Psalms · chapter 68 · verse 21
Psalm 68:21 in Telugu
దేవుడు నిశ్చయముగా తన శత్రువుల తలలు పగుల గొట్టును. మానక దోషములు చేయువారి వెండ్రుకలుగల నడి నెత్తిని ఆయన పగులగొట్టును.
Devudu nishchayamugaa tana shatruvula talalu pagula gottunu. Maanaka doshamulu cheyuvaari vendrukalugala nadi nettini aayana pagulagottunu.
Psalm 68:21 in English
- King James Version (KJV)
- But God shall wound the head of his enemies, [and] the hairy scalp of such an one as goeth on still in his trespasses.
- World English Bible (WEB)
- But God will strike through the head of his enemies, the hairy scalp of such a one as still continues in his guiltiness.
- American Standard Version (ASV)
- But God will smite through the head of his enemies, The hairy scalp of such a one as goeth on still in his guiltiness.
- Bible in Basic English (BBE)
- The heads of the haters of God will be crushed; even the head of him who still goes on in his evil ways.
- Darby Translation (DBY)
- Verily God will smite the head of his enemies, the hairy scalp of him that goeth on still in his trespasses.
- Webster's Bible (WBS)
- But God will wound the head of his enemies, [and] the hairy scalp of such one as goeth on still in his trespasses.
- Young's Literal Translation (YLT)
- Only — God doth smite The head of His enemies, The hairy crown of a habitual walker in his guilt.
Read in context
- 19ప్రభువు స్తుతినొందును గాక అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు దేవుడే మాకు రక్షణకర్తయై యున్నాడు.
- 20దేవుడు మా పక్షమున పూర్ణరక్షణ కలుగజేయు దేవుడై యున్నాడు మరణము తప్పించుట ప్రభువైన యెహోవా వశము.
- 21దేవుడు నిశ్చయముగా తన శత్రువుల తలలు పగుల గొట్టును. మానక దోషములు చేయువారి వెండ్రుకలుగల నడి నెత్తిని ఆయన పగులగొట్టును.
- 22ప్రభువు సెలవిచ్చినదేమనగా నేను బాషానులోనుండి వారిని రప్పించెదను అగాధ సముద్రములలోనుండి వారిని రప్పించెదను.
- 23వారి రక్తములో నీవు నీ పాదము ముంచుదువు నీ శత్రువులు నీ కుక్కల నాలుకలకు భాగమగుదురు.
Cross references
- Habakkuk 3:13 హబక్కూకు 3:13నీ జనులను రక్షించుటకు నీవు బయలుదేరుచున్నావు నీవు నియమించిన అభిషిక్తుని రక్షించుటకు బయలు దేరుచున్నావు దుష్టుల కుటుంబికులలో ప్రధానుడొకడుండకుండ వారి తలను మెడను ఖండించి వారిని నిర్మూలము చేయుచున్నావు. (సెలా. )
- Luke 13:5 లూకా 13:5కారని మీతో చెప్పుచున్నాను; మీరు మారుమనస్సు పొందనియెడల మీరందరును ఆలాగే నశింతురు.
- Psalm 110:6 కీర్తనలు 110:6అన్యజనులకు ఆయన తీర్పు తీర్చును దేశము శవములతో నిండియుండును విశాలదేశము మీది ప్రధానుని ఆయన నలుగగొట్టును.
- Psalm 7:12 కీర్తనలు 7:12ఒకడును మళ్లనియెడల, ఆయన తన ఖడ్గమును పదును పెట్టునుతన విల్లు ఎక్కు పెట్టి దానిని సిద్ధపరచి యున్నాడు
- Revelation 2:14–16 ప్రకటన 2:14–16అయినను నేను నీమీద కొన్ని తప్పిదములు మోపవలసియున్నది. అవేవనగా, విగ్రహములకు బలియిచ్చిన వాటిని తినునట్లును, జారత్వము చేయునట్లును, ఇశ్రాయేలీయులకు ఉరి యొడ్డుమని బాలాకునకు నేర్పిన బిలాముబోధను అనుసరించువారు నీలో ఉన్నారు అటువలెనే నీకొలాయితుల బోధ ననుసరించు వారును నీలో ఉన్నారు. కావున మారుమనస్సు పొందుము; లేనియెడల నేను నీయొద్దకు త్వరగా వచ్చి నా నోటనుండి వచ్చు ఖడ్గముచేత వీరితో యుద్ధముచేసెదను.
