Psalms · chapter 109 · verse 13
Psalm 109:13 in Telugu
వాని వంశము నిర్మూలము చేయబడును గాక వచ్చుతరమునందు వారి పేరు మాసిపోవును గాక
Vaani vanshamu nirmoolamu cheyabadunu gaaka vachchutaramunandu vaari peru maasipovunu gaaka
Psalm 109:13 in English
- King James Version (KJV)
- Let his posterity be cut off; [and] in the generation following let their name be blotted out.
- World English Bible (WEB)
- Let his posterity be cut off. In the generation following let their name be blotted out.
- American Standard Version (ASV)
- Let his posterity be cut off; In the generation following let their name be blotted out.
- Bible in Basic English (BBE)
- Let his seed be cut off; in the coming generation let their name go out of memory.
- Darby Translation (DBY)
- Let his posterity be cut off; in the generation following let their name be blotted out:
- Webster's Bible (WBS)
- Let his posterity be cut off; [and] in the generation following let their name be blotted out.
- Young's Literal Translation (YLT)
- His posterity is for cutting off, In another generation is their name blotted out.
Read in context
- 11వాని ఆస్తి అంతయు అప్పులవారు ఆక్రమించు కొందురు గాక వాని కష్టార్జితమును పరులు దోచుకొందురుగాక
- 12వానికి కృప చూపువారు లేకపోదురు గాక తండ్రిలేనివాని బిడ్డలకు దయచూపువారు ఉండక పోదురు గాక
- 13వాని వంశము నిర్మూలము చేయబడును గాక వచ్చుతరమునందు వారి పేరు మాసిపోవును గాక
- 14వాని పితరులదోషము యెహోవా జ్ఞాపకములోనుంచు కొనును గాక వాని తల్లి పాపము తుడుపుపెట్టబడక యుండును గాక
- 15ఆయన వారి జ్ఞాపకమును భూమిమీదనుండి కొట్టి వేయునట్లు ఆ పాపములు నిత్యము యెహోవా సన్నిధిని కనబడుచుండునుగాక.
Cross references
- Proverbs 10:7 సామెతలు 10:7నీతిమంతుని జ్ఞాపకముచేసికొనుట ఆశీర్వాదకరమగును భక్తిహీనుల పేరు అసహ్యత పుట్టించును
- Job 18:19 యోబు 18:19వారి ప్రజలలో వారికి పుత్రులైనను పౌత్రులైనను ఉండరు వారు నివసించిన స్థలములో తప్పించుకొనినవాడు ఒకడైనను ఉండడు.
- Psalm 37:28 కీర్తనలు 37:28ఏలయనగా యెహోవా న్యాయమును ప్రేమించువాడు ఆయన తన భక్తులను విడువడు వారెన్న టెన్నటికి కాపాడబడుదురు గాని భక్తిహీనుల సంతానము నిర్మూలమగును.
- Isaiah 14:20–22 యెషయా 14:20–22నీవు నీ దేశమును పాడుచేసి నీ ప్రజలను హతమార్చితివి నీవు సమాధిలో వారితోకూడ కలిసియుండవు దుష్టుల సంతానము ఎన్నడును జ్ఞాపకమునకు తేబడదు. వారు పెరిగి భూమిని స్వతంత్రించుకొని పట్టణము లతో లోకమును నింపకుండునట్లు తమ పితరుల దోషమునుబట్టి అతని కుమారులను వధిం చుటకు దొడ్డి సిద్ధపరచుడి. సైన్యములకధిపతియగు యెహోవా వాక్కు ఇదే నేను వారిమీదికి లేచి బబులోనునుండి నామమును శేషమును కుమారుని మనుమని కొట్టి వేసెదనని యెహోవా సెలవిచ్చుచున్నాడు.
