి జీవదాయకము దుష్టక్రియలు విడువక చేయువాడు తన మరణమునకే చేయును
- 20మూర్ఖచిత్తులు యెహోవాకు హేయులు యథార్థముగా ప్రవర్తించువారు ఆయనకిష్టులు.
- 21నిశ్చయముగా భక్తిహీనునికి శిక్ష తప్పదు. నీతిమంతుల సంతానము విడిపింపబడును.
- 22వివేకములేని సుందరస్త్రీ పంది ముక్కుననున్న బంగారు కమ్మివంటిది.
Cross references
- Psalm 119:1 కీర్తనలు 119:1(ఆలెఫ్) యెహోవా ధర్మశాస్త్రము ననుసరించి నిర్దోషముగా నడుచుకొనువారు ధన్యులు
- 1 Chronicles 29:17 1 దినవృత్తాంతములు 29:17నా దేవా, నీవు హృదయ పరిశోధనచేయుచు యథార్థవంతులయందు ఇష్టపడుచున్నావని నేనెరుగుదును; నేనైతే యథార్థహృదయము గలవాడనై యివి యన్నియు మనఃపూర్వకముగా ఇచ్చి యున్నాను; ఇప్పుడు ఇక్కడనుండు నీ జనులును నీకు మనఃపూర్వకముగా ఇచ్చుట చూచి సంతోషించుచున్నాను.
- Psalm 140:13 కీర్తనలు 140:13నిశ్చయముగా నీతిమంతులు నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదరు యథార్థవంతులు నీ సన్నిధిని నివసించెదరు.
- Proverbs 21:29 సామెతలు 21:29భక్తిహీనుడు తన ముఖమును మాడ్చుకొనును యథార్థవంతుడు తన ప్రవర్తనను చక్క పరచుకొనును.
- Proverbs 8:13 సామెతలు 8:13యెహోవాయందు భయభక్తులు గలిగియుండుట చెడుతనము నసహ్యించుకొనుటయే. గర్వము అహంకారము దుర్మార్గత కుటిలమైన మాటలు నాకు అసహ్యములు.
- Psalm 51:6 కీర్తనలు 51:6నీవు అంతరంగములో సత్యము కోరుచున్నావు ఆంతర్యమున నాకు జ్ఞానము తెలియజేయుదువు.
- Psalm 18:25–26 కీర్తనలు 18:25–26దయగలవారియెడల నీవు దయచూపించుదువు యథార్థవంతులయెడల యథార్థవంతుడవుగా నుందువు సద్భావముగలవారియెడల నీవు సద్భావము చూపు దువు. మూర్ఖులయెడల నీవు వికటముగా నుందువు
- Psalm 11:7 కీర్తనలు 11:7యెహోవా నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించు వాడుయథార్థవంతులు ఆయన ముఖదర్శనము చేసెదరు.
- Proverbs 6:14 సామెతలు 6:14వాని హృదయము అతిమూర్ఖ స్వభావముగలది వాడెల్లప్పుడు కీడు కల్పించుచు జగడములు పుట్టించును.
- Proverbs 15:8 సామెతలు 15:8భక్తిహీనులు అర్పించు బలులు యెహోవాకు హేయములు యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము.
- Proverbs 6:16–19 సామెతలు 6:16–19యెహోవాకు అసహ్యములైనవి ఆరు గలవు ఏడును ఆయనకు హేయములు అవేవనగా, అహంకారదృష్టియు కల్లలాడు నాలుకయు నిరపరాధులను చంపు చేతులును దుర్యోచనలు యోచించు హృదయమును కీడు చేయుటకు త్వరపడి పరుగులెత్తు పాదములును లేనివాటిని పలుకు అబద్ధసాక్షియు అన్నదమ్ములలో జగడములు పుట్టించువాడును.
- Proverbs 16:17 సామెతలు 16:17చెడుతనము విడిచి నడచుటయే యథార్థవంతులకు రాజమార్గము తన ప్రవర్తన కనిపెట్టువాడు తన ప్రాణమును కాపాడుకొనును.