Psalms · chapter 29 · verse 6
Psalm 29:6 in Telugu
దూడవలె అవి గంతులు వేయునట్లు ఆయన చేయును లెబానోనును షిర్యోనును గురుపోతు పిల్లవలె గంతులు వేయునట్లు ఆయన చేయును.
Doodavale avi gantulu veyunatlu aayana cheyunu lebaanonunu shiryonunu gurupotu pillavale gantulu veyunatlu aayana cheyunu.
Psalm 29:6 in English
- King James Version (KJV)
- He maketh them also to skip like a calf; Lebanon and Sirion like a young unicorn.
- World English Bible (WEB)
- He makes them also to skip like a calf; Lebanon and Sirion like a young, wild ox.
- American Standard Version (ASV)
- He maketh them also to skip like a calf; Lebanon and Sirion like a young wild-ox.
- Bible in Basic English (BBE)
- He makes them go jumping about like a young ox; Lebanon and Sirion like a young mountain ox.
- Darby Translation (DBY)
- And he maketh them to skip like a calf, Lebanon and Sirion like a young buffalo.
- Webster's Bible (WBS)
- He maketh them also to skip like a calf; Lebanon and Sirion like a young unicorn.
- Young's Literal Translation (YLT)
- And He causeth them to skip as a calf, Lebanon and Sirion as a son of Reems,
Read in context
- 4యెహోవా స్వరము బలమైనది యెహోవా స్వరము ప్రభావము గలది.
- 5యెహోవా స్వరము దేవదారు వృక్షములను విరచును యెహోవా లెబానోను దేవదారు వృక్షములను ముక్కలుగా విరచును.
- 6దూడవలె అవి గంతులు వేయునట్లు ఆయన చేయును లెబానోనును షిర్యోనును గురుపోతు పిల్లవలె గంతులు వేయునట్లు ఆయన చేయును.
- 7యెహోవా స్వరము అగ్నిజ్వాలలను ప్రజ్వలింప జేయుచున్నది.
- 8యెహోవా స్వరము అరణ్యమును కదలించును యెహోవా కాదేషు అరణ్యమును కదలించును
Cross references
- Deuteronomy 3:9 ద్వితీయోపదేశకాండము 3:9సీదోనీయులు హెర్మోనును షిర్యోనని అందురు. అమో రీయులు దానిని శెనీరని అందురు.
- Numbers 23:22 సంఖ్యాకాండము 23:22రాజుయొక్క జయధ్వని వారిలో నున్నది దేవుడు ఐగుప్తులోనుండి వారిని రప్పించెను గురుపోతు వేగమువంటి వేగము వారికి కలదు.
- Psalm 114:4–7 కీర్తనలు 114:4–7కొండలు పొట్టేళ్లవలెను గుట్టలు గొఱ్ఱెపిల్లలవలెను గంతులు వేసెను. సముద్రమా, నీవు పారిపోవుటకు నీకేమి తటస్థించి నది? యొర్దానూ, నీవు వెనుకకు మళ్లుటకు నీకేమి తటస్థించి నది? కొండలారా, మీరు పొట్లేళ్లవలెను గుట్టలారా, మీరు గొఱ్ఱెపిల్లలవలెను గంతులు వేయుటకు మీకేమి సంభవించినది? భూమీ, ప్రభువు సన్నిధిని యాకోబు దేవుని సన్నిధిని వణకుము
- Psalm 92:10 కీర్తనలు 92:10గురుపోతు కొమ్మువలె నీవు నా కొమ్ము పైకెత్తితివి క్రొత్త తైలముతో నేను అంటబడితిని.
- Revelation 20:11 ప్రకటన 20:11మరియు ధవళమైన మహా సింహాసనమును దానియందు ఆసీనుడైయున్న యొకనిని చూచితిని; భూమ్యాకాశములు ఆయన సముఖమునుండి పారిపోయెను; వాటికి నిలువ చోటు కనబడకపోయెను.
- Jeremiah 4:23–25 యిర్మీయా 4:23–25నేను భూమిని చూడగా అది నిరాకారముగాను శూన్యముగాను ఉండెను; ఆకాశముతట్టు చూడగా అచ్చట వెలుగులేకపోయెను. పర్వతములను చూడగా అవి కంపించుచున్నవి కొండలన్నియు కదులుచున్నవి. నేను చూడగా నరుడొకడును లేకపోయెను, ఆకాశపక్షులన్నియు ఎగిరిపోయియుండెను.
- Habakkuk 3:6–11 హబక్కూకు 3:6–11ఆయన నిలువబడగా భూమి కంపించును ఆయన చూడగా జనులందరు ఇటు అటు తొలుగు దురు ఆదికాల పర్వతములు బద్దలైపోవును పురాతన గిరులు అణగును పూర్వకాలము మొదలుకొని ఆయన ఈలాగు జరి గించువాడు. కూషీయుల డేరాలలో ఉపద్రవము కలుగగా నేను చూచితిని మిద్యాను దేశస్థుల డేరాల తెరలు గజగజ వణ కెను. యెహోవా, నదులమీద నీకు కోపము కలిగినందుననా నదులమీద నీకు ఉగ్రత కలిగినందుననా సముద్రముమీద నీకు ఉగ్రత కలిగినందుననా నీ గుఱ్ఱములను కట్టుకొని రక్షణార్థమైన రథములమీద ఎక్కి వచ్చుచున్నావు? విల్లు వరలోనుండి తీయబడియున్నది నీ వాక్కుతోడని ప్రమాణము చేసి నీ బాణములను సిద్ధపరచియున్నావు (సెలా. ) భూమిని బద్దలు చేసి నదులను కలుగజేయుచున్నావు. నిన్ను చూచి పర్వతములు కంపించును జలములు ప్రవాహములుగా పారును సముద్రాగాధము ఘోషించుచు తన చేతులు పై కెత్తును. నీ ఈటెలు తళతళలాడగా సంచరించు నీ బాణముల కాంతికి భయపడి సూర్యచంద్రులు తమ నివాసములలో ఆగిపోవుదురు.