Psalms · chapter 1 · verse 2
Psalm 1:2 in Telugu
యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు.
Yehovaa dharmashaastramunandu aanandinchuchu divaaraatramu daanini dhyaaninchuvaadu dhanyudu.
Psalm 1:2 in English
- King James Version (KJV)
- But his delight [is] in the law of the LORD; and in his law doth he meditate day and night.
- World English Bible (WEB)
- but his delight is in the LORD’s law. On his law he meditates day and night.
- American Standard Version (ASV)
- But his delight is in the law of Jehovah; And on his law doth he meditate day and night.
- Bible in Basic English (BBE)
- But whose delight is in the law of the Lord, and whose mind is on his law day and night.
- Darby Translation (DBY)
- But his delight is in Jehovah's law, and in his law doth he meditate day and night.
- Webster's Bible (WBS)
- But his delight [is] in the law of the LORD; and in his law doth he meditate day and night.
- Young's Literal Translation (YLT)
- But — in the law of Jehovah [is] his delight, And in His law he doth meditate by day and by night:
Read in context
- 1దుష్టుల ఆలోచనచొప్పున నడువక పాపుల మార్గమున నిలువక అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక
- 2యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు.
- 3అతడు నీటికాలువల యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టువలె నుండును అతడు చేయునదంతయు సఫలమగును.
- 4దుష్టులు ఆలాగున నుండక గాలి చెదరగొట్టు పొట్టువలె నుందురు.
Cross references
- Joshua 1:8 యెహోషువ 1:8ఈ ధర్మశాస్త్రగ్రంథమును నీవు బోధింపక తప్పిపో కూడదు. దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్తపడునట్లు దివారాత్రము దాని ధ్యానించినయెడల నీ మార్గమును వర్ధిల్లజేసికొని చక్కగా ప్రవర్తించెదవు.
- Psalm 119:92 కీర్తనలు 119:92నీ ధర్మశాస్త్రము నాకు సంతోషమియ్యనియెడల నా శ్రమయందు నేను నశించియుందును.
- Psalm 119:11 కీర్తనలు 119:11నీ యెదుట నేను పాపము చేయకుండునట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని యున్నాను.
- Romans 7:22 రోమీయులకు 7:22అంతరంగపురుషుని బట్టి దేవుని ధర్మశాస్త్రమునందు నేను ఆనందించుచున్నాను గాని
- Psalm 119:97–99 కీర్తనలు 119:97–99(మేమ్) నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియముగానున్నది దినమెల్ల నేను దానిని ధ్యానించుచున్నాను. నీ ఆజ్ఞలు నిత్యము నాకు తోడుగా నున్నవి. నా శత్రువులను మించిన జ్ఞానము అవి నాకు కలుగ జేయుచున్నవి. నీ శాసనములను నేను ధ్యానించుచున్నాను కావున నా బోధకులందరికంటె నాకు విశేషజ్ఞానము కలదు.
- Psalm 119:15–16 కీర్తనలు 119:15–16నీ ఆజ్ఞలను నేను ధ్యానించెదను నీ త్రోవలను మన్నించెదను. నీ కట్టడలనుబట్టి నేను హర్షించెదను. నీ వాక్యమును నేను మరువకయుందును.
- Jeremiah 15:16 యిర్మీయా 15:16నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించితిని; సైన్యముల కధిపతివగు యెహోవా, దేవా, నీ పేరు నాకు పెట్టబడెను గనుక నీ మాటలు నాకు సంతోషమును నా హృదయమునకు ఆనందమును కలుగజేయుచున్నవి.
- Psalm 119:35 కీర్తనలు 119:35నీ ఆజ్ఞల జాడను చూచి నేను ఆనందించుచున్నాను దానియందు నన్ను నడువజేయుము.
- Psalm 104:34 కీర్తనలు 104:34ఆయననుగూర్చిన నా ధ్యానము ఆయనకు ఇంపుగా నుండునుగాక నేను యెహోవాయందు సంతోషించెదను.
- Psalm 112:1 కీర్తనలు 112:1యెహోవాను స్తుతించుడి యెహోవాయందు భయభక్తులుగలవాడు ఆయన ఆజ్ఞలనుబట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు.
- Psalm 40:8 కీర్తనలు 40:8నా దేవా, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యములోనున్నది.
- Psalm 119:1 కీర్తనలు 119:1(ఆలెఫ్) యెహోవా ధర్మశాస్త్రము ననుసరించి నిర్దోషముగా నడుచుకొనువారు ధన్యులు