Proverbs · chapter 4 · verse 1
Proverbs 4:1 in Telugu
కుమారులారా, తండ్రి యుపదేశము వినుడి మీరు వివేకమునొందునట్లు ఆలకించుడి
Kumaarulaaraa, tandri yupadeshamu vinudi meeru vivekamunondunatlu aalakinchudi
Proverbs 4:1 in English
- King James Version (KJV)
- Hear, ye children, the instruction of a father, and attend to know understanding.
- World English Bible (WEB)
- Listen, sons, to a father’s instruction. Pay attention and know understanding;
- American Standard Version (ASV)
- Hear, [my] sons, the instruction of a father, And attend to know understanding:
- Bible in Basic English (BBE)
- Give ear, my sons, to the teaching of a father; give attention so that you may have knowledge:
- Darby Translation (DBY)
- Hear, ye children, the instruction of a father, and attend to know intelligence;
- Webster's Bible (WBS)
- Hear, ye children, the instruction of a father, and attend to know understanding.
- Young's Literal Translation (YLT)
- Hear, ye sons, the instruction of a father, And give attention to know understanding.
Read in context
- 1కుమారులారా, తండ్రి యుపదేశము వినుడి మీరు వివేకమునొందునట్లు ఆలకించుడి
- 2నేను మీకు సదుపదేశము చేసెదను నా బోధను త్రోసివేయకుడి.
- 3నా తండ్రికి నేను కుమారుడుగా నుంటిని నా తల్లి దృష్టికి నేను సుకుమారుడనైన యేక కుమారుడనైయుంటిని.
Cross references
- Hebrews 2:1 హెబ్రీయులకు 2:1కావున మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టు కొనిపోకుండునట్లు వాటియందు మరి విశేష జాగ్రత్త కలిగియుండవలెను.
- Psalm 34:11 కీర్తనలు 34:11పిల్లలారా, మీరు వచ్చి నా మాట వినుడి. యెహోవాయందలి భయభక్తులు మీకు నేర్పెదను.
- Proverbs 1:8 సామెతలు 1:8నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశము ఆలకింపుము నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకుము.
- Proverbs 2:1–5 సామెతలు 2:1–5నా కుమారుడా, నీవు నా మాటల నంగీకరించి నా ఆజ్ఞలను నీయొద్ద దాచుకొనినయెడల జ్ఞానమునకు నీ చెవియొగ్గి హృదయపూర్వకముగా వివేచన నభ్యసించినయెడల తెలివికై మొఱ్ఱపెట్టిన యెడల వివేచనకై మనవి చేసినయెడల వెండిని వెదకినట్లు దాని వెదకిన యెడల దాచబడిన ధనమును వెదకినట్లు దాని వెదకిన యెడల యెహోవాయందు భయభక్తులు కలిగియుండుట యెట్టిదో నీవు గ్రహించెదవు దేవునిగూర్చిన విజ్ఞానము నీకు లభించును.
- 1 Thessalonians 2:11–12 1 థెస్సలొనీకయులకు 2:11–12తన రాజ్యమునకును మహిమకును మిమ్మును పిలుచుచున్న దేవునికి తగినట్టుగా మీరు నడుచుకొనవలెనని మేము మీలో ప్రతివానిని హెచ్చరించుచు, ధైర్యపరచుచు సాక్ష్యమిచ్చుచు, తండ్రి తన బిడ్డల యెడల నడుచుకొనురీతిగా మీలో ప్రతివానియెడల మేము నడుచుకొంటిమని మీకు తెలియును.
- Proverbs 5:1 సామెతలు 5:1నా కుమారుడా, నా జ్ఞానోపదేశము ఆలకింపుము వివేకముగల నా బోధకు చెవి యొగ్గుము
- Proverbs 22:17 సామెతలు 22:17చెవి యొగ్గి జ్ఞానుల ఉపదేశము ఆలకింపుము నేను కలుగజేయు తెలివిని పొందుటకు మనస్సు నిమ్ము.
- Proverbs 7:4 సామెతలు 7:4జ్ఞానముతోనీవు నాకు అక్కవనియు తెలివితోనీవు నాకు చెలికత్తెవనియు చెప్పుము.
- Proverbs 19:20 సామెతలు 19:20నీవు ముందుకు జ్ఞానివగుటకై ఆలోచన విని ఉపదేశము అంగీకరించుము.
- Proverbs 8:32–36 సామెతలు 8:32–36కావున పిల్లలారా, నా మాట ఆలకించుడి నా మార్గముల ననుసరించువారు ధన్యులు ఉపదేశమును నిరాకరింపక దాని నవలంబించి జ్ఞానులై యుండుడి. అనుదినము నా గడపయొద్ద కనిపెట్టుకొని నా ద్వారబంధములయొద్ద కాచుకొని నా ఉపదేశము వినువారు ధన్యులు. నన్ను కనుగొనువాడు జీవమును కనుగొనును యెహోవా కటాక్షము వానికి కలుగును. నన్ను కనుగొననివాడు తనకే హాని చేసికొనును నాయందు అసహ్యపడువారందరు మరణమును స్నేహించుదురు.
- Proverbs 6:20–23 సామెతలు 6:20–23నా కుమారుడా, నీ తండ్రి ఆజ్ఞను గైకొనుము నీ తల్లి ఉపదేశమును త్రోసివేయకుము. వాటిని ఎల్లప్పుడు నీ హృదయమునందు ధరించు కొనుము నీ మెడచుట్టు వాటిని కట్టుకొనుము. నీవు త్రోవను వెళ్లునప్పుడు అది నిన్ను నడిపించును నీవు పండుకొనునప్పుడు అది నిన్ను కాపాడును. నీవు మేలుకొనునప్పుడు అది నీతో ముచ్చటించును. ఆజ్ఞ దీపముగాను ఉపదేశము వెలుగుగాను ఉండును. శిక్షార్థమైన గద్దింపులు జీవమార్గములు.