Psalms · chapter 52 · verse 7
Psalm 52:7 in Telugu
ఇదిగో దేవుని తనకు దుర్గముగా నుంచుకొనక తన ధనసమృద్ధియందు నమ్మిక యుంచి తన చేటును బలపరచుకొనినవాడు వీడేయని చెప్పు కొనుచు వానిని చూచి నవ్వుదురు.
Idigo devuni tanaku durgamugaa nunchukonaka tana dhanasamruddhiyandu nammika yunchi tana chetunu balaparachukoninavaadu veedeyani cheppu konuchu vaanini choochi navvuduru.
Psalm 52:7 in English
- King James Version (KJV)
- Lo, [this is] the man [that] made not God his strength; but trusted in the abundance of his riches, [and] strengthened himself in his wickedness.
- World English Bible (WEB)
- “Behold, this is the man who didn’t make God his strength, but trusted in the abundance of his riches, and strengthened himself in his wickedness.”
- American Standard Version (ASV)
- Lo, this is the man that made not God his strength, But trusted in the abundance of his riches, And strengthened himself in his wickedness.
- Bible in Basic English (BBE)
- See, this is the man who did not make God his strength, but had faith in his goods and his property, and made himself strong in his wealth.
- Darby Translation (DBY)
- Behold the man that made not God his strength, but put confidence in the abundance of his riches, [and] strengthened himself in his avarice.
- Webster's Bible (WBS)
- Lo, [this is] the man [that] made not God his strength; but trusted in the abundance of his riches, [and] strengthened himself in his wickedness.
- Young's Literal Translation (YLT)
- 'Lo, the man who maketh not God his strong place, And trusteth in the abundance of his riches, He is strong in his mischiefs.'
Read in context
- 5కావున దేవుడు సదాకాలము నిన్ను అణగగొట్టును నిన్ను పట్టుకొని ఆయన నీ గుడారములోనుండి నిన్ను పెల్లగించును సజీవుల దేశములోనుండి నిన్ను నిర్మూలము చేయును. (సెలా. )
- 6నీతిమంతులు చూచి భయభక్తులు కలిగి
- 7ఇదిగో దేవుని తనకు దుర్గముగా నుంచుకొనక తన ధనసమృద్ధియందు నమ్మిక యుంచి తన చేటును బలపరచుకొనినవాడు వీడేయని చెప్పు కొనుచు వానిని చూచి నవ్వుదురు.
- 8నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టువలె నున్నాను నిత్యము దేవుని కృపయందు నమ్మిక యుంచుచున్నాను
- 9నీవు దాని నెరవేర్చితివి గనుక నేను నిత్యము నిన్ను స్తుతించెదను. నీ నామము నీ భక్తుల దృష్టికి ఉత్తమమైనది నేను దాని స్మరించి కనిపెట్టుచున్నాను.
Cross references
- Jeremiah 17:5 యిర్మీయా 17:5యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు. నరులను ఆశ్రయించి శరీరులను తనకాధారముగా చేసికొనుచు తన హృదయమును యెహోవామీదనుండి తొలగించుకొను వాడు శాపగ్రస్తుడు.
- Ecclesiastes 8:8 ప్రసంగి 8:8గాలి విసరకుండ చేయు టకు గాలిమీద ఎవరికిని అధికారములేదు; మరణదినము ఎవరికిని వశముకాదు. ఈ యుద్ధమందు విడుదల దొరకదు; దౌష్ట్యము దాని ననుసరించువారిని తప్పింపదు.
- Psalm 49:6–20 కీర్తనలు 49:6–20తమ ఆస్తియే ప్రాపకమని నమ్మి తమ ధన విస్తారతనుబట్టి పొగడుకొనువారికి నేనేల భయపడవలెను? ఎవడును ఏ విధముచేతనైనను తన సహోదరుని విమోచింపలేడు వాడు కుళ్లు చూడక నిత్యము బ్రతుకునట్లు వాని నిమిత్తము దేవుని సన్నిధిని ప్రాయశ్చిత్తము చేయగలవాడు ఎవడును లేడు వారి ప్రాణవిమోచన ధనము బహు గొప్పది అది ఎన్నటికిని తీరక అట్లుండవలసినదే. జ్ఞానులు చనిపోదురను సంగతి అతనికి కనబడకుండ పోదు మూర్ఖులును పశుప్రాయులును ఏకముగా నశింతురు. వారు తమ ఆస్తిని ఇతరులకు విడిచిపెట్టుదురు తమ యిండ్లు నిరంతరము నిలుచుననియు తమ నివాసములు తరతరములకు ఉండుననియు వారనుకొందురు తమ భూములకు తమ పేళ్లు పెట్టుదురు. ఘనతవహించినవాడైనను మనుష్యుడు నిలువజాలడు వాడు నశించుమృగములను పోలినవాడు. స్వాతిశయ పూర్ణులకును వారి నోటిమాటనుబట్టి వారి ననుసరించువారికిని ఇదే గతి. వారు పాతాళములో మందగా కూర్చబడుదురు మరణము వారికి కాపరియై యుండును ఉదయమున యథార్థవంతులు వారి నేలుదురు వారి స్వరూపములు నివాసములేనివై పాతాళములో క్షయమైపోవును. దేవుడు నన్ను చేర్చుకొనును పాతాళ బలములోనుండి ఆయన నా ప్రాణమును విమోచించును. (సెలా. ) ఒకడు ధనసంపన్నుడైనప్పుడు వాని యింటి ఘనత విస్తరించునప్పుడు భయపడకుము. వాడు చనిపోవునప్పుడు ఏమియు కొనిపోడు వాని ఘనత వానివెంట దిగదు. నీకు నీవే మేలు చేసికొంటివని మనుష్యులు నిన్ను స్తుతించినను తన జీవితకాలమున నొకడు తన్ను పొగడుకొనినను అతడు తన పితరుల తరమునకు చేరవలెను వారు మరి ఎన్నడును వెలుగు చూడరు. ఘనత నొంది యుండియు బుద్ధిహీనులైనవారు నశించు జంతువులను పోలియున్నారు.
