Psalms · chapter 118 · verse 12
Psalm 118:12 in Telugu
కందిరీగలవలె నామీద ముసిరి యున్నారు ముండ్లు కాల్చిన మంట ఆరిపోవునట్లు వారు నశించి పోయిరి యెహోవా నామమును బట్టి నేను వారిని నిర్మూలము చేసెదను.
Kandireegalavale naameeda musiri yunnaaru mundlu kaalchina manta aaripovunatlu vaaru nashinchi poyiri yehovaa naamamunu batti nenu vaarini nirmoolamu chesedanu.
Psalm 118:12 in English
- King James Version (KJV)
- They compassed me about like bees; they are quenched as the fire of thorns: for in the name of the LORD I will destroy them.
- World English Bible (WEB)
- They surrounded me like bees. They are quenched like the burning thorns. In the LORD’s name I cut them off.
- American Standard Version (ASV)
- They compassed me about like bees; they are quenched as the fire of thorns: In the name of Jehovah I will cut them off.
- Bible in Basic English (BBE)
- They are round me like bees; but they are put out like a fire among thorns; for in the name of the Lord I will have them cut down.
- Darby Translation (DBY)
- They encompassed me like bees; they are quenched as the fire of thorns: for in the name of Jehovah have I destroyed them.
- Webster's Bible (WBS)
- They encompassed me like bees; they are quenched as the fire of thorns: for in the name of the LORD I will destroy them.
- Young's Literal Translation (YLT)
- They compassed me about as bees, They have been extinguished as a fire of thorns, In the name of Jehovah I surely cut them off.
Read in context
- 10అన్యజనులందరు నన్ను చుట్టుకొనియున్నారు యెహోవా నామమునుబట్టి నేను వారిని నిర్మూలము చేసెదను.
- 11నలుదిశలను వారు నన్ను చుట్టుకొనియున్నారు యెహోవా నామమునుబట్టి నేను వారిని నిర్మూలము చేసెదను.
- 12కందిరీగలవలె నామీద ముసిరి యున్నారు ముండ్లు కాల్చిన మంట ఆరిపోవునట్లు వారు నశించి పోయిరి యెహోవా నామమును బట్టి నేను వారిని నిర్మూలము చేసెదను.
- 13నేను పడునట్లు నీవు నన్ను గట్టిగా తోసితివి యెహోవా నాకు సహాయము చేసెను.
- 14యెహోవా నా దుర్గము నా గానము ఆయన నాకు రక్షణాధారమాయెను.
Cross references
- Deuteronomy 1:44 ద్వితీయోపదేశకాండము 1:44అప్పుడు ఆ మన్నెములో నివసించిన అమోరీయులు మీకెదురుగా బయలుదేరి వచ్చి, కందిరీగలవలె మిమ్ము తరిమి హోర్మావరకు శేయీరులో మిమ్ము హతముచేసిరి.
- 1 Samuel 17:45 1 సమూయేలు 17:45దావీదునీవు కత్తియు ఈటెయు బల్లెమును ధరించుకొని నా మీదికి వచ్చుచున్నావు అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలీయుల సైన్యములకధిపతియగు యెహోవా పేరట నేను నీమీదికి వచ్చుచున్నాను.
- Psalm 20:5 కీర్తనలు 20:5యెహోవా నీ రక్షణనుబట్టి మేము జయోత్సాహము చేయుచున్నాముమా దేవుని నామమునుబట్టి మా ధ్వజము ఎత్తుచున్నాము నీ ప్రార్థనలన్నియు యెహోవా సఫలపరచునుగాక.
- Psalm 20:1 కీర్తనలు 20:1ఆపత్కాలమందు యెహోవా నీకుత్తరమిచ్చును గాక యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించును గాక.
- Ecclesiastes 7:6 ప్రసంగి 7:6ఏలయనగా బానక్రింద చిటపటయను చితుకుల మంట ఎట్టిదో బుద్ధిహీనుల నవ్వు అట్టిదే; ఇదియు వ్యర్థము.
- Psalm 58:9 కీర్తనలు 58:9మీ కుండలకు ముళ్లకంపల సెగ తగలకమునుపే అది పచ్చిదైనను ఉడికినదైనను ఆయన దాని నెగర గొట్టుచున్నాడు,
- Psalm 8:9 కీర్తనలు 8:9యెహోవా మా ప్రభువాభూమియందంతట నీ నామము ఎంత ప్రభావముగలది!
- 2 Samuel 23:6 2 సమూయేలు 23:6ఒకడు ముండ్లను చేత పట్టుకొనుటకు భయపడినట్లు దుర్మార్గులు విసర్జింపబడుదురు.
- 1 Chronicles 14:14–16 1 దినవృత్తాంతములు 14:14–16దావీదు తిరిగి దేవునియొద్ద విచారణచేసెను. అందుకు దేవుడునీవు వారిని తరుము కొనిపోక వారిని తప్పించుకొని చుట్టు తిరిగి కంబళిచెట్లకు ఎదురుగా నిలిచి కంబళిచెట్ల కొనలయందు కాళ్లచప్పుడు నీకు వినబడునప్పుడు వారితో యుద్ధము కలుపుటకై బయలుదేరి వారిమీద పడుము; ఆ చప్పుడు వినబడునప్పుడు ఫిలిష్తీయుల దండును హతము చేయుటకై దేవుడు నీకు ముందుగా బయలువెళ్లి యున్నాడని తెలిసికొనుమని సెల విచ్చెను. దేవుడు తనకు సెలవిచ్చిన ప్రకారము దావీదు చేయగా ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయుల సైన్యమును గిబి యోను మొదలుకొని గాజెరువరకు తరిమి హతముచేసిరి.
- Isaiah 27:4 యెషయా 27:4నాయందు క్రోధము లేదు గచ్చపొదలును బలురక్కసి చెట్లును ఒకవేళ నుండిన యెడల యుద్ధము చేయువానివలె నేను వాటిలోనికి వడిగా జొచ్చి తప్పక వాటిని కాల్చివేయుదును.
- Psalm 83:14–15 కీర్తనలు 83:14–15అగ్ని అడవిని కాల్చునట్లు కారుచిచ్చు కొండలను తగుల పెట్టునట్లు నీ తుపానుచేత వారిని తరుముము నీ సుడిగాలిచేత వారికి భీతి పుట్టించుము.
- 2 Chronicles 14:11–12 2 దినవృత్తాంతములు 14:11–12ఆసా తన దేవుడైన యెహోవాకు మొఱ్ఱపెట్టి యెహోవా, విస్తారమైన సైన్యముచేతిలో ఓడిపోకుండ బలములేనివారికి సహాయము చేయుటకు నీకన్న ఎవరును లేరు; మా దేవా యెహోవా, మాకు సహాయముచేయుము, నిన్నే నమ్ముకొని యున్నాము, నీ నామమునుబట్టియే యీ సైన్యమును ఎదిరించుటకు బయలుదేరియున్నాము. యెహోవా నీవే మా దేవుడవు, నరమాత్రులను నీ పైని జయమొందనియ్యకుము అని ప్రార్థింపగా యెహోవా ఆ కూషీయులను ఆసాయెదుటను యూదావారి యెదుటను నిలువనియ్యక వారిని మొత్తినందున వారు పారిపోయిరి.