Psalms · chapter 66 · verse 12
Psalm 66:12 in Telugu
నరులు మా నెత్తిమీద ఎక్కునట్లు చేసితివి మేము నిప్పులలోను నీళ్లలోను పడితివిు అయినను నీవు సమృధ్ధిగలచోటికి మమ్ము రప్పించి యున్నావు.
Narulu maa nettimeeda ekkunatlu chesitivi memu nippulalonu neellalonu paditiviు ayinanu neevu samrudhdhigalachotiki mammu rappinchi yunnaavu.
Psalm 66:12 in English
- King James Version (KJV)
- Thou hast caused men to ride over our heads; we went through fire and through water: but thou broughtest us out into a wealthy [place].
- World English Bible (WEB)
- You allowed men to ride over our heads. We went through fire and through water, but you brought us to the place of abundance.
- American Standard Version (ASV)
- Thou didst cause men to ride over our heads; We went through fire and through water; But thou broughtest us out into a wealthy place.
- Bible in Basic English (BBE)
- You let men go driving over our heads; we went through fire and through water; but you took us out into a wide place.
- Darby Translation (DBY)
- Thou didst cause men to ride over our head; we went through fire and through water: but thou hast brought us out into abundance.
- Webster's Bible (WBS)
- Thou hast caused men to ride over our heads; we went through fire and through water: but thou broughtest us out into a wealthy [place] .
- Young's Literal Translation (YLT)
- Thou hast caused man to ride at our head. We have entered into fire and into water, And Thou bringest us out to a watered place.
Read in context
- 10దేవా, నీవు మమ్మును పరిశీలించియున్నావు. వెండిని నిర్మలము చేయురీతిగా మమ్మును నిర్మలులను చేసియున్నావు.
- 11నీవు బందీగృహములో మమ్ము ఉంచితివి మా నడుములమీద గొప్పభారము పెట్టితివి.
- 12నరులు మా నెత్తిమీద ఎక్కునట్లు చేసితివి మేము నిప్పులలోను నీళ్లలోను పడితివిు అయినను నీవు సమృధ్ధిగలచోటికి మమ్ము రప్పించి యున్నావు.
- 13దహనబలులను తీసికొని నేను నీ మందిరములోనికి వచ్చెదను.
- 14నాకు శ్రమ కలిగినప్పుడు నా పెదవులు పలికిన మ్రొక్కుబడులను నా నోరు వచించిన మ్రొక్కుబడులను నేను నీకు చెల్లించెదను
Cross references
- Isaiah 43:1–2 యెషయా 43:1–2అయితే యాకోబూ, నిన్ను సృజించినవాడగు యెహోవా ఇశ్రాయేలూ, నిన్ను నిర్మించినవాడు ఈలాగు సెల విచ్చుచున్నాడు నేను నిన్ను విమోచించియున్నాను భయపడకుము, పేరుపెట్టి నిన్ను పిలిచియున్నాను నీవు నా సొత్తు. నీవు జలములలో బడి దాటునప్పుడు నేను నీకు తోడై యుందును నదులలో బడి వెళ్లునప్పుడు అవి నీమీద పొర్లిపారవు. నీవు అగ్నిమధ్యను నడచునప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు
- Isaiah 51:23 యెషయా 51:23నిన్ను బాధపరచువారిచేతిలో దాని పెట్టెదను మేము దాటిపోవునట్లు క్రిందికి వంగి సాగిలపడుమని వారు నీతో చెప్పగా నీవు నీ వీపును దాటువారికి దారిగాచేసి నేలకు దానిని వంచితివి గదా వారికే ఆ పాత్రను త్రాగనిచ్చెదను.
- James 5:11 యాకోబు 5:11సహించిన వారిని ధన్యులనుకొనుచున్నాము గదా? మీరు యోబు యొక్క సహనమునుగూర్చి వింటిరి. ఆయన ఎంతో జాలియు కనికరమును గలవాడని మీరు తెలిసికొని యున్నారు.
- Psalm 40:2–3 కీర్తనలు 40:2–3నాశనకరమైన గుంటలోనుండియు జిగటగల దొంగ ఊబిలో నుండియు. ఆయన నన్ను పైకెత్తెను నా పాదములు బండమీద నిలిపి నా అడుగులు స్థిర పరచెను. తనకు స్తోత్రరూపమగు క్రొత్తగీతమును మన దేవుడు నా నోట నుంచెను. అనేకులు దాని చూచి భయభక్తులుగలిగి యెహోవా యందు నమ్మికయుంచెదరు.
