Psalms · chapter 51 · verse 16
Psalm 51:16 in Telugu
నీవు బలిని కోరువాడవుకావు కోరినయెడల నేను అర్పించుదును దహనబలి నీకిష్టమైనది కాదు.
Neevu balini koruvaadavukaavu korinayedala nenu arpinchudunu dahanabali neekishtamainadi kaadu.
Psalm 51:16 in English
- King James Version (KJV)
- For thou desirest not sacrifice; else would I give [it:] thou delightest not in burnt offering.
- World English Bible (WEB)
- For you don’t delight in sacrifice, or else I would give it. You have no pleasure in burnt offering.
- American Standard Version (ASV)
- For thou delightest not in sacrifice; else would I give it: Thou hast no pleasure in burnt-offering.
- Bible in Basic English (BBE)
- You have no desire for an offering or I would give it; you have no delight in burned offerings.
- Darby Translation (DBY)
- For thou desirest not sacrifice; else would I give it: thou hast no pleasure in burnt-offering.
- Webster's Bible (WBS)
- For thou desirest not sacrifice: else would I give [it] : thou delightest not in burnt-offering.
- Young's Literal Translation (YLT)
- For Thou desirest not sacrifice, or I give [it], Burnt-offering Thou acceptest not.
Read in context
- 14దేవా, నా రక్షణకర్తయగు దేవా రక్తాపరాధమునుండి నన్ను విడిపింపుము అప్పుడు నా నాలుక నీ నీతినిగూర్చి ఉత్సాహగానము చేయును.
- 15ప్రభువా, నా నోరు నీ స్తుతిని ప్రచురపరచునట్లు నా పెదవులను తెరువుము.
- 16నీవు బలిని కోరువాడవుకావు కోరినయెడల నేను అర్పించుదును దహనబలి నీకిష్టమైనది కాదు.
- 17విరిగిన మనస్సే దేవునికిష్టమైన బలులు దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు.
- 18నీ కటాక్షముచొప్పున సీయోనుకు మేలుచేయుము యెరూషలేముయొక్క గోడలను కట్టించుము.
Cross references
- Hosea 6:6 హోషేయ 6:6నేను బలిని కోరను గాని కనికరమునే కోరుచున్నాను, దహనబలులకంటె దేవునిగూర్చిన జ్ఞానము నాకిష్టమైనది.
- Psalm 40:6 కీర్తనలు 40:6బలులనైనను నైవేద్యములనైనను నీవు కోరుటలేదు. నీవు నాకు చెవులు నిర్మించియున్నావు. దహన బలులనైనను పాపపరిహారార్థ బలులనైనను నీవు తెమ్మనలేదు.
- Hebrews 10:5–6 హెబ్రీయులకు 10:5–6కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించునప్పుడు ఈలాగు చెప్పుచున్నాడు. బలియు అర్పణయు నీవు కోరలేదుగానినాకొక శరీరమును అమర్చితివి. పూర్ణహోమములును పాపపరిహారార్థబలులును నీకిష్ఠమైనవికావు.
- 1 Samuel 15:22 1 సమూయేలు 15:22అందుకు సమూయేలుతాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుటవలన యెహోవా సంతోషించునట్లు, ఒకడు దహనబలులను బలులను అర్పిం చుటవలన ఆయన సంతోషించునా? ఆలోచించుము, బలులు అర్పించుటకంటె ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుటకంటె మాట వినుటయు శ్రేష్ఠము.
- Psalm 51:6 కీర్తనలు 51:6నీవు అంతరంగములో సత్యము కోరుచున్నావు ఆంతర్యమున నాకు జ్ఞానము తెలియజేయుదువు.
- Proverbs 21:27 సామెతలు 21:27భక్తిహీనులు అర్పించు బలులు హేయములు దురాలోచనతో అర్పించినయెడల అవి మరి హేయములు.
- Isaiah 1:11–15 యెషయా 1:11–15యెహోవా సెలవిచ్చిన మాట ఇదే విస్తారమైన మీ బలులు నాకేల? దహనబలులగు పాట్టేళ్లును బాగుగా మేపిన దూడల క్రొవ్వును నాకు వెక్కస మాయెను కోడెల రక్తమందైనను గొఱ్ఱెపిల్లల రక్తమందైనను మేక పోతుల రక్తమందైనను నాకిష్టములేదు. నా సన్నిధిని కనబడవలెనని మీరు వచ్చుచున్నారే నా ఆవరణములను త్రొక్కుటకు మిమ్మును రమ్మన్న వాడెవడు? మీ నైవేద్యము వ్యర్థము అది నాకు అసహ్యము పుట్టించు ధూపార్పణము దాని నికను తేకుడి అమావాస్యయు విశ్రాంతిదినమును సమాజకూట ప్రక టనమును జరుగుచున్నవి పాపులగుంపుకూడిన ఉత్సవసమాజమును నే నోర్చ జాలను. మీ అమావాస్య ఉత్సవములును నియామక కాలము లును నాకు హేయములు అవి నాకు బాధకరములు వాటిని సహింపలేక విసికియున్నాను. మీరు మీ చేతులు చాపునప్పుడు మిమ్మును చూడక నా కన్నులు కప్పుకొందును మీరు బహుగా ప్రార్థనచేసినను నేను వినను మీ చేతులు రక్తముతో నిండియున్నవి.
- Amos 5:21–23 ఆమోసు 5:21–23మీ పండుగ దినములను నేను అసహ్యించుకొనుచున్నాను; వాటిని నీచముగా ఎంచు చున్నాను; మీ వ్రత దినములలో కలుగు వాసనను నేను ఆఘ్రాణింపనొల్లను. నాకు దహనబలులను నైవేద్యములను మీరర్పించినను నేను వాటిని అంగీకరింపను; సమాధాన బలులుగా మీరర్పించు క్రొవ్విన పశువులను నేను చూడను. మీ పాటల ధ్వని నాయొద్దనుండి తొలగనియ్యుడి, మీ స్వరమండలముల నాదము వినుట నాకు మనస్సులేదు.
- Jeremiah 7:22–23 యిర్మీయా 7:22–23నేను ఐగుప్తు దేశములోనుండి మీ పితరులను రప్పించిన దినమున దహనబలులనుగూర్చిగాని బలులనుగూర్చిగాని నేను వారితో చెప్పలేదు, అట్టి వాటినిగూర్చి నేను ఏ ఆజ్ఞయు ఇయ్యలేదు, ఈ ఆజ్ఞను మాత్రమే నేను వానికిచ్చి తిని ఏదనగానా మాటలు మీరు అంగీకరించినయెడల నేను మీకు దేవుడనై యుందును మీరు నాకు జనులై యుందురు; మీకు క్షేమము కలుగునట్లు నేను మీకాజ్ఞా పించుచున్న మార్గమంతటియందు మీరు నడుచుకొనుడి.
- Proverbs 15:8 సామెతలు 15:8భక్తిహీనులు అర్పించు బలులు యెహోవాకు హేయములు యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము.
- Psalm 50:8 కీర్తనలు 50:8నీ బలుల విషయమై నేను నిన్ను గద్దించుటలేదు నీ దహనబలులు నిత్యము నాయెదుట కనబడుచున్నవి.
- Exodus 21:14 నిర్గమకాండము 21:14అయితే ఒకడు తన పొరుగువానిమీద దౌర్జన్యముగా వచ్చి కపటముగా చంప లేచినయెడల వాడు నా బలిపీఠము నాశ్రయించినను వాని లాగివేసి చంపవలెను.