Proverbs · chapter 28 · verse 23
Proverbs 28:23 in Telugu
నాలుకతో ఇచ్చకములాడు వానికంటె నరులను గద్దించువాడు తుదకు ఎక్కువ దయపొందును.
Naalukato ichchakamulaadu vaanikante narulanu gaddinchuvaadu tudaku ekkuva dayapondunu.
Proverbs 28:23 in English
- King James Version (KJV)
- He that rebuketh a man afterwards shall find more favour than he that flattereth with the tongue.
- World English Bible (WEB)
- One who rebukes a man will afterward find more favor than one who flatters with the tongue.
- American Standard Version (ASV)
- He that rebuketh a man shall afterward find more favor Than he that flattereth with the tongue.
- Bible in Basic English (BBE)
- He who says words of protest to a man will later have more approval than one who says smooth words with his tongue.
- Darby Translation (DBY)
- He that rebuketh a man shall afterwards find more favour than he that flattereth with the tongue.
- Webster's Bible (WBS)
- He that rebuketh a man afterward shall find more favor than he that flattereth with the tongue.
- Young's Literal Translation (YLT)
- Whoso is reproving a man afterwards findeth grace, More than a flatterer with the tongue.
Read in context
- 21పక్షపాతము చూపుట మంచిది కాదు రొట్టెముక్కకొరకు ఒకడు దోషముచేయును.
- 22చెడు దృష్టిగలవాడు ఆస్తి సంపాదింప ఆతురపడును తనకు దరిద్రత వచ్చునని వానికి తెలియదు.
- 23నాలుకతో ఇచ్చకములాడు వానికంటె నరులను గద్దించువాడు తుదకు ఎక్కువ దయపొందును.
- 24తన తలిదండ్రుల సొమ్ము దోచుకొని అది ద్రోహముకాదనుకొనువాడు నశింపజేయువానికి జతకాడు.
- 25పేరాసగలవాడు కలహమును రేపును యెహోవాయందు నమ్మకముంచువాడు వర్ధిల్లును.
Cross references
- Proverbs 27:5–6 సామెతలు 27:5–6లోలోపల ప్రేమించుటకంటె బహిరంగముగా గద్దించుట మేలు మేలును కోరి స్నేహితుడు గాయములు చేయును పగవాడు లెక్కలేని ముద్దులుపెట్టును.
- Matthew 18:15 మత్తయి 18:15మరియు నీ సహోదరుడు నీయెడల తప్పిదము చేసిన యెడల నీవు పోయి, నీవును అతడును ఒంటరిగానున్నప్పుడు అతనిని గద్దించుము; అతడు నీ మాట వినినయెడల నీ సహోదరుని సంపాదించుకొంటివి.
- Psalm 141:5 కీర్తనలు 141:5నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకము నేను అట్టి అభిషేకమును త్రోసివేయకుందును గాక. వారి దుష్టక్రియలను చూచియు నేను తప్పక ప్రార్థనచేయుచున్నాను.
