Proverbs · chapter 22 · verse 9
Proverbs 22:9 in Telugu
దయాదృష్టిగలవాడు తన ఆహారములో కొంత దరిద్రుని కిచ్చును అట్టివాడు దీవెననొందును.
Dayaadrushtigalavaadu tana aahaaramulo konta daridruni kichchunu attivaadu deevenanondunu.
Proverbs 22:9 in English
- King James Version (KJV)
- He that hath a bountiful eye shall be blessed; for he giveth of his bread to the poor.
- World English Bible (WEB)
- He who has a generous eye will be blessed, for he shares his food with the poor.
- American Standard Version (ASV)
- He that hath a bountiful eye shall be blessed; For he giveth of his bread to the poor.
- Bible in Basic English (BBE)
- He who is kind will have a blessing, for he gives of his bread to the poor.
- Darby Translation (DBY)
- He that hath a bountiful eye shall be blessed, for he giveth of his bread to the poor.
- Webster's Bible (WBS)
- He that hath a bountiful eye shall be blessed; for he giveth of his bread to the poor.
- Young's Literal Translation (YLT)
- The good of eye — he is blessed, For he hath given of his bread to the poor.
Read in context
- 7ఐశ్వర్యవంతుడు బీదలమీద ప్రభుత్వము చేయును అప్పుచేయువాడు అప్పిచ్చినవానికి దాసుడు.
- 8దౌష్ట్యమును విత్తువాడు కీడును కోయును వాని క్రోధమను దండము కాలిపోవును.
- 9దయాదృష్టిగలవాడు తన ఆహారములో కొంత దరిద్రుని కిచ్చును అట్టివాడు దీవెననొందును.
- 10తిరస్కారబుద్ధిగలవాని తోలివేసినయెడల కలహములు మానును పోరు తీరి అవమానము మానిపోవును.
- 11హృదయశుద్ధిని ప్రేమించుచు దయగల మాటలు పలుకువానికి రాజు స్నేహితుడగును.
Cross references
- Proverbs 19:17 సామెతలు 19:17బీదలను కనికరించువాడు యెహోవాకు అప్పిచ్చు వాడు వాని ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారము చేయును.
- Hebrews 6:10 హెబ్రీయులకు 6:10మీరు చేసిన కార్యమును, మీరు పరిశుద్ధులకు ఉపచారముచేసి యింకను ఉపచారము చేయుచుండుటచేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు, దేవుడు అన్యాయస్థుడు కాడు.
- 1 Timothy 6:18–19 1 తిమోతికి 6:18–19వారు వాస్తవమైన జీవమును సంపాదించుకొను నిమిత్తము, రాబోవు కాలమునకు మంచి పునాది తమకొరకు వేసి కొనుచు, మేలుచేయువారును, సత్క్రియలు అను ధనము గలవారును, ఔదార్యముగలవారును, తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారునై యుండవలెనని వారికి ఆజ్ఞా పించుము.
- Acts 20:35 అపొస్తలుల కార్యములు 20:35మీరును ఈలాగు ప్రయాసపడి బలహీనులను సంరక్షింపవలెననియు పుచ్చుకొనుటకంటె ఇచ్చుట ధన్యము అని ప్రభువైన యేసు చెప్పిన మాటలు జ్ఞాపకము చేసికొనవలెననియు అన్ని విషయములలో మీకు మాదిరి చూపితినని చెప్పెను.
- 1 Peter 4:9 1 పేతురు 4:9సణుగుకొనకుండ ఒకనికి ఒకడు ఆతిథ్యము చేయుడి.
- Hebrews 13:16 హెబ్రీయులకు 13:16ఉపకారమును ధర్మమును చేయ మరచిపోకుడి, అట్టి యాగములు దేవుని కిష్టమైనవి.
- Psalm 112:9 కీర్తనలు 112:9వాడు దాతృత్వము కలిగి బీదలకిచ్చును వాని నీతి నిత్యము నిలుచును వాని కొమ్ము ఘనత నొంది హెచ్చింపబడును.
- Luke 14:13 లూకా 14:13అయితే నీవు విందు చేయునప్పుడు బీదలను అంగహీనులను కుంటివాండ్రను గ్రుడ్డివాండ్రను పిలువుము.
- Isaiah 32:8 యెషయా 32:8ఘనులు ఘనకార్యములు కల్పించుదురు వారు ఘనకార్యములనుబట్టి నిలుచుదురు.
