Psalms · chapter 104 · verse 34
Psalm 104:34 in Telugu
ఆయననుగూర్చిన నా ధ్యానము ఆయనకు ఇంపుగా నుండునుగాక నేను యెహోవాయందు సంతోషించెదను.
Aayananugoorchina naa dhyaanamu aayanaku impugaa nundunugaaka nenu yehovaayandu santoshinchedanu.
Psalm 104:34 in English
- King James Version (KJV)
- My meditation of him shall be sweet: I will be glad in the LORD.
- World English Bible (WEB)
- Let my meditation be sweet to him. I will rejoice in the LORD.
- American Standard Version (ASV)
- Let my meditation be sweet unto him: I will rejoice in Jehovah.
- Bible in Basic English (BBE)
- Let my thoughts be sweet to him: I will be glad in the Lord.
- Darby Translation (DBY)
- My meditation shall be pleasant unto him; I will rejoice in Jehovah.
- Webster's Bible (WBS)
- My meditation of him shall be sweet: I will be glad in the LORD.
- Young's Literal Translation (YLT)
- Sweet is my meditation on Him, I — I do rejoice in Jehovah.
Read in context
- 32ఆయన భూమిని చూడగా అది వణకును ఆయన పర్వతములను ముట్టగా అవి పొగరాజును
- 33నా జీవితకాలమంతయు నేను యెహోవాకు కీర్తనలు పాడెదను నేనున్నంత కాలము నా దేవుని కీర్తించెదను.
- 34ఆయననుగూర్చిన నా ధ్యానము ఆయనకు ఇంపుగా నుండునుగాక నేను యెహోవాయందు సంతోషించెదను.
- 35పాపులు భూమిమీదనుండి లయమగుదురు గాక భక్తిహీనులు ఇక నుండకపోదురు గాక నా ప్రాణమా, యెహోవాను సన్నుతించుము యెహోవాను స్తుతించుడి.
Cross references
- Habakkuk 3:17–18 హబక్కూకు 3:17–18అంజూరపు చెట్లు పూయకుండినను ద్రాక్షచెట్లు ఫలింపకపోయినను ఒలీవచెట్లు కాపులేకయుండినను చేనిలోని పైరు పంటకు రాకపోయినను గొఱ్ఱెలు దొడ్డిలో లేకపోయినను సాలలో పశువులు లేకపోయినను నేను యెహోవాయందు ఆనందించెదను నా రక్షణకర్తయైన నా దేవునియందు నేను సంతోషించెదను.
- Philippians 4:4 ఫిలిప్పీయులకు 4:4ఎల్లప్పుడును ప్రభువునందు ఆనందించుడి, మరల చెప్పు దును ఆనందించుడి.
- Psalm 119:127–128 కీర్తనలు 119:127–128బంగారుకంటెను అపరంజికంటెను నీ ఆజ్ఞలు నాకు ప్రియముగానున్నవి. నీ ఉపదేశములన్నియు యథార్థములని నేను వాటిని మన్నించుచున్నాను అబద్ధమార్గములన్నియు నా కసహ్యములు.
- Psalm 1:2 కీర్తనలు 1:2యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు.
- Psalm 119:15–16 కీర్తనలు 119:15–16నీ ఆజ్ఞలను నేను ధ్యానించెదను నీ త్రోవలను మన్నించెదను. నీ కట్టడలనుబట్టి నేను హర్షించెదను. నీ వాక్యమును నేను మరువకయుందును.
- Luke 1:47 లూకా 1:47ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించెను
- Psalm 9:2 కీర్తనలు 9:2మహోన్నతుడా, నేను నిన్నుగూర్చి సంతోషించిహర్షించుచున్నాను నీ నామమును కీర్తించెదను.
- Psalm 63:5–6 కీర్తనలు 63:5–6క్రొవ్వు మెదడు నాకు దొరకినట్లుగా నా ప్రాణము తృప్తిపొందుచున్నది ఉత్సహించు పెదవులతో నా నోరు నిన్నుగూర్చి గానము చేయుచున్నది కాగా నా జీవితకాలమంతయు నేనీలాగున నిన్ను స్తుతించెదను నీ నామమునుబట్టి నా చేతులెత్తెదను.
- Psalm 119:111 కీర్తనలు 119:111నీ శాసనములు నాకు హృదయానందకరములు అవి నాకు నిత్యస్వాస్థ్యమని భావించుచున్నాను.
- Psalm 139:17–18 కీర్తనలు 139:17–18దేవా, నీ తలంపులు నా కెంత ప్రియమైనవి వాటి మొత్తమెంత గొప్పది. వాటిని లెక్కించెద ననుకొంటినా అవి యిసుక కంటెను లెక్కకు ఎక్కువై యున్నవి నేను మేల్కొంటినా యింకను నీయొద్దనే యుందును.
- Psalm 32:11 కీర్తనలు 32:11నీతిమంతులారా, యెహోవానుబట్టి సంతోషించుడి ఉల్లపించుడి యథార్థ హృదయులారా, మీరందరు ఆనందగానము చేయుడి.
- Psalm 77:12 కీర్తనలు 77:12నీ కార్యమంతయు నేను ధ్యానించుకొందును నీ క్రియలను నేను ధ్యానించుకొందును.