- 1 Kings 1:32–40 1 రాజులు 1:32–40అప్పుడు రాజైన దావీదుయాజకుడైన సాదోకును ప్రవక్త యైన నాతానును యెహోయాదా కుమారుడైన బెనా యాను నాయొద్దకు పిలువుమని సెలవియ్యగా వారు రాజు సన్నిధికి వచ్చిరి. అంతట రాజుమీరు మీ యేలిన వాడనైన నా సేవకులను పిలుచుకొని పోయి నా కుమారు డైన సొలొమోనును నా కంచర గాడిదమీద ఎక్కించి గిహోనునకు తీసికొనిపోయి యాజకుడైన సాదోకును ప్రవక్తయైన నాతానును అక్కడ ఇశ్రాయేలీయులమీద రాజుగా అతనికి పట్టాభిషేకము చేసిన తరువాత మీరు బాకానాదము చేసిరాజైన సొలొమోను చిరంజీవి యగునుగాక అని ప్రకటన చేయవలెను. ఇశ్రాయేలు వారిమీదను యూదావారిమీదను నేనతనిని అధికారిగా నియమించి యున్నాను గనుక పిమ్మట మీరు యెరూష లేమునకు అతని వెంటరాగా అతడు నా సింహాసనముమీద ఆసీనుడై నాకు ప్రతిగా రాజగును అని సెలవిచ్చెను. అందుకు యెహోయాదా కుమారుడైన బెనాయా రాజు నకు ప్రత్యుత్తరముగా ఇట్లనెనుఆలాగు జరుగును గాక, నా యేలినవాడవును రాజవునగు నీ దేవుడైన యెహోవా ఆ మాటను స్థిరపరచును గాక. యెహోవా నా యేలిన వాడవును రాజవునగు నీకు తోడుగా నుండినట్లు ఆయన సొలొమోనునకు తోడుగానుండి, నా యేలినవాడైన రాజగు దావీదుయొక్క రాజ్యముకంటె అతని రాజ్యము ఘనముగా చేయునుగాక అనెను; కాబట్టి యాజకుడైన సాదోకును ప్రవక్తయైన నాతానును యెహోయాదా కుమారుడైన బెనాయాయును కెరేతీయులును పెలేతీయు లును రాజైన దావీదు కంచరగాడిదమీద సొలొమోనును ఎక్కించి గిహోనునకు తీసికొని రాగా యాజకుడైన సాదోకు గుడారములోనుండి తైలపు కొమ్మును తెచ్చి సొలొమోనునకు పట్టాభిషేకము చేసెను. అప్పుడు వారు బాకా ఊదగా కూడిన జనులందరునురాజైన సొలొమోను చిరంజీవియగునుగాక అని కేకలువేసిరి మరియు ఆ జనులందరును అతని వెంబడివచ్చి పిల్లనగ్రోవులను ఊదుచు, వాటి నాదముచేత నేల బద్దలగునట్లు అత్యధిక ముగా సంతోషించిరి.
- Galatians 2:11 గలతీయులకు 2:11అయితే కేఫా అంతియొకయకు వచ్చినప్పుడు అతడు అపరాధిగా తీర్చబడెను గనుక నేను ముఖాముఖిగా అతనిని ఎదిరించితిని;
- 2 Samuel 12:7 2 సమూయేలు 12:7నాతాను దావీదును చూచిఆ మనుష్యుడవు నీవే. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చునదేమ నగాఇశ్రాయేలీయులమీద నేను నిన్ను రాజుగా పట్టాభిషేకముచేసి సౌలు చేతిలోనుండి నిన్ను విడిపించి నీ యజమానుని నగరిని నీకను గ్రహించి
- 2 Peter 3:15–16 2 పేతురు 3:15–16మరియు మన ప్రభువుయొక్క దీర్ఘశాంతము రక్షణార్థమైనదని యెంచుకొనుడి. ఆలాగు మన ప్రియ సహోదరుడైన పౌలుకూడ తనకు అనుగ్రహింపబడిన జ్ఞానము చొప్పున మీకు వ్రాసి యున్నాడు. వీటిని గూర్చి తన పత్రికలన్నిటిలోను బోధించుచున్నాడు; అయితే వాటిలో కొన్నిసంగతులు గ్రహించుటకు కష్టమైనవి. వీటిని విద్యావిహీనులును, అస్థిరులైనవారును, తక్కిన లేఖనములను అపార్థముచేసినట్లు, తమ స్వకీయ నాశనమునకు అపార్థము చేయుదురు.
- 1 Kings 1:23 1 రాజులు 1:23అతడు రాజు సన్నిధికి వచ్చి నమస్కారము చేసి సాష్టాంగపడి
- Proverbs 29:5 సామెతలు 29:5తన పొరుగువానితో ఇచ్చకములాడువాడు వాని పట్టుకొనుటకు వలవేయువాడు.