Proverbs · chapter 24 · verse 7
Proverbs 24:7 in Telugu
మూర్ఖునికి జ్ఞానము అందదు గుమ్మమునొద్ద అట్టివారు మౌనులై యుందురు.
Moorkhuniki jnyaanamu andadu gummamunodda attivaaru maunulai yunduru.
Proverbs 24:7 in English
- King James Version (KJV)
- Wisdom [is] too high for a fool: he openeth not his mouth in the gate.
- World English Bible (WEB)
- Wisdom is too high for a fool. He doesn’t open his mouth in the gate.
- American Standard Version (ASV)
- Wisdom is too high for a fool: He openeth not his mouth in the gate.
- Bible in Basic English (BBE)
- Wisdom is outside the power of the foolish: he keeps his mouth shut in the public place.
- Darby Translation (DBY)
- Wisdom is too high for a fool: he will not open his mouth in the gate.
- Webster's Bible (WBS)
- Wisdom [is] too high for a fool: he openeth not his mouth in the gate.
- Young's Literal Translation (YLT)
- Wisdom [is] high for a fool, In the gate he openeth not his mouth.
Read in context
- 5జ్ఞానముగలవాడు బలవంతుడుగా నుండును తెలివిగలవాడు శక్తిమంతుడుగా నుండును.
- 6వివేకముగల నాయకుడవై యుద్ధముచేయుము. ఆలోచన చెప్పువారు అనేకులుండుట రక్షణకరము
- 7మూర్ఖునికి జ్ఞానము అందదు గుమ్మమునొద్ద అట్టివారు మౌనులై యుందురు.
- 8కీడుచేయ పన్నాగములు పన్నువానికి తంటాలమారి అని పేరు పెట్టబడును.
- 9మూర్ఖుని యోచన పాపము అపహాసకులు నరులకు హేయులు.
Cross references
- Proverbs 14:6 సామెతలు 14:6అపహాసకుడు జ్ఞానము వెదకుట వ్యర్థము. తెలివిగలవానికి జ్ఞానము సులభము.
- 1 Corinthians 2:14 1 కొరింథీయులకు 2:14ప్రకృతి సంబంధియైన మనుష్యుడు దేవుని ఆత్మ విషయ ములను అంగీకరింపడు, అవి అతనికి వెఱ్ఱితనముగా ఉన్నవి, అవి ఆత్మానుభవముచేతనే వివేచింపదగును గనుక అతడు వాటిని గ్రహింపజాలడు.
- Psalm 10:5 కీర్తనలు 10:5వారెల్లప్పడు భయము మానుకొని ప్రవర్తింతురు నీ న్యాయవిధులు ఉన్నతమైనవై వారి దృష్టికి అందకుండును. వారు తమ శత్రువులనందరిని చూచి తిరస్కరింతురు.
- Psalm 92:5–6 కీర్తనలు 92:5–6యెహోవా, నీ కార్యములు ఎంత దొడ్డవి! నీ ఆలోచనలు అతిగంభీరములు, పశుప్రాయులు వాటిని గ్రహింపరు అవివేకులు వివేచింపరు.
- Amos 5:12 ఆమోసు 5:12మీ అప రాధములు విస్తారములైనవనియు, మీ పాపములు ఘోరమైనవనియు నేనెరుగుదును. దరిద్రులయొద్ద పంట మోపులను పుచ్చుకొనుచు మీరు వారిని అణగద్రొక్కు దురు గనుక మలుపురాళ్లతో మీరు ఇండ్లుకట్టుకొనినను వాటిలో మీరు కాపురముండరు, శృంగారమైన ద్రాక్ష తోటలు మీరు నాటినను ఆ పండ్ల రసము మీరు త్రాగరు.
- Job 5:4 యోబు 5:4అతని పిల్లలు సంరక్షణ దొరకక యుందురుగుమ్మములో నలిగిపోవుదురువారిని విడిపించువాడెవడును లేడు.
- Proverbs 17:24 సామెతలు 17:24జ్ఞానము వివేకముగలవాని యెదుటనే యున్నది బుద్ధిహీనువి కన్నులు భూదిగంతములలో ఉండును.
