Psalms · chapter 49 · verse 3
Psalm 49:3 in Telugu
నా హృదయధ్యానము పూర్ణవివేకమును గూర్చినదై యుండును.
Naa hrudayadhyaanamu poornavivekamunu goorchinadai yundunu.
Psalm 49:3 in English
- King James Version (KJV)
- My mouth shall speak of wisdom; and the meditation of my heart [shall be] of understanding.
- World English Bible (WEB)
- My mouth will speak words of wisdom. My heart will utter understanding.
- American Standard Version (ASV)
- My mouth shall speak wisdom; And the meditation of my heart shall be of understanding.
- Bible in Basic English (BBE)
- From my mouth will come words of wisdom; and in the thoughts of my heart will be knowledge.
- Darby Translation (DBY)
- My mouth shall speak wisdom, and the meditation of my heart shall be of understanding:
- Webster's Bible (WBS)
- My mouth shall speak of wisdom; and the meditation of my heart [shall be] of understanding.
- Young's Literal Translation (YLT)
- My mouth speaketh wise things, And the meditations of my heart [are] things of understanding.
Read in context
- 1సర్వజనులారా ఆలకించుడి.
- 2సామాన్యులేమి సామంతులేమి ధనికులేమి దరిద్రులేమి లోకనివాసులారా, మీరందరు ఏకముగా కూడి చెవి యొగ్గుడి. నా నోరు విజ్ఞానవిషయములను పలుకును
- 3నా హృదయధ్యానము పూర్ణవివేకమును గూర్చినదై యుండును.
- 4గూఢార్థముగలదానికి నేను చెవియొగ్గెదను సితారా తీసికొని నా మరుగు మాట బయలుపరచెదను.
- 5నాకొరకు పొంచువారి దోషకృత్యములు నన్ను చుట్టుకొనినప్పుడు ఆపత్కాలములలో నేనేల భయపడవలెను?
Cross references
- Matthew 12:35 మత్తయి 12:35సజ్జనుడు తన మంచి ధననిధిలో నుండి సద్విషయములను తెచ్చును; దుర్జనుడు తన చెడ్డ ధననిధిలోనుండి దుర్విషయములను తెచ్చును.
- Psalm 19:14 కీర్తనలు 19:14యెహోవా, నా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలును నా హృదయ ధ్యానమునునీ దృష్టికి అంగీకారములగును గాక.
- Proverbs 22:20–21 సామెతలు 22:20–21నిన్ను పంపువారికి నీవు సత్యవాక్యములతో ప్రత్యుత్తర మిచ్చునట్లు సత్యప్రమాణము నీకు తెలియజేయుటకై ఆలోచనయు తెలివియుగల శ్రేష్ఠమైన సామెతలు నేను నీకొరకు రచించితిని.
- Proverbs 22:17 సామెతలు 22:17చెవి యొగ్గి జ్ఞానుల ఉపదేశము ఆలకింపుము నేను కలుగజేయు తెలివిని పొందుటకు మనస్సు నిమ్ము.
- Job 33:3 యోబు 33:3నామాటలు నా హృదయ యథార్థతను తెలుపుచున్నవినా పెదవులు జ్ఞానమును యథార్థముగా పలుకును.
- Psalm 119:130 కీర్తనలు 119:130నీ వాక్యములు వెల్లడి అగుటతోడనే వెలుగుకలుగును అవి తెలివిలేనివారికి తెలివి కలిగించును.
- 2 Timothy 3:15–17 2 తిమోతికి 3:15–17నీవు నేర్చుకొని రూఢియని తెలిసికొన్నవి యెవరివలన నేర్చుకొంటివో ఆ సంగతి తెలిసికొని, వాటియందు నిలుకడగా ఉండుము. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి యుండునట్లు దైవావేశమువలన కలిగిన ప్రతిలేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పు దిద్దుటకును, నీతియందు శిక్షచేయుటకును ప్రయోజనకరమై యున్నది.
- Job 33:33 యోబు 33:33మాట యేమియు లేనియెడల నీవు నా మాట ఆలకింపుము మౌనముగా నుండుము, నేను నీకు జ్ఞానము బోధించెదను.
- Deuteronomy 32:2 ద్వితీయోపదేశకాండము 32:2నా ఉపదేశము వానవలె కురియును నా వాక్యము మంచువలెను లేతగడ్డిమీద పడు చినుకులవలెను పచ్చికమీద కురియు వర్షమువలెను ఉండును.
- Proverbs 4:1–2 సామెతలు 4:1–2కుమారులారా, తండ్రి యుపదేశము వినుడి మీరు వివేకమునొందునట్లు ఆలకించుడి నేను మీకు సదుపదేశము చేసెదను నా బోధను త్రోసివేయకుడి.
- Psalm 37:30 కీర్తనలు 37:30నీతిమంతుల నోరు జ్ఞానమునుగూర్చి వచించును వారి నాలుక న్యాయమును ప్రకటించును.
- Psalm 104:34 కీర్తనలు 104:34ఆయననుగూర్చిన నా ధ్యానము ఆయనకు ఇంపుగా నుండునుగాక నేను యెహోవాయందు సంతోషించెదను.