- Ezekiel 18:27–30 యెహెజ్కేలు 18:27–30మరియు దుష్టుడు తాను చేయుచు వచ్చిన దుష్టత్వమునుండి మరలి నీతి న్యాయములను జరిగించిన యెడల తన ప్రాణము రక్షించుకొనును. అతడు ఆలోచించుకొని తాను చేయుచువచ్చిన అతిక్రమక్రియ లన్నిటిని చేయక మానెను గనుక అతడు మరణమునొందక అవశ్యముగా బ్రదుకును. అయితే ఇశ్రాయేలీయులు యెహోవా మార్గము న్యాయముకాదని చెప్పుచున్నారు. ఇశ్రాయేలీయులారా, నా మార్గము న్యాయమేగాని మీ మార్గము న్యాయము కాదు. కాబట్టి ఇశ్రాయేలీయులారా, యెవని ప్రవర్తననుబట్టి వానికి శిక్ష విధింతును. మనస్సు త్రిప్పుకొని మీ అక్రమములు మీకు శిక్షాకారణములు కాకుండునట్లు వాటినన్నిటిని విడిచిపెట్టుడి.
- Hebrews 12:25 హెబ్రీయులకు 12:25మీకు బుద్ధి చెప్పుచున్నవానిని నిరాకరింపకుండునట్లు చూచుకొనుడి. వారు భూమిమీదనుండి బుద్ధిచెప్పిన వానిని నిరాకరించినప్పుడు తప్పించుకొనకపోయినయెడల, పరలోకమునుండి బుద్ధిచెప్పుచున్న వానిని విసర్జించు మనము తప్పించుకొనకపోవుట మరి నిశ్చయముగదా.
- Proverbs 1:24–33 సామెతలు 1:24–33నేను పిలువగా మీరు వినకపోతిరి. నా చేయిచాపగా ఎవరును లక్ష్యపెట్టకపోయిరి నేను చెప్పిన బోధ యేమియు మీరు వినక త్రోసి వేసితిరి నేను గద్దింపగా లోబడకపోతిరి. కాబట్టి మీకు అపాయము కలుగునప్పుడు నేను నవ్వెదను మీకు భయము వచ్చునప్పుడు నేను అపహాస్యము చేసెదను భయము మీమీదికి తుపానువలె వచ్చునప్పుడు సుడిగాలి వచ్చునట్లు మీకు అపాయము కలుగు నప్పుడు మీకు కష్టమును దుఃఖమును ప్రాప్తించునప్పుడు నేను అపహాస్యము చేసెదను. అప్పుడు వారు నన్నుగూర్చి మొఱ్ఱపెట్టెదరుగాని నేను ప్రత్యుత్తరమియ్యకుందును నన్ను శ్రద్ధగా వెదకెదరు గాని వారికి నేను కనబడ కుందును. జ్ఞానము వారికి అసహ్యమాయెను యెహోవాయందు భయభక్తులు కలిగియుండుట వారి కిష్టము లేకపోయెను. నా ఆలోచన విననొల్లకపోయిరి నా గద్దింపును వారు కేవలము తృణీకరించిరి. కాబట్టి వారు తమ ప్రవర్తనకు తగిన ఫలము ననుభ వించెదరు తమకు వెక్కసమగువరకు తమ ఆలోచనలను అనుసరించెదరు జ్ఞానములేనివారు దేవుని విసర్జించి నాశనమగుదురు. బుద్ధిహీనులు క్షేమము కలిగినదని మైమరచి నిర్మూలమగుదురు. నా ఉపదేశము నంగీకరించువాడు సురక్షితముగా నివసించును వాడు కీడు వచ్చునన్న భయము లేక నెమ్మదిగా నుండును.
- Psalm 55:23 కీర్తనలు 55:23దేవా, నాశనకూపములో నీవు వారిని పడవేయుదువు రక్తాపరాధులును వంచకులును సగముకాలమైన బ్రదుకరు. నేనైతే నీయందు నమ్మికయుంచి యున్నాను.
- Hebrews 2:1–3 హెబ్రీయులకు 2:1–3కావున మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టు కొనిపోకుండునట్లు వాటియందు మరి విశేష జాగ్రత్త కలిగియుండవలెను. ఎందుకనగా దేవదూతల ద్వారా పలుకబడిన వాక్యము స్థిరపరచబడినందున, ప్రతి అతి క్రమమును అవిధేయతయు న్యాయమైన ప్రతిఫలము పొందియుండగా ఇంత గొప్ప రక్షణను మనము నిర్ల క్ష్యముచేసినయెడల ఏలాగు తప్పించుకొందుము? అట్టి రక్షణ ప్రభువు భోధించుటచేత ఆరంభమై,
- Psalm 68:18 కీర్తనలు 68:18నీవు ఆరోహణమైతివి పట్టబడినవారిని చెరపట్టుకొని పోతివి మనుష్యులచేత నీవు కానుకలు తీసికొనియున్నావు. యెహోవా అను దేవుడు అక్కడ నివసించునట్లు విశ్వాసఘాతకులచేత సహితము నీవు కానుకలు తీసికొనియున్నావు.
- Mark 12:4 మార్కు 12:4మరల అతడు మరియొక దాసుని వారియొద్దకు పంపగా, వారు వాని తల గాయముచేసి అవమానపరచిరి.