- 2 Kings 10:10–11 2 రాజులు 10:10–11అహాబు కుటుంబికులనుగూర్చి యెహోవా సెలవిచ్చిన మాటలలో ఒకటియు నెరవేరక పోదు; తన సేవకుడైన ఏలీయాద్వారా తాను సెలవిచ్చిన మాట యెహోవా నెరవేర్చెనని చెప్పెను. ఈ ప్రకారము యహూ యెజ్రెయేలులో అహాబు కుటుంబికులందరిని, అతని సంబంధులగు గొప్పవారినందరిని అతని బంధువుల నందరిని, అతడు నియమించిన యాజకులను హతముచేసెను; అతనికి ఒకనినైనను ఉండనియ్యలేదు.
- Deuteronomy 29:20 ద్వితీయోపదేశకాండము 29:20అయితే యెహోవా వానిని క్షమింపనొల్లడు; అట్టివాడు మీలోనుండినయెడల నిశ్చయముగా యెహోవా కోపమును ఓర్వమియు ఆ మనుష్యునిమీద పొగరాజును; ఈ గ్రంథములో వ్రాయ బడిన శాపములన్నియు వానికి తగులును. యెహోవా అతని పేరు ఆకాశము క్రిందనుండకుండ తుడిచివేయును.
- Deuteronomy 9:14 ద్వితీయోపదేశకాండము 9:14నాకు అడ్డము రాకుము, నేను వారిని నశింపజేసి వారి నామమును ఆకాశము క్రింద నుండకుండ తుడుపుపెట్టి, నిన్ను వారికంటె బలముగల బహు జనముగా చేసెదనని నాతో చెప్పగా.
- Jeremiah 22:30 యిర్మీయా 22:30యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు సంతానహీనుడనియు, తన దినములలో వర్ధిల్లనివాడనియు ఈ మనుష్యునిగూర్చి వ్రాయుడి; అతని సంతానములో ఎవడును వర్ధిల్లడు, వారిలో ఎవడును దావీదు సింహాసనమందు కూర్చుండడు; ఇక మీదట ఎవడును యూదాలో రాజుగా నుండడు.
- Deuteronomy 25:19 ద్వితీయోపదేశకాండము 25:19కాబట్టి నీవు స్వాధీనపరచుకొనునట్లు నీ దేవుడైన యెహోవా స్వాస్థ్య ముగా నీకిచ్చుచున్న దేశములో చుట్టుపట్లనున్న నీ సమస్త శత్రువులను లేకుండచేసి, నీ దేవుడైన యెహోవా నీకు విశ్రాంతి దయచేసిన తరువాత ఆకాశము క్రింద నుండి అమాలేకీయుల పేరు తుడిచివేయవలెను. ఇది మరచిపోవద్దు.
- 1 Samuel 2:31–33 1 సమూయేలు 2:31–33ఆలకించుము; రాగల దినములలో నీ బలమును నీ పితరుని యింటి బలమును నేను తక్కువచేతును. నీ యింట ముసలివాడు ఒకడును లేకపోవును. యెహోవా ఇశ్రాయేలీయులకు చేయదలచిన మేలువిషయములో నా నివాసస్థలమునకు అపాయము కలుగగా నీవు చూతువు. ఎప్పటికిని నీ యింట ముసలివాడు ఉండడు. నా బలిపీఠమునొద్దనెవడు ఉండకుండ నేనందరిని నశింపజేయక విడుచు వాడను గనుక అది నీ కన్నులు క్షీణించుటకును నీవు దుఃఖముచేత క్షయమగుటకును సాధనమగును; నీ సంతానపు వారందరు వయఃకాలమందు మరణమవుదురు.
- Psalm 21:10 కీర్తనలు 21:10భూమిమీద నుండకుండ వారి గర్భఫలమును నీవు నాశనము చేసెదవు నరులలో నుండకుండ వారి సంతానమును నశింపజేసెదవు.
- 1 Samuel 3:13 1 సమూయేలు 3:13తన కుమారులు తమ్మును తాము శాపగ్రస్తులగా చేసికొను చున్నారని తానెరిగియు వారిని అడ్డగించలేదు గనుక అతని యింటికి నిత్యమైన శిక్ష విధింతునని నేను అతనికి తెలియజేయుచున్నాను.