Skip to content
ThuthiThuthiThuthi
Psalms · chapter 22 of 150 · 31 verses

Psalm 22 in Telugu

కీర్తనలు 22

  1. నా దేవా నా దేవా, నీవు నన్నేల విడనాడితివి? నన్ను రక్షింపక నా ఆర్తధ్వని వినక నీవేల దూరముగానున్నావు?

    To the chief Musician upon Aijeleth Shahar, A Psalm of David. My God, my God, why hast thou forsaken me? [why art thou so] far from helping me, [and from] the words of my roaring?

  2. నా దేవా, పగలు నేను మొఱ్ఱపెట్టుచున్నాను రాత్రివేళను నేను మౌనముగా నుండుట లేదు అయినను నీవు నా కుత్తరమియ్యకున్నావు.

    O my God, I cry in the daytime, but thou hearest not; and in the night season, and am not silent.

  3. నీవు ఇశ్రాయేలు చేయు స్తోత్రములమీద ఆసీనుడవై యున్నావు.

    But thou [art] holy, [O thou] that inhabitest the praises of Israel.

  4. మా పితరులు నీయందు నమ్మిక యుంచిరి వారు నీయందు నమ్మిక యుంచగా నీవు వారిని రక్షించితివి.

    Our fathers trusted in thee: they trusted, and thou didst deliver them.

  5. వారు నీకు మొఱ్ఱపెట్టి విడుదల నొందిరి నీయందు నమ్మిక యుంచి సిగ్గుపడకపోయిరి.

    They cried unto thee, and were delivered: they trusted in thee, and were not confounded.

  6. నేను నరుడను కాను నేను పురుగును నరులచేత నిందింపబడినవాడను ప్రజలచేత తృణీకరింపబడిన వాడను.

    But I [am] a worm, and no man; a reproach of men, and despised of the people.

  7. నన్ను చూచువారందరు పెదవులు విరిచి తల ఆడిం చుచు నన్ను అపహసించుచున్నారు.

    All they that see me laugh me to scorn: they shoot out the lip, they shake the head, [saying],

  8. యెహోవామీద నీ భారము మోపుము ఆయన వానిని విడిపించునేమోవాడు ఆయనకు ఇష్టుడు గదా ఆయన వానిని తప్పించు నేమో అందురు.

    He trusted on the LORD [that] he would deliver him: let him deliver him, seeing he delighted in him.

  9. గర్భమునుండి నన్ను తీసినవాడవు నీవే గదా నేను నా తల్లియొద్ద స్తన్యపానము చేయుచుండగా నీవే గదా నాకు నమ్మిక పుట్టించితివి.

    But thou [art] he that took me out of the womb: thou didst make me hope [when I was] upon my mother’s breasts.

  10. గర్భవాసినైనది మొదలుకొని నాకు ఆధారము నీవే నా తల్లి నన్ను కన్నది మొదలుకొని నా దేవుడవు నీవే.

    I was cast upon thee from the womb: thou [art] my God from my mother’s belly.

  11. శ్రమ వచ్చియున్నది, సహాయము చేయువాడెవడును లేడు నాకు దూరముగా నుండకుము.

    Be not far from me; for trouble [is] near; for [there is] none to help.

  12. వృషభములు అనేకములు నన్ను చుట్టుకొని యున్నవి బాషానుదేశపు బలమైన వృషభములు నన్ను ఆవరించి యున్నవి.

    Many bulls have compassed me: strong [bulls] of Bashan have beset me round.

  13. చీల్చుచును గర్జించుచునుండు సింహమువలె వారు నోళ్లు తెరచుచున్నారు

    They gaped upon me [with] their mouths, [as] a ravening and a roaring lion.

  14. నేను నీళ్లవలె పారబోయబడి యున్నాను నా యెముకలన్నియు స్థానము తప్పియున్నవినా హృదయము నా అంతరంగమందు మైనమువలె కరగియున్నది.

    I am poured out like water, and all my bones are out of joint: my heart is like wax; it is melted in the midst of my bowels.

  15. నా బలము యెండిపోయి చిల్లపెంకువలె ఆయెను నా నాలుక నా దౌడను అంటుకొని యున్నదినీవు నన్ను ప్రేతల భూమిలో పడవేసి యున్నావు.

    My strength is dried up like a potsherd; and my tongue cleaveth to my jaws; and thou hast brought me into the dust of death.

  16. కుక్కలు నన్ను చుట్టుకొని యున్నవి దుర్మార్గులు గుంపుకూడి నన్ను ఆవరించియున్నారువారు నా చేతులను నా పాదములను పొడిచియున్నారు.

