Psalms · chapter 35 · verse 26
Psalm 35:26 in Telugu
నా అపాయమునుచూచి సంతోషించువారందరు అవ మానము నొందుదురుగాక లజ్జపడుదురు గాక నా మీద అతిశయపడువారు సిగ్గుపడి అపకీర్తిపాలగుదురు గాక
Naa apaayamunuchoochi santoshinchuvaarandaru ava maanamu nondudurugaaka lajjapaduduru gaaka naa meeda atishayapaduvaaru siggupadi apakeertipaalaguduru gaaka
Psalm 35:26 in English
- King James Version (KJV)
- Let them be ashamed and brought to confusion together that rejoice at mine hurt: let them be clothed with shame and dishonour that magnify [themselves] against me.
- World English Bible (WEB)
- Let them be disappointed and confounded together who rejoice at my calamity. Let them be clothed with shame and dishonor who magnify themselves against me.
- American Standard Version (ASV)
- Let them be put to shame and confounded together that rejoice at my hurt: Let them be clothed with shame and dishonor that magnify themselves against me.
- Bible in Basic English (BBE)
- Let all those who take pleasure in my troubles be shamed and come to nothing: let those who are lifted up against me be covered with shame and have no honour.
- Darby Translation (DBY)
- Let them be ashamed and brought to confusion together that rejoice at mine adversity; let them be clothed with shame and dishonour that magnify themselves against me.
- Webster's Bible (WBS)
- Let them be ashamed and brought to confusion together that rejoice at my hurt: let them be clothed with shame and dishonor that magnify [themselves] against me.
- Young's Literal Translation (YLT)
- They are ashamed and confounded together, Who are rejoicing at my evil. They put on shame and confusion, Who are magnifying themselves against me.
Read in context
- 24యెహోవా నా దేవా, నీ నీతినిబట్టి నాకు న్యాయము తీర్చుము నన్ను బట్టి వారు సంతోషింపకుందురు గాక.
- 25ఆహా మా ఆశ తీరెను అని మనస్సులో వారు అనుకొనకపోదురు గాక వాని మింగివేసితిమని వారు చెప్పుకొనకయుందురు గాక
- 26నా అపాయమునుచూచి సంతోషించువారందరు అవ మానము నొందుదురుగాక లజ్జపడుదురు గాక నా మీద అతిశయపడువారు సిగ్గుపడి అపకీర్తిపాలగుదురు గాక
- 27నా నిర్దోషత్వమునుబట్టి ఆనందించువారు ఉత్సాహధ్వనిచేసి సంతోషించుదురు గాక తన సేవకుని క్షేమమును చూచి ఆనందించు యెహోవా ఘనపరచబడును గాక అని వారు నిత్యము పలుకుదురు.
- 28నా నాలుక నీ నీతినిగూర్చియు నీ కీర్తినిగూర్చియు దినమెల్ల సల్లాపములు చేయును.
Cross references
- Psalm 38:16 కీర్తనలు 38:16ప్రభువా నా దేవా, నీవే ఉత్తరమిచ్చెదవు నన్నుబట్టి వారు సంతోషించక పోదురుగాక.
- Job 8:22 యోబు 8:22అయితే ఇంకను ఆయన నీకు నోటినిండ నవ్వు కలుగ జేయును. ప్రహర్షముతో నీ పెదవులను నింపును.
- Job 19:5 యోబు 19:5మిమ్మను మీరు నామీద హెచ్చించుకొందురా? నా నేరము నామీద మీరు మోపుదురా?
- Psalm 132:18 కీర్తనలు 132:18అతని శత్రువులకు అవమానమును వస్త్రముగా ధరింప జేసెదను అతని కిరీటము అతనిమీదనే యుండి తేజరిల్లును అనెను.
- Isaiah 41:11 యెషయా 41:11నీమీద కోపపడినవారందరు సిగ్గుపడి విస్మయ మొందెదరు నీతో వాదించువారు మాయమై నశించిపోవుదురు
- Psalm 129:5 కీర్తనలు 129:5సీయోను పగవారందరు సిగ్గుపడి వెనుకకు త్రిప్పబడుదురు గాక.
- Psalm 109:28–29 కీర్తనలు 109:28–29వారు శపించుచున్నారు గాని నీవు దీవించుదువు వారు లేచి అవమానము పొందెదరు గాని నీ సేవకుడు సంతోషించును. నా విరోధులు అవమానము ధరించుకొందురు గాక తమ సిగ్గునే నిలువుటంగీవలె కప్పుకొందురు గాక
- Isaiah 65:13–15 యెషయా 65:13–15కావున ప్రభువగు యెహోవా ఈలాగు సెలవిచ్చు చున్నాడు ఆలకించుడి నా సేవకులు భోజనముచేయుదురు గాని మీరు ఆకలిగొనెదరు నా సేవకులు పానము చేసెదరు గాని మీరు దప్పిగొనెదరు. నా సేవకులు సంతోషించెదరు గాని మీరు సిగ్గుపడెదరు నా సేవకులు హృదయానందముచేత కేకలు వేసెదరుగాని మీరు చింతాక్రాంతులై యేడ్చెదరు మనోదుఃఖముచేత ప్రలాపించెదరు. నేనేర్పరచుకొనినవారికి మీ పేరు శాపవచనముగా చేసిపోయెదరు ప్రభువగు యెహోవా నిన్ను హతముచేయును ఆయన తన సేవకులకు వేరొక పేరు పెట్టును.
- Psalm 71:13 కీర్తనలు 71:13నా ప్రాణవిరోధులు సిగ్గుపడి నశించుదురు గాక. నాకు కీడుచేయ జూచువారు నిందపాలై మాన భంగము నొందుదురుగాక.
- Jeremiah 48:26 యిర్మీయా 48:26మోయాబు యెహోవాకు విరోధముగా తన్ను తాను గొప్పచేసికొనెను దాని మత్తిల్లజేయుడి మోయాబు తన వమనములో పొర్లుచున్నది అది అపహాస్యమునొందును.
- Psalm 35:4 కీర్తనలు 35:4నా ప్రాణము తీయగోరువారికి సిగ్గును అవమానమును కలుగును గాక నాకు కీడుచేయ నాలోచించువారు వెనుకకు మళ్లింపబడి లజ్జపడుదురు గాక.
- Psalm 55:12 కీర్తనలు 55:12నన్ను దూషించువాడు శత్రువు కాడు శత్రువైనయెడల నేను దాని సహింపవచ్చును నామీద మిట్టిపడువాడు నాయందు పగపట్టిన వాడు కాడు అట్టివాడైతే నేను దాగియుండవచ్చును.