Proverbs · chapter 17 · verse 22
Proverbs 17:22 in Telugu
సంతోషముగల మనస్సు ఆరోగ్యకారణము. నలిగిన మనస్సు ఎముకలను ఎండిపోజేయును.
Santoshamugala manassu aarogyakaaranamu. Naligina manassu emukalanu endipojeyunu.
Proverbs 17:22 in English
- King James Version (KJV)
- A merry heart doeth good [like] a medicine: but a broken spirit drieth the bones.
- World English Bible (WEB)
- A cheerful heart makes good medicine, but a crushed spirit dries up the bones.
- American Standard Version (ASV)
- A cheerful heart is a good medicine; But a broken spirit drieth up the bones.
- Bible in Basic English (BBE)
- A glad heart makes a healthy body, but a crushed spirit makes the bones dry.
- Darby Translation (DBY)
- A joyful heart promoteth healing; but a broken spirit drieth up the bones.
- Webster's Bible (WBS)
- A merry heart doeth good [like] a medicine: but a broken spirit drieth the bones.
- Young's Literal Translation (YLT)
- A rejoicing heart doth good to the body, And a smitten spirit drieth the bone.
Read in context
- 20కుటిలవర్తనుడు మేలుపొందడు మూర్ఖముగా మాటలాడువాడు కీడులో పడును.
- 21బుద్ధిహీనుని కనినవానికి వ్యసనము కలుగును తెలివిలేనివాని తండ్రికి సంతోషము లేదు.
- 22సంతోషముగల మనస్సు ఆరోగ్యకారణము. నలిగిన మనస్సు ఎముకలను ఎండిపోజేయును.
- 23న్యాయవిధులను చెరుపుటకై దుష్టుడు ఒడిలోనుండి లంచము పుచ్చుకొనును.
- 24జ్ఞానము వివేకముగలవాని యెదుటనే యున్నది బుద్ధిహీనువి కన్నులు భూదిగంతములలో ఉండును.
Cross references
- Proverbs 15:13 సామెతలు 15:13సంతోషహృదయము ముఖమునకు తేటనిచ్చును. మనోదుఃఖమువలన ఆత్మ నలిగిపోవును.
- Proverbs 12:25 సామెతలు 12:25ఒకని హృదయములోని విచారము దాని క్రుంగ జేయును దయగల మాట దాని సంతోషపెట్టును.
- Proverbs 18:14 సామెతలు 18:14నరుని ఆత్మ వాని వ్యాధి నోర్చును నలిగిన హృదయమును ఎవడు సహింపగలడు?
- 2 Corinthians 7:10 2 కొరింథీయులకు 7:10దైవచిత్తాను సారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సును కలుగజేయును; ఈ మారుమనస్సు దుఃఖమును పుట్టించదు. అయితే లోకసంబంధమైన దుఃఖము మరణమును కలుగజేయును.
- Romans 5:2–5 రోమీయులకు 5:2–5మరియు ఆయనద్వారా మనము విశ్వాసమువలన ఈ కృపయందు ప్రవేశముగల వారమై, అందులో నిలిచియుండి, దేవుని మహిమను గూర్చిన నిరీక్షణనుబట్టి అతిశయ పడుచున్నాము. అంతే కాదు; శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగజేయునని యెరిగి శ్రమలయందును అతిశయపడుదము. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడియున్నది.
- Ecclesiastes 9:7–9 ప్రసంగి 9:7–9నీవు పోయి సంతోషముగా నీ అన్నము తినుము, ఉల్లాసపు మనస్సుతో నీ ద్రాక్షారసము త్రాగుము; ఇది వరకే దేవుడు నీ క్రియలను అంగీకరించెను. ఎల్లప్పుడు తెల్లని వస్త్రములు ధరించుకొనుము, నీ తలకు నూనె తక్కువచేయకుము. దేవుడు నీకు దయచేసిన వ్యర్థమైన నీ ఆయుష్కాలమంతయు నీవు ప్రేమించు నీ భార్యతో సుఖించుము, నీ వ్యర్థమైన ఆయుష్కాలమంతయు సుఖించుము, ఈ బ్రదుకునందు నీవు కష్టపడి చేసికొనిన దాని యంతటికి అదే నీకు కలుగు భాగము.
- 2 Corinthians 2:7 2 కొరింథీయులకు 2:7గనుక మీరిక వానిని శిక్షింపక క్షమించి ఆదరించుట మంచిది. లేనియెడల ఒకవేళ వాడు అత్యధికమైన దుఃఖములో మునిగిపోవును.
- Psalm 102:3–5 కీర్తనలు 102:3–5పొగ యెగిరిపోవునట్లుగా నా దినములు తరిగిపోవు చున్నవి పొయిలోనిది కాలిపోయినట్లు నా యెముకలు కాలి పోయి యున్నవి. ఎండదెబ్బకు వాడిన గడ్డివలె నా హృదయము వాడి పోయి యున్నది భోజనము చేయుటకే నేను మరచిపోవు చున్నాను. నా మూల్గుల శబ్దమువలన నా యెముకలు నా దేహమునకు అంటుకొని పోయినవి.
- Psalm 22:15 కీర్తనలు 22:15నా బలము యెండిపోయి చిల్లపెంకువలె ఆయెను నా నాలుక నా దౌడను అంటుకొని యున్నదినీవు నన్ను ప్రేతల భూమిలో పడవేసి యున్నావు.
- Psalm 32:3–4 కీర్తనలు 32:3–4నేను మౌనినై యుండగా దినమంతయు నేను చేసిన నా ఆర్తధ్వనివలన నాయెముకలు క్షీణించినవి. దివారాత్రులు నీ చెయ్యి నామీద బరువుగా నుండెను నా సారము వేసవికాలమున ఎండినట్టాయెను. (సెలా. )