Proverbs · chapter 18 · verse 1
Proverbs 18:1 in Telugu
వేరుండగోరువాడు స్వేచ్ఛానుసారముగా నడచువాడు అట్టివాడు లెస్సైన జ్ఞానమునకు విరోధి. బుద్ధిహీనుడు వివేచనయందు సంతోషింపక
Verundagoruvaadu svechchhaanusaaramugaa nadachuvaadu attivaadu lessaina jnyaanamunaku virodhi. Buddhiheenudu vivechanayandu santoshimpaka
Proverbs 18:1 in English
- King James Version (KJV)
- Through desire a man, having separated himself, seeketh [and] intermeddleth with all wisdom.
- World English Bible (WEB)
- A man who isolates himself pursues selfishness, and defies all sound judgment.
- American Standard Version (ASV)
- He that separateth himself seeketh [his own] desire, And rageth against all sound wisdom.
- Bible in Basic English (BBE)
- He who keeps himself separate for his private purpose goes against all good sense.
- Darby Translation (DBY)
- He that separateth himself seeketh [his] pleasure, he is vehement against all sound wisdom.
- Webster's Bible (WBS)
- Through desire a man, having separated himself, seeketh [and] intermeddleth with all wisdom.
- Young's Literal Translation (YLT)
- For [an object of] desire he who is separated doth seek, With all wisdom he intermeddleth.
Read in context
- 1వేరుండగోరువాడు స్వేచ్ఛానుసారముగా నడచువాడు అట్టివాడు లెస్సైన జ్ఞానమునకు విరోధి. బుద్ధిహీనుడు వివేచనయందు సంతోషింపక
- 2తన అభిప్రాయములను బయలుపరచుటయందు సంతో షించును.
- 3భక్తిహీనుడు రాగానే తిరస్కారము వచ్చును అవమానము రాగానే నింద వచ్చును.
Cross references
- Ephesians 5:15–17 ఎఫెసీయులకు 5:15–17దినములు చెడ్డవి గనుక, మీరు సమయమును పోనియ్యక సద్వినియోగము చేసికొనుచు, అజ్ఞానులవలె కాక, జ్ఞానులవలె నడుచుకొనునట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభువుయొక్క చిత్తమేమిటో గ్రహించుకొనుడి.
- Proverbs 2:1–6 సామెతలు 2:1–6నా కుమారుడా, నీవు నా మాటల నంగీకరించి నా ఆజ్ఞలను నీయొద్ద దాచుకొనినయెడల జ్ఞానమునకు నీ చెవియొగ్గి హృదయపూర్వకముగా వివేచన నభ్యసించినయెడల తెలివికై మొఱ్ఱపెట్టిన యెడల వివేచనకై మనవి చేసినయెడల వెండిని వెదకినట్లు దాని వెదకిన యెడల దాచబడిన ధనమును వెదకినట్లు దాని వెదకిన యెడల యెహోవాయందు భయభక్తులు కలిగియుండుట యెట్టిదో నీవు గ్రహించెదవు దేవునిగూర్చిన విజ్ఞానము నీకు లభించును. యెహోవాయే జ్ఞానమిచ్చువాడు తెలివియు వివేచనయు ఆయన నోటనుండి వచ్చును.
- Proverbs 20:3 సామెతలు 20:3కలహమునకు దూరముగా నుండుట నరులకు ఘనత మూర్ఖుడైన ప్రతివాడును పోరునే కోరును.
- Jeremiah 15:17 యిర్మీయా 15:17సంతోషించు వారి సమూహములో నేను కూర్చుండలేదు నేను ఉల్ల సింపలేదు. కడుపు మంటతో నీవు నన్ను నింపి యున్నావు గనుక, నీ హస్తమునుబట్టి నేను ఏకాకినై కూర్చుంటిని.
- Proverbs 24:21 సామెతలు 24:21నా కుమారుడా, యెహోవాను ఘనపరచుము రాజును ఘనపరచుము ఆలాగు చేయనివారి జోలికి పోకుము.
- Jude 1:19 యూదా 1:19అట్టివారు ప్రకృతి సంబంధులును ఆత్మ లేనివారునైయుండి భేదములు కలుగజేయుచున్నారు.
- Mark 1:35 మార్కు 1:35ఆయన పెందలకడనే లేచి యింకను చాలా చీకటియుండగానే బయలుదేరి, అరణ్యప్రదేశమునకు వెళ్లి, అక్కడ ప్రార్థన చేయుచుండెను.
- Isaiah 26:8–9 యెషయా 26:8–9మేము నీకొరకు కనిపెట్టుకొనుచున్నాము మా ప్రాణము నీ నామమును నీ స్మరణను ఆశించు చున్నది. రాత్రివేళ నా ప్రాణము నిన్ను ఆశించుచున్నది నాలోనున్న ఆత్మ ఆసక్తితో నిన్ను ఆశ్రయించు చున్నది. నీ తీర్పులు లోకమునకు రాగా లోకనివాసులు నీతిని నేర్చుకొందురు.
- Proverbs 14:10 సామెతలు 14:10ఎవని దుఃఖము వాని హృదయమునకే తెలియును ఒకని సంతోషములో అన్యుడు పాలివాడు కానేరడు.
- Matthew 13:44 మత్తయి 13:44పరలోకరాజ్యము, పొలములో దాచబడిన ధనమును పోలియున్నది. ఒక మనుష్యుడు దాని కనుగొని దాచి పెట్టి, అది దొరికిన సంతోషముతో వెళ్లి, తనకు కలిగిన దంతయు అమ్మి ఆ పొలమును కొనును.
- Proverbs 26:17 సామెతలు 26:17తనకు పట్టని జగడమునుబట్టి రేగువాడు దాటిపోవుచున్న కుక్క చెవులు పట్టుకొనువానితో సమానుడు.
- Exodus 33:16 నిర్గమకాండము 33:16నాయెడలను నీ ప్రజలయెడలను నీకు కటాక్షము కలిగినదని దేని వలన తెలియబడును? నీవు మాతో వచ్చుటవలననే గదా? అట్లు మేము, అనగా నేనును నీ ప్రజలును భూమిమీదనున్న సమస్త ప్రజలలోనుండి ప్రత్యేకింపబడుదుమని ఆయనతో చెప్పెను.