Psalms · chapter 22 · verse 5
Psalm 22:5 in Telugu
వారు నీకు మొఱ్ఱపెట్టి విడుదల నొందిరి నీయందు నమ్మిక యుంచి సిగ్గుపడకపోయిరి.
Vaaru neeku morrapetti vidudala nondiri neeyandu nammika yunchi siggupadakapoyiri.
Psalm 22:5 in English
- King James Version (KJV)
- They cried unto thee, and were delivered: they trusted in thee, and were not confounded.
- World English Bible (WEB)
- They cried to you, and were delivered. They trusted in you, and were not disappointed.
- American Standard Version (ASV)
- They cried unto thee, and were delivered: They trusted in thee, and were not put to shame.
- Bible in Basic English (BBE)
- They sent up their cry to you and were made free: they put their faith in you and were not put to shame.
- Darby Translation (DBY)
- They cried unto thee, and were delivered; they confided in thee, and were not confounded.
- Webster's Bible (WBS)
- They cried to thee, and were delivered: they trusted in thee, and were not confounded.
- Young's Literal Translation (YLT)
- Unto Thee they cried, and were delivered, In Thee they trusted, and were not ashamed.
Read in context
- 3నీవు ఇశ్రాయేలు చేయు స్తోత్రములమీద ఆసీనుడవై యున్నావు.
- 4మా పితరులు నీయందు నమ్మిక యుంచిరి వారు నీయందు నమ్మిక యుంచగా నీవు వారిని రక్షించితివి.
- 5వారు నీకు మొఱ్ఱపెట్టి విడుదల నొందిరి నీయందు నమ్మిక యుంచి సిగ్గుపడకపోయిరి.
- 6నేను నరుడను కాను నేను పురుగును నరులచేత నిందింపబడినవాడను ప్రజలచేత తృణీకరింపబడిన వాడను.
- 7నన్ను చూచువారందరు పెదవులు విరిచి తల ఆడిం చుచు నన్ను అపహసించుచున్నారు.
Cross references
- Romans 10:11 రోమీయులకు 10:11ఏమనగా, ఆయనయందు విశ్వాసముంచు వాడెవడును సిగ్గుపడడని లేఖనము చెప్పుచున్నది.
- Isaiah 49:23 యెషయా 49:23రాజులు నిన్ను పోషించు తండ్రులుగాను వారి రాణులు నీకు పాలిచ్చు దాదులుగాను ఉండెదరు వారు భూమిమీద సాగిలపడి నీకు నమస్కారము చేసెదరు నీ పాదముల ధూళి నాకెదరు. అప్పుడు నేను యెహోవాననియు నాకొరకు కని పెట్టుకొనువారు అవమానము నొందరనియు నీవు తెలిసికొందువు.
- Romans 9:33 రోమీయులకు 9:33ఇదిగో నేను అడ్డురాతిని అడ్డుబండను సీయోనులో స్థాపించుచున్నాను; ఆయనయందు విశ్వాసముంచు వాడు సిగ్గుపరచబడడు అని వ్రాయబడిన ప్రకారము వారు అడ్డురాయి తగిలి, తొట్రుపడిరి.
- 1 Peter 2:6 1 పేతురు 2:6ఏలయనగా ఇదిగో నేను ముఖ్యమును ఏర్పరచబడినదియు అమూల్యమునగు మూలరాతిని సీయోనులొ స్థాపించుచున్నాను; ఆయనయందు విశ్వాసముంచు వాడు ఏమాత్రమును సిగ్గుపడడు అను మాట లేఖనమందు వ్రాయబడియున్నది.
- Isaiah 45:17 యెషయా 45:17యెహోవావలన ఇశ్రాయేలు నిత్యమైన రక్షణ పొంది యున్నది మీరు ఎన్నటెన్నటికి సిగ్గుపడకయు విస్మయ మొంద కయు నుందురు.
- Psalm 71:1 కీర్తనలు 71:1యెహోవా, నేను నీ శరణుజొచ్చి యున్నాను. నన్నెన్నడును సిగ్గుపడనియ్యకుము.
- Judges 10:10–16 న్యాయాధిపతులు 10:10–16అప్పుడు ఇశ్రాయేలీయులుమేము నీ సన్నిధిని పాపము చేసియున్నాము, మా దేవుని విడిచి బయలులను పూజించి యున్నామని యెహోవాకు మొఱ్ఱపెట్టగా యెహోవా ఐగుప్తీయుల వశములోనుండియు అమోరీయుల వశ ములో నుండియు అమ్మోనీయుల వశములోనుండియు ఫిలిష్తీ యుల వశములోనుండియు మాత్రము గాక సీదోనీయు లును అమాలేకీయులును మాయోనీయులును మిమ్మును బాధ పరచినప్పుడు వారి వశములోనుండియు నేను మిమ్మును రక్షించితిని గదా అయితే మీరు నన్ను విసర్జించి అన్య దేవతలను పూజించితిరి గనుక నేను ఇకను మిమ్మును రక్షిం పను. పోయి మీరు కోరుకొనిన దేవతలకు మొఱ్ఱపెట్టు కొనుడి; మీ శ్రమకాలమున అవి మిమ్మును రక్షించునేమో అని ఇశ్రాయేలీయులతో సెలవిచ్చెను. అప్పుడు ఇశ్రా యేలీయులుమేము పాపము చేసియున్నాము, నీ దృష్టికి ఏది అనుకూలమో దాని చొప్పున మాకు చేయుము; దయ చేసి నేడు మమ్మును రక్షింపుమని చెప్పి యెహోవాను సేవింపవలెనని తమ మధ్యనుండి అన్యదేవతలను తొలగింపగా, ఆయన ఆత్మ ఇశ్రాయేలీయులకు కలిగిన దురవస్థను చూచి సహింపలేక పోయెను.
- Psalm 25:2–3 కీర్తనలు 25:2–3నా దేవా, నీయందు నమ్మిక యుంచియున్నాను నన్ను సిగ్గుపడనియ్యకుము నా శత్రువులను నన్నుగూర్చి ఉత్సహింప నియ్యకుము నీకొరకు కనిపెట్టువారిలో ఎవడును సిగ్గునొందడు. హేతువు లేకుండనే ద్రోహము చేయువారు సిగ్గు నొందుదురు.
- Judges 6:6 న్యాయాధిపతులు 6:6దేశమును పాడుచేయుటకు వారు దానిలోనికి వచ్చిరి ఇశ్రాయేలీయులు మిద్యానీయులవలన మిక్కిలి హీనదశకు వచ్చినప్పుడు వారు యెహోవాకు మొఱ్ఱ పెట్టిరి.
- Psalm 31:1 కీర్తనలు 31:1యెహోవా, నీ శరణుజొచ్చి యున్నాను నన్నెన్నడును సిగ్గుపడనియ్యకుము నీ నీతినిబట్టి నన్ను రక్షింపుము.
- Psalm 106:44 కీర్తనలు 106:44అయినను వారిరోదనము తనకు వినబడగా వారికి కలిగిన శ్రమను ఆయన చూచెను.
- Psalm 69:6–7 కీర్తనలు 69:6–7ప్రభువా, సైన్యములకధిపతివగు యెహోవా, నీకొరకు కనిపెట్టుకొనువారికి నావలన సిగ్గు కలుగ నియ్యకుము ఇశ్రాయేలు దేవా, నిన్ను వెదకువారిని నావలన అవమానము నొంద నియ్యకుము. నీ నిమిత్తము నేను నిందనొందినవాడనైతిని నీ నిమిత్తము సిగ్గు నా ముఖమును కప్పెను.