Psalms · chapter 106 · verse 2
Psalm 106:2 in Telugu
యెహోవా పరాక్రమకార్యములను ఎవడు వర్ణింపగలడు? ఆయన కీర్తి యంతటిని ఎవడు ప్రకటింపగలడు?
Yehovaa paraakramakaaryamulanu evadu varnimpagaladu? Aayana keerti yantatini evadu prakatimpagaladu?
Psalm 106:2 in English
- King James Version (KJV)
- Who can utter the mighty acts of the LORD? [who] can shew forth all his praise?
- World English Bible (WEB)
- Who can utter the mighty acts of the LORD, or fully declare all his praise?
- American Standard Version (ASV)
- Who can utter the mighty acts of Jehovah, Or show forth all his praise?
- Bible in Basic English (BBE)
- Who is able to give an account of the great acts of the Lord, or to make clear all his praise?
- Darby Translation (DBY)
- Who can utter the mighty acts of Jehovah? [who] can shew forth all his praise?
- Webster's Bible (WBS)
- Who can utter the mighty acts of the LORD? [who] can show forth all his praise?
- Young's Literal Translation (YLT)
- Who doth utter the mighty acts of Jehovah? Soundeth all His praise?
Read in context
- 1యెహోవాను స్తుతించుడి యెహోవా దయాళుడు ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి ఆయన కృప నిత్యముండును.
- 2యెహోవా పరాక్రమకార్యములను ఎవడు వర్ణింపగలడు? ఆయన కీర్తి యంతటిని ఎవడు ప్రకటింపగలడు?
- 3న్యాయము ననుసరించువారు ఎల్లవేళల నీతి ననుసరించి నడుచుకొనువారు ధన్యులు.
- 4యెహోవా, నీవు ఏర్పరచుకొనినవారి క్షేమము నేను చూచుచు నీ జనులకు కలుగు సంతోషమునుబట్టి నేను సంతోషించుచు
Cross references
- Ephesians 1:19 ఎఫెసీయులకు 1:19మన ప్రభువైన యేసుక్రీస్తుయొక్క దేవుడైన మహిమ స్వరూపియగు తండ్రి, తన్ను తెలిసికొనుటయందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతయునుగల మనస్సు అనుగ్రహించునట్లు, నేను నా ప్రార్థనలయందు మిమ్మునుగూర్చి విజ్ఞాపన చేయుచున్నాను.
- Romans 11:33 రోమీయులకు 11:33ఆహా, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుళ్యము ఎంతో గంభీరము; ఆయన తీర్పులు శోధింప నెంతో అశక్య ములు; ఆయన మార్గములెంతో అగమ్యములు.
- Psalm 139:17–18 కీర్తనలు 139:17–18దేవా, నీ తలంపులు నా కెంత ప్రియమైనవి వాటి మొత్తమెంత గొప్పది. వాటిని లెక్కించెద ననుకొంటినా అవి యిసుక కంటెను లెక్కకు ఎక్కువై యున్నవి నేను మేల్కొంటినా యింకను నీయొద్దనే యుందును.
- Psalm 145:3–12 కీర్తనలు 145:3–12యెహోవా మహాత్మ్యముగలవాడు ఆయన అధికస్తోత్రము నొందదగినవాడు ఆయన మహాత్మ్యము గ్రహింప శక్యము కానిది ఒక తరమువారు మరియొక తరమువారియెదుట నీ క్రియలను కొనియాడుదురు నీ పరాక్రమక్రియలను తెలియజేయుదురు మహోన్నతమైన నీ ప్రభావమహిమను నీ ఆశ్చర్య కార్యములను నేను ధ్యానించెదను నీ భీకరకార్యముల విక్రమమును మనుష్యులు వివరించె దరు నేను నీ మహాత్మ్యమును వర్ణించెదను. నీ మహా దయాళుత్వమును గూర్చిన కీర్తిని వారు ప్రకటించెదరు నీ నీతినిగూర్చి వారు గానము చేసెదరు యెహోవా దయాదాక్షిణ్యములు గలవాడు ఆయన దీర్ఘశాంతుడు కృపాతిశయముగలవాడు. యెహోవా అందరికి ఉపకారి ఆయన కనికరములు ఆయన సమస్త కార్యములమీద నున్నవి. యెహోవా, నీ క్రియలన్నియు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నవి నీ భక్తులు నిన్ను సన్నుతించుదురు. ఆయన రాజ్య మహోన్నత ప్రభావమును ఆయన బలమును నరులకు తెలియజేయుటకై నీ భక్తులు నీ రాజ్యప్రభావమునుగూర్చి చెప్పుకొందురు నీ శౌర్యమునుగూర్చి పలుకుదురు
- Nehemiah 9:5 నెహెమ్యా 9:5అప్పుడు లేవీయులైన యేషూవ కద్మీయేలు బానీ హషబ్నెయా షేరేబ్యా హోదీయా షెబన్యా పెతహయా అనువారునిలువబడి, నిరంతరము మీకు దేవుడైయున్న యెహోవాను స్తుతించుడని చెప్పి ఈలాగు స్తోత్రము చేసిరి - సకలాశీర్వచన స్తోత్రములకు మించిన నీ ఘనమైన నామము స్తుతింపబడునుగాక.
- Job 26:14 యోబు 26:14ఇవి ఆయన కార్యములలో స్వల్పములు. ఆయననుగూర్చి మనకు వినబడుచున్నది మిక్కిలిమెల్లనైన గుసగుస శబ్దముపాటిదే గదా. గర్జనలుచేయు ఆయన మహాబలము ఎంతైనది గ్రహింప గలవాడెవడు?
- Ephesians 3:18 ఎఫెసీయులకు 3:18మీరు దేవుని సంపూర్ణతయందు పూర్ణులగునట్లుగా, ప్రేమయందు వేరు పారి స్థిరపడి, సమస్త పరిశుద్ధులతో కూడ దాని వెడల్పు పొడుగు లోతు ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకును,
- Psalm 40:5 కీర్తనలు 40:5యెహోవా నా దేవా, నీవు మా యెడల జరిగించిన ఆశ్చర్యక్రియలును మాయెడల నీకున్న తలంపులును బహు విస్తారములు. వాటిని వివరించి చెప్పెదననుకొంటినా అవి లెక్కకు మించియున్నవి నీకు సాటియైన వాడొకడును లేడు.
- Job 5:9 యోబు 5:9ఆయన పరిశోధింపజాలని మహాకార్యములను లెక్కలేనన్ని అద్భుత క్రియలను చేయువాడు.