- 1 Thessalonians 3:3–4 1 థెస్సలొనీకయులకు 3:3–4మనము శ్రమను అనుభవింపవలసియున్నదని మీతో ముందుగా చెప్పితివిు గదా? ఆలాగే జరిగినది. ఇది మీకును తెలియును; అట్టి శ్రమలను అనుభవించుటకు మనము నియమింపబడిన వారమని మీరెరుగుదురు.
- Job 36:16 యోబు 36:16అంతియేకాక బాధలోనుండి ఆయన నిన్ను తప్పిం చును. ఇరుకులేని విశాలస్థలమునకు నిన్ను తోడుకొని పోవును నీ ఆహారమును క్రొవ్వుతో నింపును.
- Acts 14:22 అపొస్తలుల కార్యములు 14:22శిష్యుల మనస్సులను దృఢపరచివిశ్వాసమందు నిలుకడగా ఉండ వలెననియు, అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశింపవలెననియు వారిని హెచ్చరించిరి.
- Revelation 7:14–17 ప్రకటన 7:14–17అందుకు నేను అయ్యా, నీకే తెలియుననగా అతడు ఈలాగు నాతో చెప్పెను వీరు మహాశ్రమలనుండి వచ్చిన వారు; గొఱ్ఱెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉదుకుకొని వాటిని తెలుపుచేసికొనిరి. అందువలన వారు దేవుని సింహాసనము ఎదుట ఉండి రాత్రింబగళ్లు ఆయన ఆలయములో ఆయనను సేవించుచున్నారు. సింహాసనాసీనుడైన వాడు తానే తన గుడారము వారిమీద కప్పును; వారికి ఇకమీదట ఆకలియైనను దాహమైనను ఉండదు, సూర్యుని యెండయైనను ఏ వడగాలియైనను వారికి తగులదు, ఏలయనగా సింహాసన మధ్యమందుండు గొఱ్ఱెపిల్ల వారికి కాపరియై, జీవజలముల బుగ్గలయొద్దకు వారిని నడిపించును, దేవుడే వారి కన్నులనుండి ప్రతి బాష్పబిందువును తుడిచి వేయును.
- Psalm 107:35–37 కీర్తనలు 107:35–37అరణ్యమును నీటిమడుగుగాను ఎండిన నేలను నీటి ఊటల చోటుగాను ఆయన మార్చి వారు అచ్చట నివాసపురము ఏర్పరచుకొనునట్లును పొలములో విత్తనములు చల్లి ద్రాక్షతోటలు నాటి వాటివలన సస్యఫలసమృద్ధి పొందునట్లును ఆయన ఆకలికొనినవారిని అచ్చట కాపురముంచెను
- Isaiah 35:6–7 యెషయా 35:6–7కుంటివాడు దుప్పివలె గంతులువేయును మూగవాని నాలుక పాడును అరణ్యములో నీళ్లు ఉబుకును అడవిలో కాలువలు పారును ఎండమావులు మడుగులగును ఎండిన భూమిలో నీటిబుగ్గలు పుట్టును నక్కలు పండుకొనినవాటి ఉనికిపట్టులో జమ్మును తుంగగడ్డియు మేతయు పుట్టును.
- Psalm 129:1–3 కీర్తనలు 129:1–3ఇశ్రాయేలు ఇట్లనును నా యౌవనకాలము మొదలుకొని పగవారు నాకు అధిక బాధలు కలుగజేయుచు వచ్చిరి నా ¸యౌవనకాలము మొదలుకొని నాకు అధిక బాధలు కలుగజేయుచు వచ్చిరి. అయినను వారు నన్ను జయింపలేకపోయిరి. దున్నువారు నా వీపుమీద దున్నిరి వారు చాళ్లను పొడుగుగా చేసిరి.
- Psalm 33:19 కీర్తనలు 33:19యెహోవా దృష్టి ఆయనయందు భయభక్తులుగలవారి మీదను ఆయన కృపకొరకు కనిపెట్టువారిమీదను నిలుచు చున్నది.