Psalms · chapter 119 · verse 110
Psalm 119:110 in Telugu
నన్ను పట్టుకొనుటకై భక్తిహీనులు ఉరియొడ్డిరి అయినను నీ ఉపదేశములనుండి నేను తొలగి తిరుగుట లేదు.
Nannu pattukonutakai bhaktiheenulu uriyoddiri ayinanu nee upadeshamulanundi nenu tolagi tiruguta ledu.
Psalm 119:110 in English
- King James Version (KJV)
- The wicked have laid a snare for me: yet I erred not from thy precepts.
- World English Bible (WEB)
- The wicked have laid a snare for me, yet I haven’t gone astray from your precepts.
- American Standard Version (ASV)
- The wicked have laid a snare for me; Yet have I not gone astray from thy precepts.
- Bible in Basic English (BBE)
- Sinners have put a net to take me; but I was true to your orders.
- Darby Translation (DBY)
- The wicked have laid a snare for me; but I have not wandered from thy precepts.
- Webster's Bible (WBS)
- The wicked have laid a snare for me: yet I erred not from thy precepts.
- Young's Literal Translation (YLT)
- The wicked have laid a snare for me, And from thy precepts I wandered not.
Read in context
- 108యెహోవా, నా నోటి స్వేచ్ఛార్పణలను అంగీక రించుము. నీ న్యాయవిధులను నాకు బోధింపుము
- 109నా ప్రాణము ఎల్లప్పుడు నా అరచేతిలో ఉన్నది. అయినను నీ ధర్మశాస్త్రమును నేను మరువను.
- 110నన్ను పట్టుకొనుటకై భక్తిహీనులు ఉరియొడ్డిరి అయినను నీ ఉపదేశములనుండి నేను తొలగి తిరుగుట లేదు.
- 111నీ శాసనములు నాకు హృదయానందకరములు అవి నాకు నిత్యస్వాస్థ్యమని భావించుచున్నాను.
- 112నీ కట్టడలను గైకొనుటకు నా హృదయమును నేను లోపరచుకొనియున్నాను ఇది తుదవరకు నిలుచు నిత్యనిర్ణయము.
Cross references
- Psalm 140:5 కీర్తనలు 140:5గర్విష్ఠులు నాకొరకు ఉరిని త్రాళ్లను చాటుగా ఒడ్డి యున్నారు వారు త్రోవప్రక్కను వల పరచియున్నారు. నన్ను పట్టుకొనుటకై ఉచ్చుల నొగ్గియున్నారు. (సెలా. )
- Psalm 119:95 కీర్తనలు 119:95నన్ను సంహరింపవలెనని భక్తిహీనులు నా కొరకు పొంచియున్నారు అయితే నేను నీ శాసనములను తలపోయుచున్నాను.
- Psalm 141:9 కీర్తనలు 141:9నా నిమిత్తము వారు ఒడ్డిన వలనుండి పాపము చేయువారి ఉచ్చులనుండి నన్ను తప్పించి కాపాడుము.
- Psalm 119:10 కీర్తనలు 119:10నా పూర్ణహృదయముతో నిన్ను వెదకియున్నాను నన్ను నీ ఆజ్ఞలను విడిచి తిరుగనియ్యకుము.
- Psalm 119:85 కీర్తనలు 119:85నీ ధర్మశాస్త్రము ననుసరింపని గర్విష్ఠులు నన్ను చిక్కించుకొనుటకై గుంటలు త్రవ్విరి.
- Psalm 124:6–7 కీర్తనలు 124:6–7వారి పండ్లకు మనలను వేటగా అప్పగింపని యెహోవా స్తుతినొందును గాక. పక్షి తప్పించుకొనినట్లు మన ప్రాణము వేటకాండ్ర ఉరినుండి తప్పించుకొని యున్నది ఉరి తెంపబడెను మనము తప్పించుకొని యున్నాము.
- Psalm 10:8–18 కీర్తనలు 10:8–18తామున్న పల్లెలయందలి మాటుచోటులలో పొంచియుందురు చాటైన స్థలములలో నిరపరాధులను చంపుదురువారి కన్నులు నిరాధారులను పట్టుకొనవలెనని పొంచి చూచును. గుహలోని సింహమువలె వారు చాటైన స్థలములలో పొంచి యుందురు బాధపడువారిని పట్టుకొన పొంచి యుందురుబాధపడువారిని తమ వలలోనికి లాగి పట్టుకొందురు. కాగా నిరాధారులు నలిగి వంగుదురువారి బలాత్కారమువలన నిరాధారులు కూలుదురు. దేెెవుడు మరచిపోయెను ఆయన విముఖుడై యెప్పుడును చూడకుండును అని వారు తమ హృదయములలో అనుకొందురు. యెహోవా లెమ్ము, దేవా బాధపడువారిని మరువకనీ చెయ్యి యెత్తుము దుష్టులు దేవుని తృణీకరించుట యేల? నీవు విచారణ చేయౌవని వారు తమ హృదయములలో అను కొనుటయేల? నీవు దీనిని చూచి యున్నావు గదా, వారికి ప్రతికారము చేయుటకై నీవు చేటును పగను కనిపెట్టి చూచుచున్నావునిరాధారులు తమ్మును నీకు అప్పగించుకొందురు తండ్రిలేనివారికి నీవే సహాయుడవై యున్నావు దుష్టుల భుజమును విరుగగొట్టుము చెడ్డవారి దుష్టత్వము ఏమియు కనబడకపోవువరకు దానిని గూర్చి విచారణ చేయుము. యెహోవా నిరంతరము రాజై యున్నాడుఆయన దేశములోనుండి అన్యజనులు నశించి పోయిరి. యెహోవా, లోకులు ఇకను భయకారకులు కాకుండు నట్లుబాధపడువారి కోరికను నీవు విని యున్నావు తండ్రిలేనివారికిని నలిగిన వారికిని న్యాయము తీర్చుటకై నీవు వారి హృదయము స్థిరపరచితివి, చెవియొగ్గి ఆల కించితివి.
- Psalm 119:51 కీర్తనలు 119:51గర్విష్ఠులు నన్ను మిగుల అపహసించిరి అయినను నీ ధర్మశాస్త్రమునుండి నేను తొలగక యున్నాను.
- Psalm 119:87 కీర్తనలు 119:87భూమిమీద నుండకుండ వారు నన్ను నాశనము చేయుటకు కొంచెమే తప్పెను అయితే నీ ఉపదేశములను నేను విడువకయున్నాను.
- Jeremiah 18:22 యిర్మీయా 18:22నన్ను పట్టుకొనుటకు వారు గొయ్యి త్రవ్విరి, నా కాళ్లకు ఉరులనొగ్గిరి; వారిమీదికి నీవు ఆకస్మికముగా దండును రప్పించుటవలన వారి యిండ్లలోనుండి కేకలు వినబడును గాక.
- Daniel 6:10 దానియేలు 6:10ఇట్టి శాసనము సంతకము చేయబడెనని దానియేలు తెలిసికొనినను అతడు తన యింటికి వెళ్లి, యధాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్లూని, తన యింటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరువబడియుండగా తన దేవునికి ప్రార్థనచేయుచు ఆయనను స్తుతించుచువచ్చెను.
- Psalm 119:21 కీర్తనలు 119:21గర్విష్ఠులను నీవు గద్దించుచున్నావు. నీ ఆజ్ఞలను విడిచి తిరుగువారు శాపగ్రస్తులు.