- Deuteronomy 15:7–11 ద్వితీయోపదేశకాండము 15:7–11నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశమందు నీ పురములలో ఎక్కడనైనను నీ సహోదరులలో ఒక బీద వాడు ఉండినయెడల బీదవాడైన నీ సహోదరుని కరుణింప కుండ నీ హృదయమును కఠినపరచు కొనకూడదు. నీ చెయ్యి ముడుచుకొనక వానికొరకు అవశ్యముగా చెయ్యి చాచి, వాని అక్కరచొప్పున ఆ యక్కరకు చాలినంత అవశ్యముగా వానికి అప్పియ్యవలెను. విడుదల సంవత్సర మైన యేడవసంవత్సరము సమీపమైనదని చెడ్డతలంపు నీ మనస్సులో పుట్టక యుండునట్లు జాగ్రత్తపడుము. బీద వాడైన నీ సహోదరునియెడల కటాక్షము చూపక నీవు వానికేమియు ఇయ్యక పోయినయెడల వాడొకవేళ నిన్ను గూర్చి యెహోవాకు మొఱ్ఱపెట్టును; అది నీకు పాప మగును. నీవు నిశ్చయముగా వానికియ్యవలెను. వాని కిచ్చినందుకు మనస్సులో విచారపడకూడదు. ఇందువలన నీ దేవుడైన యెహోవా నీ కార్యములన్నిటిలోను నీవు చేయు ప్రయత్నములన్నిటిలోను నిన్ను ఆశీర్వదించును. బీదలు దేశములో ఉండకమానరు. అందుచేత నేనునీ దేశములోనున్న నీ సహోదరులగు దీనులకును బీదలకును అవశ్యముగా నీ చెయ్యి చాపవలెనని నీ కాజ్ఞాపించు చున్నాను.
- 2 Corinthians 9:6–11 2 కొరింథీయులకు 9:6–11కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంటకోయును, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంటకోయును అని యీ విషయమై చెప్పవచ్చును. సణుగుకొనకయు బలవంతముగా కాకయు ప్రతివాడును తన హృదయములో నిశ్చయించుకొనిన ప్రకారము ఇయ్య వలెను; దేవుడు ఉత్సాహముగా ఇచ్చువానిని ప్రేమించును. మరియు అన్నిటియందు ఎల్లప్పుడును మీలో మీరు సర్వసమృద్ధిగలవారై ఉత్తమమైన ప్రతికార్యము చేయుటకు దేవుడు మీయెడల సమస్త విధములైన కృపను విస్తరింపచేయగలడు. ఇందు విషయమై అతడు వెదజల్లి దరిద్రులకిచ్చెను అతని నీతి నిరంతరము నిలుచును అని వ్రాయబడియున్నది. విత్తువానికి విత్తనమును తినుటకు ఆహారమును దయచేయు దేవుడు మీకు విత్తనము దయచేసి విస్తరింపచేసి, మీరు ప్రతి విషయములో పూర్ణౌదార్య భాగ్యముగలవారగునట్లు, మీ నీతిఫలములు వృద్ధిపొం దించును. ఇట్టి, ఔదార్యమువలన మాద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబడును.
- Isaiah 58:7–12 యెషయా 58:7–12నీ ఆహారము ఆకలిగొనినవారికి పెట్టుటయు నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండుటయు దిక్కుమాలిన బీదలను నీ యింట చేర్చుకొనుటయు వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రము లిచ్చుటయు ఇదియే గదా నాకిష్టమైన ఉపవాసము? ఆలాగున నీవు చేసినయెడల నీ వెలుగు వేకువ చుక్క వలె ఉదయించును స్వస్థత నీకు శీఘ్రముగా లభించును నీ నీతి నీ ముందర నడచును యెహోవా మహిమ నీ సైన్యపు వెనుకటి భాగమును కావలికాయును. అప్పుడు నీవు పిలువగా యెహోవా ఉత్తర మిచ్చును నీవు మొఱ్ఱపెట్టగా ఆయన నేనున్నాననును. ఇతరులను బాధించుటయు వ్రేలుపెట్టి చూపి తిరస్కరించుటయు చెడ్డదానినిబట్టి మాటలాడుటయు నీవు మాని ఆశించినదానిని ఆకలిగొనినవానికిచ్చి శ్రమపడినవానిని తృప్తిపరచినయెడల చీకటిలో నీ వెలుగు ప్రకాశించును అంధకారము నీకు మధ్యాహ్నమువలె నుండును. యెహోవా నిన్ను నిత్యము నడిపించును క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరచి నీ యెముక లను బలపరచును నీవు నీరు కట్టిన తోటవలెను ఎప్పుడును ఉబుకుచుండు నీటి ఊటవలెను ఉండెదవు. పూర్వకాలమునుండి పాడైపోయిన స్థలములను నీ జనులు కట్టెదరు అనేకతరముల క్రిందట పాడైపోయిన పునాదులను నీవు మరల కట్టెదవు విరుగబడినదానిని బాగుచేయువాడవనియు దేశములో నివసించునట్లుగా త్రోవలు సిద్ధపరచువాడ వనియు నీకు పేరు పెట్టబడును. ఆయన నీతియే ఆయనకు ఆధారమాయెను.