    For dogs have compassed me: the assembly of the wicked have inclosed me: they pierced my hands and my feet.

  17. నా యెముకలన్నియు నేను లెక్కింపగలను వారు నిదానించుచు నన్ను తేరి చూచుచున్నారు

    I may tell all my bones: they look [and] stare upon me.

  18. నా వస్త్రములు వారు పంచుకొనుచున్నారు నా అంగీకొరకు చీట్లు వేయుచున్నారు.

    They part my garments among them, and cast lots upon my vesture.

  19. యెహోవా, దూరముగా నుండకుము నా బలమా, త్వరపడి నాకు సహాయము చేయుము.

    But be not thou far from me, O LORD: O my strength, haste thee to help me.

  20. ఖడ్గమునుండి నా ప్రాణమును కుక్కల బలమునుండి నా ప్రాణమును తప్పింపుము.

    Deliver my soul from the sword; my darling from the power of the dog.

  21. సింహపు నోటనుండి నన్ను రక్షింపుము గురుపోతుల కొమ్ములలోనుండి నన్ను రక్షించి నాకుత్తరమిచ్చి యున్నావు

    Save me from the lion’s mouth: for thou hast heard me from the horns of the unicorns.

  22. నీ నామమును నా సహోదరులకు ప్రచురపరచెదను సమాజమధ్యమున నిన్ను స్తుతించెదను.

    I will declare thy name unto my brethren: in the midst of the congregation will I praise thee.

  23. యెహోవాయందు భయభక్తులు గలవారలారా, ఆయ నను స్తుతించుడి యాకోబు వంశస్థులారా, మీరందరు ఆయనను ఘన పరచుడి ఇశ్రాయేలు వంశస్థులారా, మీరందరు ఆయనకు భయపడుడి

    Ye that fear the LORD, praise him; all ye the seed of Jacob, glorify him; and fear him, all ye the seed of Israel.

  24. ఆయన బాధపడువాని బాధను తృణీకరింపలేదు, దాని చూచి ఆయన అసహ్యపడలేదు, అతనికి తన ముఖమును దాచలేదు. వాడాయనకు మొఱ్ఱపెట్టగా ఆయన ఆలకించెను.

    For he hath not despised nor abhorred the affliction of the afflicted; neither hath he hid his face from him; but when he cried unto him, he heard.

  25. మహా సమాజములో నిన్నుగూర్చి నేను కీర్తన పాడెదను ఆయనయందు భయభక్తులు గలవారియెదుట నా మ్రొక్కుబడులు చెల్లించెదను.

    My praise [shall be] of thee in the great congregation: I will pay my vows before them that fear him.

  26. దీనులు భోజనముచేసి తృప్తిపొందెదరు యెహోవాను వెదకువారు ఆయనను స్తుతించెదరు మీ హృదయములు తెప్పరిల్లి నిత్యము బ్రదుకును.

    The meek shall eat and be satisfied: they shall praise the LORD that seek him: your heart shall live for ever.

  27. భూదిగంతముల నివాసులందరు జ్ఞాపకము చేసికొని యెహోవాతట్టు తిరిగెదరు అన్యజనుల వంశస్థులందరు నీ సన్నిధిని నమస్కారము చేసెదరు

    All the ends of the world shall remember and turn unto the LORD: and all the kindreds of the nations shall worship before thee.

  28. రాజ్యము యెహోవాదే అన్యజనులలో ఏలువాడు ఆయనే.

    For the kingdom [is] the LORD’s: and he [is] the governor among the nations.

  29. భూమిమీద వర్థిల్లుచున్నవారందరు అన్నపానములు పుచ్చుకొనుచు నమస్కారము చేసెదరుతమ ప్రాణము కాపాడుకొనలేక మంటిపాలగు వారందరు ఆయన సన్నిధిని మోకరించెదరు

    All [they that be] fat upon earth shall eat and worship: all they that go down to the dust shall bow before him: and none can keep alive his own soul.

  30. ఒక సంతతివారు ఆయనను సేవించెదరు రాబోవుతరమునకు ప్రభువునుగూర్చి వివరింతురు.

    A seed shall serve him; it shall be accounted to the Lord for a generation.

  31. వారు వచ్చిఆయన దీని చేసెనని పుట్టబోవు ప్రజలకు తెలియజేతురుఆయన నీతిని వారికి ప్రచురపరతురు.

    They shall come, and shall declare his righteousness unto a people that shall be born, that he hath done [this].

All chapters of Psalms · Telugu Bible · Psalm 22 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.