Psalms · chapter 63 · verse 9
Psalm 63:9 in Telugu
నా ప్రాణమును నశింపజేయవలెనని వారు దాని వెదకుచున్నారు వారు భూమి క్రింది చోట్లకు దిగిపోవుదురు
Naa praanamunu nashimpajeyavalenani vaaru daani vedakuchunnaaru vaaru bhoomi krindi chotlaku digipovuduru
Psalm 63:9 in English
- King James Version (KJV)
- But those [that] seek my soul, to destroy [it], shall go into the lower parts of the earth.
- World English Bible (WEB)
- But those who seek my soul to destroy it shall go into the lower parts of the earth.
- American Standard Version (ASV)
- But those that seek my soul, to destroy it, Shall go into the lower parts of the earth.
- Bible in Basic English (BBE)
- But those whose desire is my soul's destruction will go down to the lower parts of the earth.
- Darby Translation (DBY)
- But those that seek my soul, to destroy [it], shall go into the lower parts of the earth;
- Webster's Bible (WBS)
- But those [that] seek my soul to destroy [it] , shall go into the lower parts of the earth.
- Young's Literal Translation (YLT)
- And they who for desolation seek my soul, Go in to the lower parts of the earth.
Read in context
- 7నీవు నాకు సహాయకుడవై యుంటివి నీ రెక్కల చాటున శరణుజొచ్చి ఉత్సాహధ్వని చేసెదను.
- 8నా ప్రాణము నిన్ను అంటి వెంబడించుచున్నది నీ కుడిచేయి నన్ను ఆదుకొనుచున్నది.
- 9నా ప్రాణమును నశింపజేయవలెనని వారు దాని వెదకుచున్నారు వారు భూమి క్రింది చోట్లకు దిగిపోవుదురు
- 10బలమైన ఖడ్గమునకు అప్పగింపబడుదురు నక్కలపాలగుదురు.
- 11రాజు దేవునిబట్టి సంతోషించును. ఆయనతోడని ప్రమాణము చేయు ప్రతివాడును అతిశయిల్లును అబద్ధములాడువారి నోరు మూయబడును.
Cross references
- Psalm 55:15 కీర్తనలు 55:15వారికి మరణము అకస్మాత్తుగా వచ్చును గాక సజీవులుగానే వారు పాతాళమునకు దిగిపోవుదురు గాక చెడుతనము వారి నివాసములలోను వారి అంతరంగము నందును ఉన్నది
- Psalm 40:14 కీర్తనలు 40:14నా ప్రాణము తీయుటకై యత్నించువారు సిగ్గుపడి బొత్తిగా భ్రమసియుందురు గాక నాకు కీడు చేయ గోరువారు వెనుకకు మళ్లింపబడి సిగ్గునొందుదురు గాక.
- Psalm 9:17 కీర్తనలు 9:17దుష్టులును దేవుని మరచు జనులందరునుపాతాళమునకు దిగిపోవుదురు.
- 1 Samuel 25:29 1 సమూయేలు 25:29నిన్ను హింసించుటకైనను నీ ప్రాణము తీయుటకైనను ఎవడైన ఉద్దేశించినయెడల, నా యేలిన వాడవగు నీ ప్రాణము నీ దేవుడైన యెహోవాయొద్ద నున్న జీవపుమూటలో కట్టబడును; ఒకడు వడిసెలతో రాయి విసరినట్లు ఆయన నీ శత్రువుల ప్రాణములను విసరివేయును.
- Psalm 86:13 కీర్తనలు 86:13ప్రభువా, నా దేవా, నాయెడల నీవు చూపిన కృప అధికమైనది పాతాళపు అగాధమునుండి నా ప్రాణమును తప్పించి యున్నావు.
- Isaiah 14:19 యెషయా 14:19నీవు సమాధి పొందక పారవేయబడిన కొమ్మవలె నున్నావు. ఖడ్గముచేత పొడువబడి చచ్చినవారి శవములతో కప్పబడినవాడవైతివి త్రొక్కబడిన పీనుగువలెనైతివి బిలముయొక్క రాళ్లయొద్దకు దిగుచున్నవానివలెనున్నావు
- Numbers 16:30–33 సంఖ్యాకాండము 16:30–33అయితే యెహోవా గొప్ప వింత పుట్టించుటవలన వారు ప్రాణములతో పాతాళములో కూలునట్లు భూమి తన నోరుతెరచి వారిని వారికి కలిగిన సమస్తమును మింగి వేసినయెడల వారు యెహోవాను అలక్ష్యము చేసిరని మీకు తెలియుననెను. అతడు ఆ మాటలన్నియు చెప్పి చాలించ గానే వారి క్రింది నేల నెరవిడిచెను. భూమి తన నోరు తెరచి వారిని వారి కుటుంబములను కోరహు సంబంధు లందరిని వారి సమస్త సంపాద్యమును మింగివేసెను. వారును వారి సంబంధులందరును ప్రాణముతో పాతాళ ములో కూలిరి; భూమి వారిని మింగివేసెను; వారు సమాజములో ఉండకుండ నశించిరి.
- Psalm 35:26 కీర్తనలు 35:26నా అపాయమునుచూచి సంతోషించువారందరు అవ మానము నొందుదురుగాక లజ్జపడుదురు గాక నా మీద అతిశయపడువారు సిగ్గుపడి అపకీర్తిపాలగుదురు గాక
- Job 40:13 యోబు 40:13కనబడకుండ వారినందరిని బూడిదెలో పాతిపెట్టుము సమాధిలో వారిని బంధింపుము.
- Isaiah 14:9 యెషయా 14:9నీవు ప్రవేశించుచుండగానే నిన్ను ఎదుర్కొనుటకై క్రింద పాతాళము నీ విషయమై కలవరపడుచున్నది. అది నిన్ను చూచి ప్రేతలను రేపుచున్నది భూమిలో పుట్టిన సమస్త శూరులను జనముల రాజుల నందరినివారి వారి సింహాసనములమీదనుండి లేపుచున్నది
- Isaiah 14:15 యెషయా 14:15నీవు పాతాళమునకు నరకములో ఒక మూలకు త్రోయబడితివే.
- Psalm 35:4 కీర్తనలు 35:4నా ప్రాణము తీయగోరువారికి సిగ్గును అవమానమును కలుగును గాక నాకు కీడుచేయ నాలోచించువారు వెనుకకు మళ్లింపబడి లజ్జపడుదురు గాక.