Proverbs · chapter 13 · verse 8
Proverbs 13:8 in Telugu
ఒకని ప్రాణమునకు వాని ఐశ్వర్యముప్రాయశ్చిత్తము చేయును దరిద్రుడు బెదరింపు మాటలు వినడు.
Okani praanamunaku vaani aishvaryamupraayashchittamu cheyunu daridrudu bedarimpu maatalu vinadu.
Proverbs 13:8 in English
- King James Version (KJV)
- The ransom of a man’s life [are] his riches: but the poor heareth not rebuke.
- World English Bible (WEB)
- The ransom of a man’s life is his riches, but the poor hear no threats.
- American Standard Version (ASV)
- The ransom of a man’s life is his riches; But the poor heareth no threatening.
- Bible in Basic English (BBE)
- A man will give his wealth in exchange for his life; but the poor will not give ear to sharp words.
- Darby Translation (DBY)
- The ransom of a man's life is his riches; but the indigent heareth not rebuke.
- Webster's Bible (WBS)
- The ransom of a man's life [is] his riches: but the poor heareth not rebuke.
- Young's Literal Translation (YLT)
- The ransom of a man's life [are] his riches, And the poor hath not heard rebuke.
Read in context
- 6యథార్థవర్తనునికి నీతియే రక్షకము భక్తిహీనత పాపులను చెరిపివేయును.
- 7ధనవంతులమని చెప్పుకొనుచు లేమిడి గలవారు కలరు దరిద్రులమని చెప్పుకొనుచు బహు ధనముగలవారు కలరు.
- 8ఒకని ప్రాణమునకు వాని ఐశ్వర్యముప్రాయశ్చిత్తము చేయును దరిద్రుడు బెదరింపు మాటలు వినడు.
- 9నీతిమంతుల వెలుగు తేజరిల్లును భక్తిహీనుల దీపము ఆరిపోవును.
- 10గర్వమువలన జగడమే పుట్టును ఆలోచన వినువానికి జ్ఞానము కలుగును.
Cross references
- Matthew 16:26 మత్తయి 16:26ఒక మనుష్యుడు లోకమంతయు సంపాదించు కొని తన ప్రాణమును పోగొట్టుకొంటే అతనికేమి ప్రయో జనము? ఒక మనుష్యుడు తన ప్రాణమునకు ప్రతిగా నేమి యియ్యగలడు?
- 1 Peter 1:18–19 1 పేతురు 1:18–19పితృపారంపర్యమైన మీ వ్యర్థప్రవర్తనను విడిచిపెట్టునట్లుగా వెండి బంగారములవంటి క్షయ వస్తువులచేత మీరు విమోచింపబడలేదుగాని అమూల్యమైన రక్తముచేత, అనగా నిర్దోషమును నిష్కళంకమునగు గొఱ్ఱెపిల్లవంటి క్రీస్తు రక్తముచేత, విమోచింపబడితిరని మీరెరుగుదురు గదా
- 2 Kings 24:14 2 రాజులు 24:14అదియుగాక అతడు దేశపు జనులలో అతి బీదలైనవారు తప్ప మరి ఎవరును లేకుండ యెరూషలేము పట్టణమంతటిలోనున్న అధిపతులను పరాక్రమశాలులను పదివేలమందిని, వీరు గాక కంసాలివారిని కమ్మరివారిని చెరతీసికొని పోయెను.
- Psalm 49:6–10 కీర్తనలు 49:6–10తమ ఆస్తియే ప్రాపకమని నమ్మి తమ ధన విస్తారతనుబట్టి పొగడుకొనువారికి నేనేల భయపడవలెను? ఎవడును ఏ విధముచేతనైనను తన సహోదరుని విమోచింపలేడు వాడు కుళ్లు చూడక నిత్యము బ్రతుకునట్లు వాని నిమిత్తము దేవుని సన్నిధిని ప్రాయశ్చిత్తము చేయగలవాడు ఎవడును లేడు వారి ప్రాణవిమోచన ధనము బహు గొప్పది అది ఎన్నటికిని తీరక అట్లుండవలసినదే. జ్ఞానులు చనిపోదురను సంగతి అతనికి కనబడకుండ పోదు మూర్ఖులును పశుప్రాయులును ఏకముగా నశింతురు.
- Job 2:4 యోబు 2:4అపవాదిచర్మము కాపాడు కొనుటకై చర్మమును, తన ప్రాణమును కాపాడుకొనుటకై తనకు కలిగినది యావత్తును నరుడిచ్చును గదా.
- Jeremiah 39:10 యిర్మీయా 39:10అయితే రాజదేహసంరక్షకుల కధిపతి యైన నెబూజరదాను లేమిగల దరిద్రులను యూదాదేశములో నుండనిచ్చి, వారికి ద్రాక్షతోటలను పొలములను నియమించెను.
- Zephaniah 3:12 జెఫన్యా 3:12దుఃఖితులగు దీనులను యెహోవా నామము నాశ్రయించు జనశేషముగా నీమధ్య నుండ నిత్తును.
- 2 Kings 25:12 2 రాజులు 25:12వ్యవసాయదారులును ద్రాక్షతోట వారును ఉండవలెనని దేశపు బీదజనములో కొందరిని ఉండనిచ్చెను.
- Exodus 21:30 నిర్గమకాండము 21:30వానికి పరిక్రయధనము నియమింపబడినయెడల వానికి నియమింపబడిన అన్నిటి ప్రకారము తన ప్రాణ విమోచన నిమిత్తము ధనము చెల్లింపవలెను.
- Proverbs 6:35 సామెతలు 6:35ప్రాయశ్చిత్తమేమైన నీవు చేసినను వాడు లక్ష్యపెట్టడు ఎంత గొప్ప బహుమానములు నీవిచ్చినను వాడు ఒప్పుకొనడు.
- Jeremiah 41:8 యిర్మీయా 41:8అయితే వారిలో పదిమంది మనుష్యులు ఇష్మాయేలుతో పొలములలో దాచబడిన గోధుమలు యవలు తైలము తేనె మొదలైన ద్రవ్యములు మాకు కలవు, మమ్మును చంపకుమని చెప్పుకొనగా అతడు వారి సహోదరులతో కూడ వారిని చంపక మానెను.