Proverbs · chapter 28 · verse 19
Proverbs 28:19 in Telugu
తన పొలము సేద్యము చేసికొనువానికి కడుపునిండన్నము దొరకును వ్యర్థమైనవాటిని అనుసరించువారికి కలుగు పేదరికము ఇంతంతకాదు.
Tana polamu sedyamu chesikonuvaaniki kadupunindannamu dorakunu vyarthamainavaatini anusarinchuvaariki kalugu pedarikamu intantakaadu.
Proverbs 28:19 in English
- King James Version (KJV)
- He that tilleth his land shall have plenty of bread: but he that followeth after vain [persons] shall have poverty enough.
- World English Bible (WEB)
- One who works his land will have an abundance of food; but one who chases fantasies will have his fill of poverty.
- American Standard Version (ASV)
- He that tilleth his land shall have plenty of bread; But he that followeth after vain [persons] shall have poverty enough.
- Bible in Basic English (BBE)
- By ploughing his land a man will have bread in full measure; but he who goes after good-for-nothing persons will be poor enough.
- Darby Translation (DBY)
- He that tilleth his land shall be satisfied with bread; but he that followeth the worthless shall have poverty enough.
- Webster's Bible (WBS)
- He that tilleth his land shall have plenty of bread: but he that followeth after vain [persons] shall have poverty enough.
- Young's Literal Translation (YLT)
- Whoso is tilling his ground is satisfied [with] bread, And whoso is pursuing vanity, Is filled [with] poverty.
Read in context
- 17ప్రాణము తీసి దోషము కట్టుకొనినవాడు గోతికి పరుగెత్తుచున్నాడు ఎవరును అట్టివానిని ఆపకూడదు.
- 18యథార్థముగా ప్రవర్తించువాడు రక్షింపబడును మూర్ఖప్రవర్తన గలవాడు హఠాత్తుగా పడిపోవును.
- 19తన పొలము సేద్యము చేసికొనువానికి కడుపునిండన్నము దొరకును వ్యర్థమైనవాటిని అనుసరించువారికి కలుగు పేదరికము ఇంతంతకాదు.
- 20నమ్మకమైనవానికి దీవెనలు మెండుగా కలుగును. ధనవంతుడగుటకు ఆతురపడువాడు శిక్షనొందకపోడు.
- 21పక్షపాతము చూపుట మంచిది కాదు రొట్టెముక్కకొరకు ఒకడు దోషముచేయును.
Cross references
- Proverbs 12:11 సామెతలు 12:11తన భూమిని సేద్యపరచుకొనువానికి ఆహారము సమృద్ధిగా కలుగును వ్యర్థమైనవాటిని అనుసరించువాడు బుద్ధిలేనివాడు.
- Judges 9:4 న్యాయాధిపతులు 9:4అప్పుడు వారు బయల్బెరీతు గుడిలోనుండి డెబ్బది తులముల వెండి తెచ్చి అతనికియ్యగా వాటితో అబీమెలెకు అల్లరిజనమును కూలికి పెట్టుకొనెను, వారు అతని వశమున నుండిరి.
- Proverbs 13:20 సామెతలు 13:20జ్ఞానుల సహవాసము చేయువాడు జ్ఞానముగలవా డగును. మూర్ఖుల సహవాసము చేయువాడు చెడిపోవును.
- Proverbs 27:23–27 సామెతలు 27:23–27నీ పశువుల స్థితి జాగ్రత్తగా తెలిసికొనుము నీ మందలయందు మనస్సు ఉంచుము. ధనము శాశ్వతము కాదు కిరీటము తరతరములు ఉండునా? ఎండిన గడ్డి వామివేయబడెను పచ్చిక కనబడు చున్నది కొండగడ్డి యేరబడియున్నది నీ వస్త్రములకొరకు గొఱ్ఱెపిల్లలున్నవి ఒక చేని క్రయధనమునకు పొట్టేళ్లు సరిపోవును నీ ఆహారమునకు నీ యింటివారి ఆహారమునకు నీ పనికత్తెల జీవనమునకు మేకపాలు సమృద్ధియగును.
- Proverbs 23:20–21 సామెతలు 23:20–21ద్రాక్షారసము త్రాగువారితోనైనను మాంసము హెచ్చుగాతినువారితోనైనను సహవాసము చేయకుము. త్రాగుబోతులును తిండిపోతులును దరిద్రులగుదురు. నిద్రమత్తు చింపిగుడ్డలు ధరించుటకు కారణమగును.
- Proverbs 14:4 సామెతలు 14:4ఎద్దులు లేని చోట గాదెయందు ధాన్యముండదు ఎద్దుల బలముచేత విస్తారము వచ్చుబడి కలుగును
- Luke 15:12–17 లూకా 15:12–17వారిలో చిన్నవాడు తండ్రీ, ఆస్తిలో నాకువచ్చు భాగమిమ్మని తన తండ్రి నడు గగా, అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టెను. కొన్నిదినములైన తరువాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూర దేశమునకు ప్రయాణమై పోయి, అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారమువలన పాడుచేసెను. అదంతయు ఖర్చు చేసిన తరువాత ఆ దేశమందు గొప్ప కరవు రాగా వాడు ఇబ్బంది పడ సాగి, వెళ్లి ఆ దేశస్థులలో ఒకనిచెంత జేరెను. అతడు పందులను మేపుటకు తన పొలములలోనికి వానిని పంపెను. వాడు పందులు తిను పొట్టుతో తన కడుపు నింపుకొన అశపడెను గాని యెవడును వాని కేమియు ఇయ్యలేదు. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రియొద్ద ఎంతోమంది కూలివాండ్రకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోవు చున్నాను.