Psalms · chapter 140 · verse 5
Psalm 140:5 in Telugu
గర్విష్ఠులు నాకొరకు ఉరిని త్రాళ్లను చాటుగా ఒడ్డి యున్నారు వారు త్రోవప్రక్కను వల పరచియున్నారు. నన్ను పట్టుకొనుటకై ఉచ్చుల నొగ్గియున్నారు. (సెలా. )
Garvishthulu naakoraku urini traallanu chaatugaa oddi yunnaaru vaaru trovaprakkanu vala parachiyunnaaru. Nannu pattukonutakai uchchula noggiyunnaaru. (selaa. )
Psalm 140:5 in English
- King James Version (KJV)
- The proud have hid a snare for me, and cords; they have spread a net by the wayside; they have set gins for me. Selah.
- World English Bible (WEB)
- The proud have hidden a snare for me, they have spread the cords of a net by the path. They have set traps for me. Selah.
- American Standard Version (ASV)
- The proud have hid a snare for me, and cords; They have spread a net by the wayside; They have set gins for me. [Selah
- Bible in Basic English (BBE)
- The men of pride have put secret cords for my feet; stretching nets in my way, so that they may take me with their tricks. (Selah.)
- Darby Translation (DBY)
- The proud have hidden a snare for me, and cords; they have spread a net by the way-side; they have set traps for me. Selah.
- Webster's Bible (WBS)
- The proud have hid a snare for me, and cords; they have spread a net by the way side: they have set gins for me. Selah.
- Young's Literal Translation (YLT)
- The proud hid a snare for me — and cords, They spread a net by the side of the path, Snares they have set for me. Selah.
Read in context
- 3పాము నాలుకవలె వారు తమ నాలుకలు వాడి చేయుదురు వారి పెదవులక్రింద సర్పవిషమున్నది. (సెలా. )
- 4యెహోవా, భక్తిహీనుల చేతిలోపడకుండ నన్ను కాపాడుము. బలాత్కారము చేయువారి చేతిలోనుండి నన్ను రక్షింపుము. నేను అడుగు జారిపడునట్లు చేయుటకు వారు ఉద్దే శించుచున్నారు.
- 5గర్విష్ఠులు నాకొరకు ఉరిని త్రాళ్లను చాటుగా ఒడ్డి యున్నారు వారు త్రోవప్రక్కను వల పరచియున్నారు. నన్ను పట్టుకొనుటకై ఉచ్చుల నొగ్గియున్నారు. (సెలా. )
- 6అయినను నేను యెహోవాతో ఈలాగు మనవిచేయు చున్నాను యెహోవా, నీవే నా దేవుడవు నా విజ్ఞాపనలకు చెవియొగ్గుము.
- 7ప్రభువైన యెహోవా నా రక్షణదుర్గము యుద్ధదినమున నీవు నా తలను కాయుదువు.
Cross references
- Psalm 35:7 కీర్తనలు 35:7నన్ను పట్టుకొనవలెనని వారు నిర్నిమిత్తముగా గుంటలో తమ వల నొడ్డిరి నా ప్రాణము తీయవలెనని నిర్నిమిత్తముగా గుంట త్రవ్విరి.
- Psalm 142:3 కీర్తనలు 142:3నాలో నా ప్రాణము క్రుంగియున్నప్పుడు నా మార్గము నీకు తెలియును నన్ను పట్టుకొనుటకై నేను నడువవలసిన త్రోవలో చాటుగా పగవారు ఉరినొడ్డుచున్నారు.
- Jeremiah 18:22 యిర్మీయా 18:22నన్ను పట్టుకొనుటకు వారు గొయ్యి త్రవ్విరి, నా కాళ్లకు ఉరులనొగ్గిరి; వారిమీదికి నీవు ఆకస్మికముగా దండును రప్పించుటవలన వారి యిండ్లలోనుండి కేకలు వినబడును గాక.
- Jeremiah 18:20 యిర్మీయా 18:20వారు నా ప్రాణము తీయవలెనని గుంట త్రవ్వియున్నారు; చేసిన మేలునకు ప్రతిగా కీడు చేయవలెనా? వారికి మేలు కలుగవలెనని వారిమీదనుండి నీ కోపము తప్పించుటకై నీ సన్నిధిని నిలిచి నేను వారిపక్షముగా మాటలాడిన సంగతి జ్ఞాపకము చేసికొనుము.
- Luke 20:20–23 లూకా 20:20–23వారాయనను కనిపెట్టుచు, అధిపతి వశమునకును అధికారమునకును ఆయనను అప్పగించుటకై ఆయన మాటలయందు తప్పు పట్టవలెనని, తాము నీతిమంతులని అనిపించుకొను వేగుల వారిని ఆయనయొద్దకు పంపిరి. వారు వచ్చిబోధకుడా, నీవు న్యాయముగా మాటలాడుచును బోధించుచు నున్నావు; నీ వెవని యందును మోమోటము లేక సత్యము గానే దేవుని మార్గమును బోధించుచున్నావని యెరుగు దుము. మనము కైసరునకు పన్ను ఇచ్చుట న్యాయమా కాదా అని ఆయన నడిగిరి. ఆయన వారి కుయుక్తిని గుర్తెరిగి ఒక దేనారము నాకు చూపుడి.
- Psalm 119:85 కీర్తనలు 119:85నీ ధర్మశాస్త్రము ననుసరింపని గర్విష్ఠులు నన్ను చిక్కించుకొనుటకై గుంటలు త్రవ్విరి.
- Psalm 57:6 కీర్తనలు 57:6నా అడుగులను చిక్కించుకొనుటకై వారు వలయొడ్డిరి నా ప్రాణము క్రుంగియున్నది. నా యెదుట గుంట త్రవ్వి దానిలో తామేపడిరి. (సెలా. )
- Psalm 123:3–4 కీర్తనలు 123:3–4యెహోవా, మేము అధిక తిరస్కారము పాలైతివిు అహంకారుల నిందయు గర్విష్ఠుల తిరస్కారమును మామీదికి అధికముగా వచ్చియున్నవి. మమ్మును కరుణింపుము మమ్మును కరుణింపుము.
- Psalm 36:11 కీర్తనలు 36:11గర్విష్ఠుల పాదమును నా మీదికి రానియ్యకుము భక్తిహీనుల చేతిని నన్ను పారదోలనియ్యకుము.
- Luke 11:53–54 లూకా 11:53–54ఆయన అక్కడనుండి వెళ్లినప్పుడు శాస్త్రులును పరిసయ్యులును ఆయన మీద నిండ పగబట్టి ఆయన మీద నేరము మోపవలెనని యుండి, ఆయన నోట నుండి వచ్చు ఏమాటనైనను పట్టుకొనుటకు పొంచి, వెదకుచు చాల సంగతులనుగూర్చి ఆయనను మాటలాడింపసాగిరి.
- Psalm 119:110 కీర్తనలు 119:110నన్ను పట్టుకొనుటకై భక్తిహీనులు ఉరియొడ్డిరి అయినను నీ ఉపదేశములనుండి నేను తొలగి తిరుగుట లేదు.
- Job 18:9 యోబు 18:9బోను వారి మడిమెను పట్టుకొనును వల వారిని చిక్కించుకొనును.