Psalms · chapter 107 · verse 39
Psalm 107:39 in Telugu
వారు బాధవలనను ఇబ్బందివలనను దుఃఖమువలనను తగ్గిపోయినప్పుడు
Vaaru baadhavalananu ibbandivalananu duhkhamuvalananu taggipoyinappudu
Psalm 107:39 in English
- King James Version (KJV)
- Again, they are minished and brought low through oppression, affliction, and sorrow.
- World English Bible (WEB)
- Again, they are diminished and bowed down through oppression, trouble, and sorrow.
- American Standard Version (ASV)
- Again, they are diminished and bowed down Through oppression, trouble, and sorrow.
- Bible in Basic English (BBE)
- And when they are made low, and crushed by trouble and sorrow,
- Darby Translation (DBY)
- And they are diminished and brought low, through oppression, adversity, and sorrow:
- Webster's Bible (WBS)
- Again, they are diminished and brought low through oppression, affliction, and sorrow.
- Young's Literal Translation (YLT)
- And they are diminished, and bow down, By restraint, evil, and sorrow.
Read in context
- 37వాటివలన సస్యఫలసమృద్ధి పొందునట్లును ఆయన ఆకలికొనినవారిని అచ్చట కాపురముంచెను
- 38మరియు ఆయన వారిని ఆశీర్వదింపగా వారు అధిక ముగా సంతానాభివృద్ధి నొందిరి ఆయన వారి పశువులను తగ్గిపోనియ్యలేదు
- 39వారు బాధవలనను ఇబ్బందివలనను దుఃఖమువలనను తగ్గిపోయినప్పుడు
- 40రాజులను తృణీకరించుచు త్రోవలేని యెడారిలో వారిని తిరుగులాడ జేయు వాడు.
- 41అట్టి దరిద్రుల బాధను పొగొట్టి వారిని లేవనెత్తెను వాని వంశమును మందవలె వృద్ధిచేసెను.
Cross references
- Exodus 2:23–24 నిర్గమకాండము 2:23–24ఆలాగున అనేక దినములు జరిగినమీదట ఐగుప్తు రాజు చనిపోయెను. ఇశ్రాయేలీయులు తాము చేయుచున్న వెట్టి పనులనుబట్టి నిట్టూర్పులు విడుచుచు మొరపెట్టు చుండగా, తమ వెట్టి పనులనుబట్టి వారుపెట్టిన మొర దేవునియొద్దకు చేరెను. కాగా దేవుడు వారి మూలుగును విని, అబ్రాహాము ఇస్సాకు యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకము చేసికొనెను.
- 2 Kings 10:32 2 రాజులు 10:32ఆ దినములలో యెహోవా ఇశ్రాయేలువారిని తగ్గించ నారంభించెను.
- 2 Kings 14:26 2 రాజులు 14:26ఏలయనగా అల్పులేమి ఘనులేమి ఇశ్రాయేలువారికి సహాయులెవరును లేకపోయిరి.
- 2 Chronicles 15:5–6 2 దినవృత్తాంతములు 15:5–6ఆ కాలములలో దేశముల కాపురస్థులందరిలోను గొప్ప కల్లోలములు కలిగెను గనుక తమ పనిపాటలను చక్క పెట్టుకొనుటకై తిరుగువారికి సమాధానము లేకుండెను. దేవుడు జనము లను సకలవిధములైన బాధలతో శ్రమపరచెను గనుక జనము జనమును, పట్టణము పట్టణమును, పాడు చేసెను.
- Judges 6:3–6 న్యాయాధిపతులు 6:3–6ఇశ్రాయేలీయులు విత్తనములు విత్తిన తరువాత మిద్యా నీయులును అమాలేకీయులును తూర్పుననుండు వారును తమ పశువులను గుడారములను తీసికొని మిడతల దండంత విస్తారముగా వారిమీదికి వచ్చి వారి యెదుట దిగి, గాజాకు పోవునంతదూరము భూమి పంటను పాడుచేసి, ఒక గొఱ్ఱెనుగాని యెద్దునుగాని గాడిదనుగాని జీవనసాధన మైన మరిదేనినిగాని ఇశ్రాయేలీయులకు ఉండనీయ లేదు. వారును వారి ఒంటెలును లెక్కలేకయుండెను. దేశమును పాడుచేయుటకు వారు దానిలోనికి వచ్చిరి ఇశ్రాయేలీయులు మిద్యానీయులవలన మిక్కిలి హీనదశకు వచ్చినప్పుడు వారు యెహోవాకు మొఱ్ఱ పెట్టిరి.
