Proverbs · chapter 28 · verse 17
Proverbs 28:17 in Telugu
ప్రాణము తీసి దోషము కట్టుకొనినవాడు గోతికి పరుగెత్తుచున్నాడు ఎవరును అట్టివానిని ఆపకూడదు.
Praanamu teesi doshamu kattukoninavaadu gotiki parugettuchunnaadu evarunu attivaanini aapakoodadu.
Proverbs 28:17 in English
- King James Version (KJV)
- A man that doeth violence to the blood of [any] person shall flee to the pit; let no man stay him.
- World English Bible (WEB)
- A man who is tormented by blood guilt will be a fugitive until death. No one will support him.
- American Standard Version (ASV)
- A man that is laden with the blood of any person Shall flee unto the pit; let no man stay him.
- Bible in Basic English (BBE)
- One who has been the cause of a man's death will go in flight to the underworld: let no man give him help.
- Darby Translation (DBY)
- A man laden with the blood of [any] person, fleeth to the pit: let no man stay him.
- Webster's Bible (WBS)
- A man that doeth violence to the blood of [any] person shall flee to the pit; let no man stay him.
- Young's Literal Translation (YLT)
- A man oppressed with the blood of a soul, Unto the pit fleeth, none taketh hold on him.
Read in context
- 15బొబ్బరించు సింహమును తిరుగులాడు ఎలుగుబంటియు దరిద్రులైన జనుల నేలు దుష్టుడును సమానములు.
- 16వివేకములేనివాడవై జనులను అధికముగా బాధపెట్టు అధికారీ, దుర్లాభమును ద్వేషించువాడు దీర్ఘాయుష్మంతుడగును.
- 17ప్రాణము తీసి దోషము కట్టుకొనినవాడు గోతికి పరుగెత్తుచున్నాడు ఎవరును అట్టివానిని ఆపకూడదు.
- 18యథార్థముగా ప్రవర్తించువాడు రక్షింపబడును మూర్ఖప్రవర్తన గలవాడు హఠాత్తుగా పడిపోవును.
- 19తన పొలము సేద్యము చేసికొనువానికి కడుపునిండన్నము దొరకును వ్యర్థమైనవాటిని అనుసరించువారికి కలుగు పేదరికము ఇంతంతకాదు.
Cross references
- Genesis 9:6 ఆదికాండము 9:6నరుని రక్తమును చిందించు వాని రక్తము నరునివలననే చిందింపబడును; ఏలయనగా దేవుడు తన స్వరూపమందు నరుని చేసెను.
- Exodus 21:14 నిర్గమకాండము 21:14అయితే ఒకడు తన పొరుగువానిమీద దౌర్జన్యముగా వచ్చి కపటముగా చంప లేచినయెడల వాడు నా బలిపీఠము నాశ్రయించినను వాని లాగివేసి చంపవలెను.
- 1 Kings 21:19 1 రాజులు 21:19నీవు అతని చూచి యీలాగు ప్రకటిం చుముయెహోవా సెలవిచ్చునదేమనగాదీని స్వాధీన పరచుకొనవలెనని నీవు నాబోతును చంపితివిగదా. యెహోవా సెలవిచ్చునదేమనగాఏ స్థలమందు కుక్కలు నాబోతు రక్తమును నాకెనో ఆ స్థలమందే కుక్కలు నీ రక్తమును నిజముగా నాకునని అతనితో చెప్పెను.
