Psalms · chapter 142 · verse 5
Psalm 142:5 in Telugu
యెహోవా, నీకే నేను మొఱ్ఱపెట్టుచున్నాను నా ఆశ్రయదుర్గము నీవే సజీవులున్న భూమిమీద నా స్వాస్థ్యము నీవే అని నేననుకొంటిని.
Yehovaa, neeke nenu morrapettuchunnaanu naa aashrayadurgamu neeve sajeevulunna bhoomimeeda naa svaasthyamu neeve ani nenanukontini.
Psalm 142:5 in English
- King James Version (KJV)
- I cried unto thee, O LORD: I said, Thou [art] my refuge [and] my portion in the land of the living.
- World English Bible (WEB)
- I cried to you, LORD. I said, “You are my refuge, my portion in the land of the living.”
- American Standard Version (ASV)
- I cried unto thee, O Jehovah; I said, Thou art my refuge, My portion in the land of the living.
- Bible in Basic English (BBE)
- I have made my cry to you, O Lord; I have said, You are my safe place, and my heritage in the land of the living.
- Darby Translation (DBY)
- I cried unto thee, Jehovah; I said, Thou art my refuge, my portion in the land of the living.
- Webster's Bible (WBS)
- I cried to thee, O LORD: I said, Thou [art] my refuge [and] my portion in the land of the living.
- Young's Literal Translation (YLT)
- I have cried unto thee, O Jehovah, I have said, 'Thou [art] my refuge, My portion in the land of the living.'
Read in context
- 3నాలో నా ప్రాణము క్రుంగియున్నప్పుడు నా మార్గము నీకు తెలియును నన్ను పట్టుకొనుటకై నేను నడువవలసిన త్రోవలో చాటుగా పగవారు ఉరినొడ్డుచున్నారు.
- 4నా కుడిప్రక్కను నిదానించి చూడుము నన్నెరిగినవాడు ఒకడును నాకు లేకపోయెను ఆశ్రయమేదియు నాకు దొరకలేదు నాయెడల జాలిపడువాడు ఒకడును లేడు.
- 5యెహోవా, నీకే నేను మొఱ్ఱపెట్టుచున్నాను నా ఆశ్రయదుర్గము నీవే సజీవులున్న భూమిమీద నా స్వాస్థ్యము నీవే అని నేననుకొంటిని.
- 6నేను చాలా క్రుంగియున్నాను నా మొఱ్ఱకు చెవి యొగ్గుము నన్ను తరుమువారు నాకంటె బలిష్ఠులు వారి చేతిలో నుండి నన్ను విడిపింపుము.
- 7నేను నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించునట్లు చెరసాలలోనుండి నా ప్రాణమును తప్పింపుము అప్పుడు నీవు నాకు మహోపకారము చేసియుండుట చూచి నీతిమంతులు నన్నుబట్టి అతిశయపడుదురు.
Cross references
- 2 Timothy 4:17 2 తిమోతికి 4:17అయితే నా ద్వారా సువార్త పూర్ణముగా ప్రకటింపబడు నిమిత్తమును, అన్య జనులందరును దాని విను నిమిత్తమును, ప్రభువు నా ప్రక్క నిలిచి నన్ను బలపరచెను గనుక నేను సింహము నోటనుండి తప్పింపబడితిని.
- Psalm 27:13 కీర్తనలు 27:13సజీవుల దేశమున నేను యెహోవా దయను పొందుదునన్న నమ్మకము నాకు లేనియెడల నేనేమవుదును? యెహోవా కొరకు కనిపెట్టుకొని యుండుము
- Psalm 16:5 కీర్తనలు 16:5యెహోవా నా స్వాస్థ్యభాగము నా పానీయభాగము నీవే నా భాగమును కాపాడుచున్నావు.
- Psalm 91:9–10 కీర్తనలు 91:9–10యెహోవా, నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాసస్థలముగా చేసికొనియున్నావు నీకు అపాయమేమియు రాదు ఏ తెగులును నీ గుడారమును సమీపించదు
- Psalm 73:26 కీర్తనలు 73:26నా శరీరము నా హృదయము క్షీణించిపోయినను దేవుడు నిత్యము నా హృదయమునకు ఆశ్రయ దుర్గమును స్వాస్థ్యమునై యున్నాడు.
- Lamentations 3:24 విలాపవాక్యములు 3:24యెహోవా నా భాగమని నేననుకొనుచున్నాను ఆయనయందు నేను నమ్మిక యుంచుకొనుచున్నాను.
- John 16:32 యోహాను 16:32యిదిగో మీలో ప్రతివాడును ఎవని యింటికి వాడు చెదరిపోయి నన్ను ఒంటరిగా విడిచిపెట్టు గడియ వచ్చుచున్నది, వచ్చేయున్నది; అయితే తండ్రి నాతో ఉన్నాడు గనుక నేను ఒంటరిగా లేను.
- Psalm 91:2 కీర్తనలు 91:2ఆయనే నాకు ఆశ్రయము నా కోట నేను నమ్ము కొను నా దేవుడని నేను యెహోవానుగూర్చి చెప్పుచున్నాను.
- Psalm 119:57 కీర్తనలు 119:57(హేత్)యెహోవా, నీవే నా భాగము నీ వాక్యముల ననుసరించి నడుచుకొందునని నేను నిశ్చయించుకొని యున్నాను.
- Psalm 56:13 కీర్తనలు 56:13నేను నీకు మ్రొక్కుకొని యున్నాను నేను నీకు స్తుతియాగముల నర్పించెదను.
- Psalm 46:1 కీర్తనలు 46:1దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై యున్నాడు ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు
- Psalm 62:6–7 కీర్తనలు 62:6–7ఆయనే నా ఆశ్రయదుర్గము నా రక్షణాధారము నా ఎత్తయిన కోట ఆయనే, నేను కదలింపబడను. నా రక్షణకు నా మహిమకు దేవుడే ఆధారము. నా బలమైన ఆశ్రయదుర్గము నా యాశ్రయము దేవునియందే యున్నది.