Psalms · chapter 145 · verse 15
Psalm 145:15 in Telugu
సర్వజీవుల కన్నులు నీవైపు చూచుచున్నవి తగిన కాలమందు నీవు వారికి ఆహారమిచ్చుదువు.
Sarvajeevula kannulu neevaipu choochuchunnavi tagina kaalamandu neevu vaariki aahaaramichchuduvu.
Psalm 145:15 in English
- King James Version (KJV)
- The eyes of all wait upon thee; and thou givest them their meat in due season.
- World English Bible (WEB)
- The eyes of all wait for you. You give them their food in due season.
- American Standard Version (ASV)
- The eyes of all wait for thee; And thou givest them their food in due season.
- Bible in Basic English (BBE)
- The eyes of all men are waiting for you; and you give them their food in its time.
- Darby Translation (DBY)
- The eyes of all wait upon thee; and thou givest them their food in its season.
- Webster's Bible (WBS)
- The eyes of all wait upon thee; and thou givest them their food in due season.
- Young's Literal Translation (YLT)
- The eyes of all unto Thee do look, And Thou art giving to them their food in its season,
Read in context
- 13నీ రాజ్యము శాశ్వతరాజ్యము నీ రాజ్యపరిపాలన తరతరములు నిలుచును.
- 14యెహోవా పడిపోవువారినందరిని ఉద్ధరించువాడు క్రుంగిపోయిన వారినందరిని లేవనెత్తువాడు
- 15సర్వజీవుల కన్నులు నీవైపు చూచుచున్నవి తగిన కాలమందు నీవు వారికి ఆహారమిచ్చుదువు.
- 16నీవు నీ గుప్పిలిని విప్పి ప్రతి జీవి కోరికను తృప్తి పరచుచున్నావు.
- 17యెహోవా తన మార్గములన్నిటిలో నీతిగలవాడు తన క్రియలన్నిటిలో కృపచూపువాడు
Cross references
- Psalm 136:25 కీర్తనలు 136:25సమస్త జీవులకును ఆయన ఆహారమిచ్చుచున్నాడు ఆయన కృప నిరంతరముండును.
- Psalm 104:27 కీర్తనలు 104:27తగిన కాలమున నీవు వాటికి ఆహారమిచ్చెదవని ఇవన్నియు నీ దయకొరకు కనిపెట్టుచున్నవి
- Acts 17:25 అపొస్తలుల కార్యములు 17:25ఆయన అందరికిని జీవమును ఊపిరిని సమస్తమును దయచేయువాడు గనుక తనకు ఏదైనను కొదువ యున్నట్టు మనుష్యుల చేతులతో సేవింప బడువాడు కాడు.
- Matthew 6:26 మత్తయి 6:26ఆకాశపక్షులను చూడుడి; అవి విత్తవు కోయవు కొట్లలో కూర్చుకొనవు; అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించు చున్నాడు; మీరు వాటికంటె బహు శ్రేష్టులు కారా?
- Psalm 147:8–9 కీర్తనలు 147:8–9ఆయన ఆకాశమును మేఘములతో కప్పువాడు భూమికొరకు వర్షము సిద్ధపరచువాడు పర్వతములమీద గడ్డి మొలిపించువాడు పశువులకును అరచుచుండు పిల్ల కాకులకును ఆయన ఆహారమిచ్చువాడు.
- Luke 12:24 లూకా 12:24కాకుల సంగతి విచారించి చూడుడి. అవి విత్తవు, కోయవు, వాటికి గరిసెలేదు, కొట్టులేదు; అయినను దేవుడు వాటిని పోషించుచున్నాడు; మీరు పక్షులకంటె ఎంతో శ్రేష్ఠులు.
- Job 38:39–41 యోబు 38:39–41ఆడుసింహము నిమిత్తము నీవు ఎరను వేటాడెదవా? సింహపుపిల్లలు తమ తమ గుహలలో పండుకొను నప్పుడు తమ గుహలలో పొంచి యుండునప్పుడు నీవు వాటి ఆకలి తీర్చెదవా? తిండిలేక తిరుగులాడుచు కాకి పిల్లలు దేవునికి మొఱ్ఱపెట్టునప్పుడు కాకికి ఆహారము సిద్ధపరచువాడెవడు?
- Genesis 1:30 ఆదికాండము 1:30భూమి మీదనుండు జంతువులన్నిటికిని ఆకాశ పక్షులన్నిటికిని భూమిమీద ప్రాకు సమస్త జీవులకును పచ్చని చెట్లన్నియు ఆహారమగునని పలికెను. ఆ ప్రకారమాయెను.
- Psalm 145:9 కీర్తనలు 145:9యెహోవా అందరికి ఉపకారి ఆయన కనికరములు ఆయన సమస్త కార్యములమీద నున్నవి.
- Joel 2:22 యోవేలు 2:22పశువులారా, భయపడకుడి, గడ్డిబీళ్లలో పచ్చిక మొలుచును, చెట్లు ఫలించును, అంజూరపుచెట్లును, ద్రాక్షచెట్లు సమృద్ధిగా ఫలించును,
- Psalm 104:21 కీర్తనలు 104:21సింహపు పిల్లలు వేటకొరకు గర్జించుచున్నవి తమ ఆహారమును దేవుని చేతిలోనుండి తీసికొన జూచుచున్నవి.