Job · chapter 36 · verse 16
Job 36:16 in Telugu
అంతియేకాక బాధలోనుండి ఆయన నిన్ను తప్పిం చును. ఇరుకులేని విశాలస్థలమునకు నిన్ను తోడుకొని పోవును నీ ఆహారమును క్రొవ్వుతో నింపును.
Antiyekaaka baadhalonundi aayana ninnu tappim chunu. Irukuleni vishaalasthalamunaku ninnu todukoni povunu nee aahaaramunu krovvuto nimpunu.
Job 36:16 in English
- King James Version (KJV)
- Even so would he have removed thee out of the strait [into] a broad place, where [there is] no straitness; and that which should be set on thy table [should be] full of fatness.
- World English Bible (WEB)
- Yes, he would have allured you out of distress, into a wide place, where there is no restriction. That which is set on your table would be full of fatness.
- American Standard Version (ASV)
- Yea, he would have allured thee out of distress Into a broad place, where there is no straitness; And that which is set on thy table would be full of fatness.
- Bible in Basic English (BBE)
- ...
- Darby Translation (DBY)
- Even so would he have allured thee out of the jaws of distress into a broad place, where there is no straitness; and the supply of thy table [would be] full of fatness.
- Webster's Bible (WBS)
- Even so would he have removed thee out of the strait [into] a broad place, where [there is] no straitness; and that which should be set on thy table [would be] full of fatness.
- Young's Literal Translation (YLT)
- And also He moved thee from a strait place, [To] a broad place — no straitness under it, And the sitting beyond of thy table Hath been full of fatness.
Read in context
- 14కావున వారు ¸యౌవనమందే మృతినొందుదురు వారి బ్రదుకు పురుషగాముల బ్రదుకువంటిదగును.
- 15శ్రమపడువారిని వారికి కలిగిన శ్రమవలన ఆయన విడిపించును. బాధవలన వారిని విధేయులుగా చేయును.
- 16అంతియేకాక బాధలోనుండి ఆయన నిన్ను తప్పిం చును. ఇరుకులేని విశాలస్థలమునకు నిన్ను తోడుకొని పోవును నీ ఆహారమును క్రొవ్వుతో నింపును.
- 17దుష్టుల తీర్పు నీలో పూర్తిగా కనబడుచున్నది న్యాయవిమర్శయు తీర్పును కూడుకొనియున్నవి.
- 18నీకు క్రోధము పుట్టుచున్నది గనుక నీవు ఒక వేళ తిరస్కారము చేయుదువేమో జాగ్రత్తపడుము నీవు చేయవలసిన ప్రాయశ్చిత్తము గొప్పదని నీవు మోసపోయెదవేమో జాగ్రత్తపడుము.
Cross references
- Psalm 23:5 కీర్తనలు 23:5నా శత్రువుల యెదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు నూనెతో నా తల అంటియున్నావు నా గిన్నె నిండి పొర్లుచున్నది.
- Psalm 118:5 కీర్తనలు 118:5ఇరుకునందుండి నేను యెహోవాకు మొఱ్ఱపెట్టితిని విశాలస్థలమందు యెహోవా నాకు ఉత్తరమిచ్చెను
- Psalm 31:8 కీర్తనలు 31:8నీవు శత్రువులచేత నన్ను చెరపెట్టలేదు విశాలస్థలమున నా పాదములు నిలువబెట్టితివి.
- Psalm 63:5 కీర్తనలు 63:5క్రొవ్వు మెదడు నాకు దొరకినట్లుగా నా ప్రాణము తృప్తిపొందుచున్నది ఉత్సహించు పెదవులతో నా నోరు నిన్నుగూర్చి గానము చేయుచున్నది
- Psalm 18:19 కీర్తనలు 18:19విశాలమైన స్థలమునకు ఆయన నన్ను తోడుకొని వచ్చెను నేను ఆయనకు ఇష్టుడను గనుక ఆయన నన్నుతప్పించెను.
- Isaiah 25:6 యెషయా 25:6ఈ పర్వతముమీద సైన్యములకధిపతియగు యెహోవా సమస్తజనముల నిమిత్తము క్రొవ్వినవాటితో విందు చేయును మడ్డిమీదనున్న ద్రాక్షారసముతో విందుచేయును nమూలుగుగల క్రొవ్వినవాటితో విందుచేయును మడ్డిమీది నిర్మలమైన ద్రాక్షారసముతో విందుచేయును.