- Psalm 73:18–20 కీర్తనలు 73:18–20నిశ్చయముగా నీవు వారిని కాలుజారు చోటనే ఉంచియున్నావు వారు నశించునట్లు వారిని పడవేయుచున్నావు క్షణమాత్రములోనే వారు పాడై పోవుదురు మహాభయముచేత వారు కడముట్ట నశించుదురు. మేలుకొనినవాడు తాను కన్న కల మరచిపోవునట్లు ప్రభువా, నీవు మేలుకొని వారి బ్రదుకును తృణీకరింతువు.
- John 19:5 యోహాను 19:5ఆ ముండ్ల కిరీటమును ఊదారంగు వస్త్రమును ధరించినవాడై, యేసు వెలుపలికి రాగా, పిలాతు - ఇదిగో ఈ మనుష్యుడు అని వారితో చెప్పెను.
- Job 31:24–25 యోబు 31:24–25సువర్ణము నాకు ఆధారమనుకొనినయెడలను నా ఆశ్రయము నీవేయని మేలిమి బంగారముతో నేను చెప్పినయెడలను నా ఆస్తి గొప్పదని గాని నా చేతికి విస్తారము సొత్తు దొరికెనని గాని నేను సంతోషించిన యెడలను
- 1 Timothy 6:17 1 తిమోతికి 6:17ఇహమందు ధనవంతులైనవారు గర్విష్టులు కాక, అస్థిరమైన ధనమునందు నమ్మికయుంచక, సుఖముగా అనుభ వించుటకు సమస్తమును మనకు ధారాళముగ దయ చేయు దేవునియందే నమ్మికయుంచుడని ఆజ్ఞాపించుము.
- Psalm 146:3–5 కీర్తనలు 146:3–5రాజులచేతనైనను నరులచేతనైనను రక్షణ కలుగదు వారిని నమ్ముకొనకుడి వారి ప్రాణము వెడలిపోవును వారు మంటిపాలగుదురు. వారి సంకల్పములు నాడే నశించును. ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో ఎవడు తన దేవుడైన యెహోవామీద ఆశపెట్టు కొనునో వాడు ధన్యుడు
- Psalm 62:9–10 కీర్తనలు 62:9–10అల్పులైనవారు వట్టి ఊపిరియై యున్నారు. ఘనులైనవారు మాయస్వరూపులు త్రాసులో వారందరు తేలిపోవుదురు వట్టి ఊపిరికన్న అలకనగా ఉన్నారు బలాత్కారమందు నమ్మికయుంచకుడి దోచుకొనుటచేత గర్వపడకుడి ధనము హెచ్చినను దానిని లక్ష్యపెట్టకుడి.
- Isaiah 14:16–17 యెషయా 14:16–17నిన్ను చూచువారు నిన్ను నిదానించి చూచుచు ఇట్లు తలపోయుదురు భూమిని కంపింపజేసి రాజ్యములను వణకించినవాడు ఇతడేనా? లోకమును అడవిగాచేసి దాని పట్టణములను పాడు చేసినవాడు ఇతడేనా? తాను చెరపట్టినవారిని తమ నివాసస్థలమునకు పో నియ్యనివాడు ఇతడేనా?
- Hosea 12:7–8 హోషేయ 12:7–8ఎఫ్రాయిమువారు కనానీయుల వర్తకులవంటివారై అన్యాయపు త్రాసును వాడుకచేసెదరు, బాధ పెట్టవలె నన్న కోరిక వారికి కలదు. నేను ఐశ్వర్యవంతుడనైతిని, నాకు బహు ఆస్తి దొరికెను, నా కష్టార్జితములో దేనిని బట్టియు శిక్షకు తగిన పాపము నాలోనున్నట్టు ఎవరును కనుపరచలేరని ఎఫ్రాయిము అనుకొనుచున్నాడు.
- Psalm 73:7–11 కీర్తనలు 73:7–11క్రొవ్వుచేత వారి కన్నులు మెరకలై యున్నవి వారి హృదయాలోచనలు బయటికి కానవచ్చు చున్నవి ఎగతాళి చేయుచు బలాత్కారముచేత జరుగు కీడును గూర్చి వారు మాటలాడుదురు. గర్వముగా మాటలాడుదురు. ఆకాశముతట్టు వారు ముఖము ఎత్తుదురు వారి నాలుక భూసంచారము చేయును. వారి జనము వారిపక్షము చేరును వారు జలపానము సమృద్ధిగా చేయుదురు. దేవుడు ఎట్లు తెలిసికొనును మహోన్నతునికి తెలివియున్నదా? అని వారను కొందురు.