Psalms · chapter 149 · verse 3
Psalm 149:3 in Telugu
నాట్యముతో వారు ఆయన నామమును స్తుతించు దురు గాక తంబురతోను సితారాతోను ఆయననుగూర్చి గానము చేయుదురు గాక.
Naatyamuto vaaru aayana naamamunu stutinchu duru gaaka tamburatonu sitaaraatonu aayananugoorchi gaanamu cheyuduru gaaka.
Psalm 149:3 in English
- King James Version (KJV)
- Let them praise his name in the dance: let them sing praises unto him with the timbrel and harp.
- World English Bible (WEB)
- Let them praise his name in the dance! Let them sing praises to him with tambourine and harp!
- American Standard Version (ASV)
- Let them praise his name in the dance: Let them sing praises unto him with timbrel and harp.
- Bible in Basic English (BBE)
- Let them give praise to his name in the dance: let them make melody to him with instruments of brass and corded instruments of music.
- Darby Translation (DBY)
- Let them praise his name in the dance; let them sing psalms unto him with the tambour and harp.
- Webster's Bible (WBS)
- Let them praise his name in the dance: let them sing praises to him with the timbrel and harp:
- Young's Literal Translation (YLT)
- They praise His name in a dance, With timbrel and harp sing praise to Him.
Read in context
- 1యెహోవాను స్తుతించుడి యెహోవాకు క్రొత్త కీర్తన పాడుడి భక్తులు కూడుకొను సమాజములో ఆయనకు స్తోత్ర గీతము పాడుడి.
- 2ఇశ్రాయేలీయులు తమ్మును పుట్టించినవానినిబట్టి సంతో షించుదురు గాక సీయోను జనులు తమ రాజునుబట్టిఆనందించుదురు గాక.
- 3నాట్యముతో వారు ఆయన నామమును స్తుతించు దురు గాక తంబురతోను సితారాతోను ఆయననుగూర్చి గానము చేయుదురు గాక.
- 4యెహోవా తన ప్రజలందు ప్రీతిగలవాడు. ఆయన దీనులను రక్షణతో అలంకరించును.
- 5భక్తులు ఘనతనొంది ప్రహర్షించుదురు గాక వారు సంతోషభరితులై తమ పడకలమీద ఉత్సాహ గానము చేయుదురు గాక.
Cross references
- Jeremiah 31:13 యిర్మీయా 31:13వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చి వారిని ఆదరించెదను, విచారము కొట్టివేసి నేను వారికి ఆనందము కలుగజేతును గనుక కన్యకలును ¸యౌవనులును వృద్ధులును కూడి నాట్యమందు సంతోషించెదరు.
- 2 Samuel 6:16 2 సమూయేలు 6:16యెహోవా మందసము దావీదు పురమునకు రాగా, సౌలు కుమార్తె యగు మీకాలు కిటికీలోనుండి చూచి, యెహోవా సన్నిధిని గంతులు వేయుచు నాట్య మాడుచు నున్న దావీదును కనుగొని, తన మనస్సులో అతని హీనపరచెను.
- 2 Samuel 6:14 2 సమూయేలు 6:14దావీదు నారతో నేయబడిన ఏఫోదును ధరించినవాడై శక్తికొలది యెహోవా సన్నిధిని నాట్య మాడుచుండెను.
- 1 Chronicles 15:28–29 1 దినవృత్తాంతములు 15:28–29ఇశ్రాయేలీయులందరును ఆర్బా éటము చేయుచు, కొమ్ములు బూరలు ఊదుచు, తాళములు కొట్టుచు, స్వరమండలములు సితారాలు వాయించుచు యెహోవా నిబంధన మందసమును తీసికొనివచ్చిరి. యెహోవా నిబంధన మందసము దావీదుపురములోనికి రాగా సౌలు కుమార్తెయైన మీకాలు కిటికీలోనుండి చూచి రాజైన దావీదు నాట్యమాడుటయు వాయించుటయు కనుగొని తన మనస్సులో అతని హీనపరచెను.
- Psalm 81:2 కీర్తనలు 81:2కీర్తన యెత్తుడి గిలకతప్పెట పట్టుకొనుడి స్వరమండలమును మనోహరమైన సితారాను వాయించుడి.
- Exodus 15:20 నిర్గమకాండము 15:20మరియు అహరోను సహోదరియు ప్రవక్త్రియునగు మిర్యాము తంబురను చేత పట్టుకొనెను. స్త్రీలందరు తంబురలతోను నాట్యములతోను ఆమె వెంబడి వెళ్లగా
- Psalm 150:3–5 కీర్తనలు 150:3–5బూరధ్వనితో ఆయనను స్తుతించుడి. స్వరమండలముతోను సితారాతోను ఆయనను స్తుతించుడి. తంబురతోను నాట్యముతోను ఆయనను స్తుతించుడి. తంతివాద్యములతోను పిల్లనగ్రోవితోను ఆయనను స్తుతించుడి. మ్రోగు తాళములతో ఆయనను స్తుతించుడి. గంభీరధ్వనిగల తాళములతో ఆయనను స్తుతించుడి.
- Judges 11:34 న్యాయాధిపతులు 11:34యెఫ్తా మిస్పాలోనున్న తన యింటికి వచ్చినప్పుడు అతని కుమార్తె తంబురలతోను నాట్యముతోను బయలు దేరి అతనిని ఎదుర్కొనెను. ఆమె గాక అతనికి మగ సంతానమేగాని ఆడుసంతానమేగాని లేదు.
- Psalm 30:11 కీర్తనలు 30:11నా ప్రాణము మౌనముగా నుండక నిన్ను కీర్తించునట్లు నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చి యున్నావు.
- 1 Chronicles 16:42 1 దినవృత్తాంతములు 16:42బూరలు ఊదుటకును తాళములను వాయించుటకును దేవునిగూర్చి పాడతగిన గీతము లను వాద్యములతో వినిపించుటకును వీరిలోనుండు హేమానును యెదూతూనును అతడు నియమించెను. మరియు యెదూతూను కుమారులను అతడు ద్వార పాలకులుగా నియమించెను.
- Psalm 137:2–4 కీర్తనలు 137:2–4వాటిమధ్యనున్న నిరవంజిచెట్లకు మన సితారాలు తగి లించితివిు. అచ్చట మనలను చెరగొన్నవారు ఒక కీర్తనపాడుడి అనిరి మనలను బాధించినవారు సీయోను కీర్తనలలో ఒకదానిని మాకు వినిపించుడి అని మనవలన ఉల్లాసము గోరిరి అన్యుల దేశములో యెహోవా కీర్తనలు మనమెట్లు పాడుదుము?
- Psalm 33:2 కీర్తనలు 33:2సితారాతో యెహోవాను స్తుతించుడి పది తంతుల స్వరమండలముతో ఆయనను కీర్తించుడి