- Job 29:7–25 యోబు 29:7–25పట్టణపు గుమ్మమునకు నేను వెళ్లినప్పుడు రాజవీధిలో నా పీఠము సిద్ధపరచుకొనినప్పుడు ¸యౌవనులు నన్ను చూచి దాగుకొనిరి ముసలివారు లేచి నిలువబడిరి. అధికారులు మాటలాడుట మాని నోటిమీద చెయ్యివేసికొనిరి. ప్రధానులు మాటలాడక ఊరకొనిరి వారి నాలుక వారి అంగిలికి అంటుకొనెను. నా సంగతి చెవినిబడిన ప్రతివాడు నన్ను అదృష్ట వంతునిగా ఎంచెను. నేను కంటబడిన ప్రతివాడు నన్నుగూర్చి సాక్ష్యమిచ్చెను. ఏలయనగా మొఱ్ఱపెట్టిన దీనులను తండ్రిలేనివారిని సహాయములేనివారిని నేను విడి పించితిని. నశించుటకు సిద్ధమైయున్నవారి దీవెన నామీదికి వచ్చెను విధవరాండ్ర హృదయమును సంతోషపెట్టితిని నేను నీతిని వస్త్రముగా ధరించుకొని యుంటిని గనుక అది నన్ను ధరించెను నా న్యాయప్రవర్తన నాకు వస్త్రమును పాగాయు ఆయెను. గ్రుడ్డివారికి నేను కన్నులైతిని కుంటివారికి పాదము లైతిని. దరిద్రులకు తండ్రిగా ఉంటిని ఎరుగనివారి వ్యాజ్యెమును నేను శ్రద్ధగా విచారించితిని. దుర్మార్గుల దవడపళ్లను ఊడగొట్టితిని. వారి పళ్లలోనుండి దోపుడుసొమ్మును లాగివేసితిని. అప్పుడు నేనిట్లనుకొంటినినా గూటియొద్దనే నేను చచ్చెదను హంసవలె నేను దీర్ఘాయువు గలవాడనవుదును. నా వేళ్లచుట్టు నీళ్లు వ్యాపించును మంచు నా కొమ్మలమీద నిలుచును. నాకు ఎడతెగని ఘనత కలుగును నా చేతిలో నా విల్లు ఎప్పటికిని బలముగా నుండును. మనుష్యులు నాకు చెవియొగ్గి నా కొరకు కాచుకొనిరి నా ఆలోచన వినవలెనని మౌనముగా ఉండిరి. నేను మాటలాడిన తరువాత వారు మారు మాట పలుక కుండిరి. గుత్తులు గుత్తులుగా నా మాటలు వారిమీద పడెను. వర్షముకొరకు కనిపెట్టునట్లు వారు నాకొరకు కని పెట్టుకొనిరి కడవరి వానకొరకైనట్లు వారు వెడల్పుగా నోరుతెరచుకొనిరి. వారు ఆశారహితులై యుండగా వారిని దయగా చూచి చిరునవ్వు నవి్వతిని నా ముఖప్రకాశము లేకుండ వారేమియు చేయరైరి. నేను వారికి పెద్దనై కూర్చుండి వారికి మార్గములను ఏర్పరచితిని సేనలో రాజువలెను దుఃఖించువారిని ఓదార్చువానివలెను నేనుంటిని.
- Amos 5:10 ఆమోసు 5:10అయితే గుమ్మములో నిలిచి బుద్ధి చెప్పువారి మీద జనులు పగపట్టుదురు; యథార్థముగా మాటలాడు వారిని అసహ్యించుకొందురు.
- Proverbs 15:24 సామెతలు 15:24క్రిందనున్న పాతాళమును తప్పించుకొనవలెనని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవమార్గమున నడచు కొనును
- Amos 5:15 ఆమోసు 5:15కీడును ద్వేషించి మేలును ప్రేమించుచు, గుమ్మములలో న్యాయము స్థిరపరచుడి; ఒక వేళ దేవుడును సైన్యముల కధిపతియునగు యెహోవా యోసేపు సంతతిలో శేషించినవారియందు కనికరించును.
- Job 31:21 యోబు 31:21నా భుజశల్యము దాని గూటినుండి పడును గాక నా బాహువు ఎముకలోనికి విరుగును గాక.