Psalms · chapter 109 · verse 18
Psalm 109:18 in Telugu
తాను పైబట్ట వేసికొనునట్లు వాడు శాపము ధరించెను అది నీళ్లవలె వాని కడుపులో చొచ్చియున్నది తైలమువలె వాని యెముకలలో చేరియున్నది
Taanu paibatta vesikonunatlu vaadu shaapamu dharinchenu adi neellavale vaani kadupulo chochchiyunnadi tailamuvale vaani yemukalalo cheriyunnadi
Psalm 109:18 in English
- King James Version (KJV)
- As he clothed himself with cursing like as with his garment, so let it come into his bowels like water, and like oil into his bones.
- World English Bible (WEB)
- He clothed himself also with cursing as with his garment. It came into his inward parts like water, like oil into his bones.
- American Standard Version (ASV)
- He clothed himself also with cursing as with his garment, And it came into his inward parts like water, And like oil into his bones.
- Bible in Basic English (BBE)
- He put on cursing like a robe, and it has come into his body like water, and into his bones like oil.
- Darby Translation (DBY)
- And he clothed himself with cursing like his vestment; so let it come into his bowels like water, and like oil into his bones;
- Webster's Bible (WBS)
- As he clothed himself with cursing like as with his garment, so let it come into his bowels like water, and like oil into his bones.
- Young's Literal Translation (YLT)
- And he putteth on reviling as his robe, And it cometh in as water into his midst, And as oil into his bones.
Read in context
- 16ఏలయనగా కృప చూపవలెనన్నమాట మరచి శ్రమనొందినవానిని దరిద్రుని నలిగిన హృదయము గలవానిని చంపవలెనని వాడు అతని తరిమెను.
- 17శపించుట వానికి ప్రీతి గనుక అది వానిమీదికి వచ్చి యున్నది. దీవెనయందు వానికిష్టము లేదు గనుక అది వానికి దూరమాయెను.
- 18తాను పైబట్ట వేసికొనునట్లు వాడు శాపము ధరించెను అది నీళ్లవలె వాని కడుపులో చొచ్చియున్నది తైలమువలె వాని యెముకలలో చేరియున్నది
- 19తాను కప్పుకొను వస్త్రమువలెను తాను నిత్యము కట్టుకొను నడికట్టువలెను అది వానిని వదలకుండును గాక.
- 20నా విరోధులకు నా ప్రాణమునకు విరోధముగా మాట లాడువారికి ఇదే యెహోవావలన కలుగు ప్రతికారము.
Cross references
- Psalm 73:6 కీర్తనలు 73:6కావున గర్వము కంఠహారమువలె వారిని చుట్టుకొను చున్నది వస్త్రమువలె వారు బలాత్కారము ధరించుకొందురు.
- Numbers 5:22 సంఖ్యాకాండము 5:22శాపము కలుగజేయు ఈ నీళ్లు నీ కడుపు ఉబ్బునట్లును నీ నడుము పడునట్లును చేయుటకు నీ కడుపులోనికి పోవునని చెప్పి యాజకుడు ఆ స్త్రీచేత శపథ ప్రమాణము చేయించిన తరువాత ఆ స్త్రీ ఆమేన్ అని చెప్పవలెను.
- Colossians 3:12 కొలొస్సయులకు 3:12కాగా, దేవునిచేత ఏర్పరచబడినవారును పరిశుద్ధులును ప్రియులునైనవారికి తగినట్లు, మీరు జాలిగల మనస్సును, దయాళుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంత మును ధరించుకొనుడి.
- Matthew 27:3–5 మత్తయి 27:3–5అప్పుడాయనను అప్పగించిన యూదా, ఆయనకు శిక్ష విధింపబడగా చూచి పశ్చాత్తాపపడి, ఆ ముప్పది వెండి నాణములు ప్రధానయాజకులయొద్దకును పెద్దలయొద్దకును మరల తెచ్చి నేను నిరపరాధరక్తమును అప్పగించి పాపము చేసితినని చెప్పెను. వారుదానితో మాకేమి? నీవే చూచుకొనుమని చెప్పగా అతడు ఆ వెండి నాణ ములు దేవాలయములో పారవేసి, పోయి ఉరిపెట్టు కొనెను.