- 2 Chronicles 24:21–25 2 దినవృత్తాంతములు 24:21–25అందుకు వారతనిమీద కుట్రచేసి, రాజు మాటనుబట్టి యెహోవా మందిరపు ఆవరణములోపల రాళ్లు రువి్వ అతని చావగొట్టిరి. ఈ ప్రకారము రాజైన యోవాషు జెకర్యా తండ్రియైన యెహోయాదా తనకు చేసిన ఉప కారమును మరచినవాడై అతని కుమారుని చంపించెను; అతడు చనిపోవునప్పుడుయెహోవా దీని దృష్టించి దీనిని విచారణలోనికి తెచ్చునుగాక యనెను. ఆ సంవత్సరాంతమందు సిరియా సైన్యము యోవాషు మీదికి వచ్చెను; వారు యూదాదేశముమీదికిని యెరూష లేముమీదికిని వచ్చి, శేషములేకుండ జనుల అధిపతులనందరిని హతముచేసి, తాము పట్టుకొనిన కొల్లసొమ్మంతయు దమస్కు రాజునొద్దకు పంపిరి. సిరియనులు చిన్నదండుతో వచ్చినను యూదావారు తమ పితరుల దేవుడైన యెహోవాను విసర్జించినందుకై యెహోవా వారి చేతికి అతివిస్తార మైన ఆ సైన్యమును అప్పగింపగా యోవాషుకు శిక్ష కలిగెను. వారు యోవాషును విడచిపోయినప్పుడు అతడు మిక్కిలి రోగియై యుండెను. అప్పుడు యాజకుడైన యెహోయాదా కుమారుల ప్రాణహత్యదోషము నిమిత్తము అతని సేవకులు అతనిమీద కుట్రచేసి, అతడు పడకమీద ఉండగా అతని చంపిరి. అతడు చనిపోయిన తరు వాత జనులు దావీదు పట్టణమందు అతని పాతి పెట్టిరి గాని రాజుల సమాధులలో అతని పాతిపెట్టలేదు.
- 1 Kings 21:23 1 రాజులు 21:23మరియు యెజెబెలునుగూర్చి యెహోవా సెలవిచ్చున దేమనగాయెజ్రెయేలు ప్రాకారమునొద్ద కుక్కలు యెజెబెలును తినివేయును.
- Numbers 35:14–34 సంఖ్యాకాండము 35:14–34వాటిలో యొర్దాను ఇవతల మూడు పురములను ఇయ్య వలెను, కనాను దేశములో మూడు పురములను ఇయ్య వలెను. అవి మీకు ఆశ్రయ పురములుగా ఉండును. పొరబాటున ఒకని చంపిన యెవడైనను వాటిలోనికి పారి పోవునట్లు ఆ ఆరు పురములు ఇశ్రాయేలీయులకును పర దేశులకును మీ మధ్య నివసించువారికిని ఆశ్రయమై యుండును. ఒకడు చచ్చునట్లు వానిని ఇనుప ఆయుధ ముతో కొట్టువాడు నరహంతకుడు ఆ నరహంతకునికి నిశ్చయముగా మరణశిక్ష విధింపవలెను. ఒకడు చచ్చు నట్లు మరియొకడు రాతితో వాని కొట్టగా దెబ్బతినిన వాడు చనిపోయినయెడల కొట్టినవాడు నరహంతకుడగును. ఆ నరహంతకుడు నిశ్చయముగా మరణశిక్ష నొందును. మరియు ఒకడు చచ్చునట్లు మరియొకడు చేతికఱ్ఱతో కొట్టగా దెబ్బ తినినవాడు చనిపోయిన యెడల కొట్టిన వాడు నర హంతకుడగును. ఆ నరహంత కుడు నిశ్చయముగా మరణశిక్ష నొందును. హత్య విషయములో ప్రతిహత్య చేయువాడు తానే నరహంత కుని చంపవలెను. వాని కనుగొనినప్పుడు వాని చంప వలెను. ఒకడు చచ్చునట్లు వాని పగపట్టి పొడిచినను, లేక పొంచియుండి వానిమీద దేనినైనను వేసినను, లేక ఒకడు చచ్చునట్లు వైరమువలన చేతితో వాని కొట్టినను, కొట్టినవాడు నరహంతకుడు, నిశ్చయముగా వాని చంప వలెను. నరహత్య విషయములో ప్రతిహత్య చేయు వాడు ఆ నరహంతకుని కనుగొనినప్పుడు వాని చంపవలెను. అయితే పగపట్టక హఠాత్తుగా వానిని పొడిచి నను, పొంచియుండక వానిమీద ఏ ఆయుధమునైన వేసినను, వాని చూడక ఒకడు చచ్చునట్లు