- Ruth 1:20–21 రూతు 1:20–21ఆమెసర్వశక్తుడు నాకు చాలా దుఃఖము కలుగజేసెను గనుక నన్ను నయోమి అనక మారా అనుడి. నేను సమృధ్దిగల దాననై వెళ్లితిని, యెహోవా నన్ను రిక్తురాలినిగా తిరిగి రాజేసెను. మీరు నన్ను నయోమి అని పిలువనేల? యెహోవా నామీద విరుద్ధముగ సాక్ష్యము పలికెను, సర్వశక్తుడు నన్ను బాధపరచెను అని వారితో చెప్పెను.
- 2 Kings 13:22 2 రాజులు 13:22యెహోయాహాజు దినములన్నియు సిరియారాజైన హజాయేలు ఇశ్రాయేలువారిని బాధపెట్టెను.
- Psalm 30:6–7 కీర్తనలు 30:6–7నేనెన్నడు కదలనని నా క్షేమకాలమున అనుకొంటిని. యెహోవా, దయకలిగి నీవే నా పర్వతమును స్థిరపరచితివి నీ ముఖమును నీవు దాచుకొనినప్పుడు నేను కలత జెందితిని
- 2 Kings 4:8 2 రాజులు 4:8ఒక దినమందు ఎలీషా షూనేము పట్టణమునకు పోగా అచ్చట ఘనురాలైన యొక స్త్రీభోజనమునకు రమ్మని అతని బలవంతముచేసెను గనుక అతడు ఆ మార్గమున వచ్చినప్పుడెల్ల ఆమె యింట భోజనము చేయుచువచ్చెను.
- Job 1:10–17 యోబు 1:10–17నీవు అతనికిని అతని యింటివారికిని అతనికి కలిగిన సమస్తమునకును చుట్టు కంచె వేసితివి గదా? నీవు అతని చేతిపనిని దీవించుచుండుట చేత అతని ఆస్తి దేశములో బహుగా విస్తరించియున్నది. అయినను నీవు ఇప్పుడు నీ చేయి చాపి అతనికి కలిగిన సమస్తమును మొత్తిన యెడల అతడు నీ ముఖము ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోవును అని యెహోవాతో అనగా యెహోవా ఇదిగో అతనికి కలిగిన సమస్తమును నీ వశమున ఉన్నది; అతనికి మాత్రము ఏ హానియు చేయ కూడదని అపవాదికి సెలవియ్యగా వాడు యెహోవా సన్నిధినుండి బయలు వెళ్లెను. ఒకదినమున యోబు కుమారులును కుమార్తెలును తమ అన్నయింట భోజనముచేయుచు ద్రాక్షారసము పానము చేయుచునుండగా ఒక దూత అతనియొద్దకు వచ్చి ఎద్దులు నాగలి దున్నుచు గాడిదలు వాటి సమీపమున మేయుచునుండగా షెబాయీయులు వాటిమీద పడి వాటిని పట్టుకొని పోయి ఖడ్గముతో పనివారిని హతముచేసిరి. జరిగినది నీకు తెలియజేయుటకు నేనొక్కడనే తప్పించుకొని వచ్చి యున్నాననెను. అతడు ఇంక మాట లాడుచుండగా మరియొకడు వచ్చిదేవుని అగ్ని ఆకాశమునుండి పడి గొఱ్ఱెలను పనివారిని రగులబెట్టి కాల్చి వేసెను; దానిని నీకు తెలియజేయుటకు నేనొక్కడనే తప్పించుకొని వచ్చియున్నాననెను. అతడు ఇంక మాట లాడుచుండగా మరియొకడు వచ్చికల్దీయులు మూడు సమూహములుగా వచ్చి ఒంటెలమీద పడి వాటిని కొనిపోయి ఖడ్గముచేత పనివారిని చంపిరి; నీకు దానిని తెలియజేయుటకు నేనొక్కడనే తప్పించుకొని వచ్చియున్నా ననెను.
- 2 Kings 13:7 2 రాజులు 13:7రౌతులలో ఏబదిమందియు రథములలో పదియు కాల్బలములో పదివేలమందియు మాత్రమే యెహోయాహాజు దగ్గర ఉండిరి; మిగిలినవారిని సిరియా రాజు దుళ్లకొట్టిన ధూళివలె నాశనముచేసి యుండెను.
- 2 Kings 8:3 2 రాజులు 8:3అయితే ఆ యేడు సంవత్సరములు గతించిన తరువాత ఆ స్త్రీ ఫిలిష్తీ యుల దేశములోనుండి వచ్చి తన యింటిని గూర్చియు భూమిని గూర్చియు మనవి చేయుటకై రాజునొద్దకు పోయెను.