- Job 20:20–23 యోబు 20:20–23వారు ఎడతెగక ఆశించిన వారు తమ యిష్టవస్తువులలో ఒకదాని చేతనైనను తమ్మును తాము రక్షించుకొనజాలరు. వారు మింగివేయనిది ఒకటియు లేదు గనుక వారిక్షేమస్థితి నిలువదు. వారికి సంపాద్యము పూర్ణముగా కలిగిన సమయమున వారు ఇబ్బందిపడుదురు దురవస్థలోనుండు వారందరి చెయ్యి వారిమీదికివచ్చును. వారు కడుపు నింపుకొననైయుండగా దేవుడు వారిమీద తన కోపాగ్ని కురిపించును వారు తినుచుండగా దాని కురిపించును.
- 1 Peter 5:5 1 పేతురు 5:5చిన్నలారా, మీరు పెద్దలకు లోబడియుండుడి; మీరందరు ఎదుటివాని యెడల దీనమనస్సు అను వస్త్రము ధరించుకొని మిమ్మును అలంకరించుకొనుడి; దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును.
- Acts 1:18 అపొస్తలుల కార్యములు 1:18ఈ యూదా ద్రోహమువలన సంపాదించిన రూకల నిచ్చి యొక పొలము కొనెను. అతడు తలక్రిందుగాపడి నడిమికి బద్దలైనందున అతని పేగులన్నియు బయటికి వచ్చెను.
- Numbers 5:27 సంఖ్యాకాండము 5:27ఆ నీళ్లు ఆ స్త్రీకి త్రాగింపవలెను. అతడు ఆమెకు ఆ నీళ్లు త్రాగించిన తరువాత జరుగునదేదనగా, ఆమె అపవిత్రపరపబడి తన భర్తకు ద్రోహము చేసినయెడల, శాపము కలుగజేయు ఆ నీళ్లు చేదై ఆమెలోనికి చేరిన తరువాత ఆమె కడుపు ఉబ్బును ఆమె నడుము పడి పోవును. ఆ స్త్రీ తన జనులమధ్య శాపమున కాస్పదముగా నుండును.
- Colossians 3:8 కొలొస్సయులకు 3:8ఇప్పుడైతే మీరు, కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీనోట బూతులు అను వీటినన్నిటిని విసర్జించుడి.
- Job 29:14 యోబు 29:14నేను నీతిని వస్త్రముగా ధరించుకొని యుంటిని గనుక అది నన్ను ధరించెను నా న్యాయప్రవర్తన నాకు వస్త్రమును పాగాయు ఆయెను.
- Matthew 26:24 మత్తయి 26:24మనుష్యకుమా రునిగూర్చి వ్రాయబడిన ప్రకారము ఆయన పోవుచున్నాడు గాని యెవనిచేత మనుష్యకుమారుడు అప్ప గింపబడుచున్నాడో ఆ మనుష్యునికి శ్రమ; ఆ మనుష్యుడు పుట్టియుండనియెడల వానికి మేలని చెప్పెను.
- Job 20:12–16 యోబు 20:12–16చెడుతనము వారి నోటికి తియ్యగా నుండెనువారు నాలుకక్రింద దాని దాచిపెట్టిరి. దాని పోనియ్యక భద్రము చేసికొనిరి, నోట దానినుంచుకొనిరి. అయినను వారి కడుపులో వారి ఆహారము పులిసిపోవును అది వారిలోపట నాగుపాముల విషమగును. వారు ధనమును మింగివేసిరి గాని యిప్పుడు దానిని మరల కక్కివేయుదురు. వారి కడుపులోనుండి దేవుడు దాని కక్కించును. వారు కట్లపాముల విషమును పీల్చుదురు నాగుపాము నాలుక వారిని చంపును.