వానిమీద రాయి పడవేసినను, దెబ్బతినినవాడు చనిపోయిన యెడల కొట్టిన వాడు వానిమీద పగపట్టలేదు, వానికి హానిచేయ గోరలేదు. కాబట్టి సమాజము ఈ విధులనుబట్టి కొట్టిన వానికిని హత్యవిషయములో ప్రతిహత్య చేయువానికిని తీర్పుతీర్చవలెను. అట్లు సమాజము నరహత్య విషయ ములో ప్రతిహత్య చేయువాని చేతిలోనుండి ఆ నరహంత కుని విడిపింపవలెను. అప్పుడు సమాజము వాడు పారి పోయిన ఆశ్రయ పురమునకు వాని మరల పంపవలెను. వాడు పరిశుద్ధ తైలముతో అభిషేకింపబడిన ప్రధాన యాజకుడు మృతినొందువరకు అక్కడనే నివసింపవలెను. అయితే ఆ నరహంతకుడు ఎప్పుడైనను తాను పారిపోయి చొచ్చిన ఆశ్రయపురముయొక్క సరిహద్దును దాటి వెళ్లు నప్పుడు నరహత్యవిషయములో ప్రతిహత్య చేయువాడు ఆశ్రయపురముయొక్క సరిహద్దు వెలుపల వాని కను గొనినయెడల, ఆ ప్రతిహంతకుడు ఆ నరహంతకుని చంపినను వానిమీద ప్రాణముతీసిన దోషము ఉండదు. ఏలయనగా ప్రధానయాజకుడు మృతినొందువరకు అతడు ఆశ్రయపురములోనే నివసింపవలెను. ప్రధానయాజకుడు మృతినొందిన తరువాత ఆ నరహంతకుడు తన స్వాస్థ్యమున్న దేశము నకు తిరిగి వెళ్లవచ్చును. ఇవి మీ సమస్త నివాసస్థలము లలో మీ తరతరములకు మీకు విధింపబడిన కట్టడ. ఎవడైనను ఒకని చావగొట్టిన యెడల సాక్షుల నోటిమాట వలన ఆ నరహంతకునికి మరణశిక్ష విధింపవలెను. ఒక సాక్షిమాటమీదనే యెవనికిని మరణశిక్ష విధింప కూడదు. చావతగిన నరహంతకుని ప్రాణముకొరకు మీరు విమోచన ధనమును అంగీకరింపక నిశ్చయముగా వానికి మరణశిక్ష విధింపవలెను. మరియు ఆశ్రయపుర మునకు పారిపోయినవాడు యాజకుడు మృతినొందక మునుపు స్వదేశమందు నివసించునట్లు వానిచేత విమోచన ధనమును అంగీకరింపకూడదు. మీరుండు దేశమును అపవిత్రపరచకూడదు; నరహత్య దేశమును అపవిత్రపర చును గదా. దేశములో చిందిన రక్తము నిమిత్తము చిందించిన వాని రక్తమువలననే ప్రాయశ్చిత్తము కలుగును గాని మరి దేనివలనను కలుగదు. మీరు నివసించు దేశ మును అపవిత్ర పరచకూడదు. అందులో నేను మీ మధ్యను నివసించుచున్నాను. నిజముగా యెహోవా అను నేను ఇశ్రాయేలీయులమధ్య నివసించుచున్నాను.
- Matthew 27:4–5 మత్తయి 27:4–5నేను నిరపరాధరక్తమును అప్పగించి పాపము చేసితినని చెప్పెను. వారుదానితో మాకేమి? నీవే చూచుకొనుమని చెప్పగా అతడు ఆ వెండి నాణ ములు దేవాలయములో పారవేసి, పోయి ఉరిపెట్టు కొనెను.
- Acts 28:4 అపొస్తలుల కార్యములు 28:4ఆ ద్వీపవాసులు ఆ జంతువతని చేతిని వ్రేలాడుట చూచినప్పుడు నిశ్చయముగా ఈ మనుష్యుడు నరహంతకుడు; ఇతడు సముద్రమునుండి తప్పించుకొనినను న్యాయమాతనిని బ్రదుకనియ్యదని తమలో తాము చెప్పు కొనిరి.
- 2 Kings 9:26 2 రాజులు 9:26అప్పుడు యెహోవా సెలవిచ్చినదేమనగా నిశ్చయముగా నాబోతు రక్తమును వాని కుమారుల రక్తమును నిన్నటి దినమున నేను చూచితిని గనుక ఈ భూభాగమందు నేను దానికి ప్రతికారము చేయుదును; ఇదే యెహోవా వాక్కు. కాబట్టి నీవు యెహోవా మాట చొప్పున అతని ఎత్తి యీ భూభాగమందు పడవేయుము అనెను.