- Psalm 40:1–3 కీర్తనలు 40:1–3యెహోవాకొరకు నేను సహనముతో కనిపెట్టు కొంటిని ఆయన నాకు చెవియొగ్గి నా మొఱ్ఱ ఆలకించెను. నాశనకరమైన గుంటలోనుండియు జిగటగల దొంగ ఊబిలో నుండియు. ఆయన నన్ను పైకెత్తెను నా పాదములు బండమీద నిలిపి నా అడుగులు స్థిర పరచెను. తనకు స్తోత్రరూపమగు క్రొత్తగీతమును మన దేవుడు నా నోట నుంచెను. అనేకులు దాని చూచి భయభక్తులుగలిగి యెహోవా యందు నమ్మికయుంచెదరు.
- Psalm 36:8 కీర్తనలు 36:8నీ మందిరము యొక్క సమృద్ధివలన వారు సంతృప్తి నొందుచున్నారు. నీ ఆనందప్రవాహములోనిది నీవు వారికి త్రాగించు చున్నావు.
- Job 42:10–17 యోబు 42:10–17మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మరల అతనికి దయచేసెను. మరియు యోబునకు పూర్వము కలిగిన దానికంటె రెండంతలు అధికముగా యెహోవా అతనికి దయచేసెను. అప్పుడు అతని సహోదరులందరును అతని అక్క చెల్లెండ్రందరును అంతకుముందు అతనికి పరిచయులైన వారును వచ్చి, అతనితోకూడ అతని యింట అన్నపానములు పుచ్చుకొని, యెహోవా అతని మీదికి రప్పించిన సమస్తబాధనుగూర్చి యెంతలేసి దుఃఖములు పొందితివని అతనికొరకు దుఃఖించుచు అతని నోదార్చిరి. ఇదియు గాక ఒక్కొక్కడు ఒక వరహాను ఒక్కొక్కడు బంగారు ఉంగరమును అతనికి తెచ్చి ఇచ్చెను. యెహోవా యోబును మొదట ఆశీర్వదించినంతకంటె మరి అధికముగా ఆశీర్వదించెను. అతనికి పదునాలుగువేల గొఱ్ఱెలును ఆరువేల ఒంటెలును వెయ్యిజతల యెడ్లును వెయ్యి ఆడుగాడిదలును కలిగెను. మరియు అతనికి ఏడుగురు కుమారులును ముగ్గురు కుమార్తెలును కలిగిరి. అతడు పెద్దదానికి యెమీమా అనియు రెండవదానికి కెజీయా అనియు మూడవదానికి కెరెంహప్పుకు అనియు పేళ్లు పెట్టెను. ఆ దేశమందంతటను యోబు కుమార్తెలంత సౌందర్య వతులు కనబడలేదు. వారి తండ్రి వారి సహోదరులతో పాటు వారికి స్వాస్థ్యములనిచ్చెను. అటుతరువాత యోబు నూట నలువది సంవత్సరములు బ్రదికి, తన కుమారులను కుమారుల కుమారులను నాలుగు తరములవరకు చూచెను. పిమ్మట యోబు కాలము నిండిన వృద్ధుడై మృతినొందెను.
- Job 19:8 యోబు 19:8నేను దాటలేకుండ ఆయన నా మార్గమునకు కంచెవేసి యున్నాడు. నా త్రోవలను చీకటి చేసియున్నాడు
- Hosea 2:14 హోషేయ 2:14పిమ్మట దానిని ఆకర్షించి అరణ్యములోనికి కొనిపోయి అక్కడ దానితో ప్రేమగా మాటలాడుదును;
- Isaiah 55:2 యెషయా 55:2ఆహారము కానిదానికొరకు మీ రేల రూకలిచ్చెదరు? సంతుష్టి కలుగజేయనిదానికొరకు మీ కష్టార్జితమును ఎందుకు వ్యయపరచెదరు? నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థము భుజించుడి మీ ప్రాణముసారమైనదానియందు సుఖింపనియ్యుడి.