Psalms · chapter 68 · verse 23
Psalm 68:23 in Telugu
వారి రక్తములో నీవు నీ పాదము ముంచుదువు నీ శత్రువులు నీ కుక్కల నాలుకలకు భాగమగుదురు.
Vaari raktamulo neevu nee paadamu munchuduvu nee shatruvulu nee kukkala naalukalaku bhaagamaguduru.
Psalm 68:23 in English
- King James Version (KJV)
- That thy foot may be dipped in the blood of [thine] enemies, [and] the tongue of thy dogs in the same.
- World English Bible (WEB)
- that you may crush them, dipping your foot in blood, that the tongues of your dogs may have their portion from your enemies.”
- American Standard Version (ASV)
- That thou mayest crush [them], [dipping] thy foot in blood, That the tongue of thy dogs may have its portion from [thine] enemies.
- Bible in Basic English (BBE)
- So that your foot may be red with blood, and the tongues of your dogs with the same.
- Darby Translation (DBY)
- That thou mayest dip thy foot in blood: the tongue of thy dogs has its portion from enemies.
- Webster's Bible (WBS)
- That thy foot may be dipped in the blood of thy enemies, [and] the tongue of thy dogs in the same.
- Young's Literal Translation (YLT)
- So that thou dashest thy foot in blood, [In the blood of] enemies — the tongue of Thy dogs.'
Read in context
- 21దేవుడు నిశ్చయముగా తన శత్రువుల తలలు పగుల గొట్టును. మానక దోషములు చేయువారి వెండ్రుకలుగల నడి నెత్తిని ఆయన పగులగొట్టును.
- 22ప్రభువు సెలవిచ్చినదేమనగా నేను బాషానులోనుండి వారిని రప్పించెదను అగాధ సముద్రములలోనుండి వారిని రప్పించెదను.
- 23వారి రక్తములో నీవు నీ పాదము ముంచుదువు నీ శత్రువులు నీ కుక్కల నాలుకలకు భాగమగుదురు.
- 24దేవా, నీ గమనమును పరిశుద్ధ స్థలమునకు పోవు నా రాజగు దేవుని గమనమును వారు చూచి యున్నారు. చుట్టును కన్యకలు తంబురలు వాయించుచుండగా
- 25కీర్తనలు పాడువారు ముందర నడచిరి. తంతివాద్యములు వాయించువారు వెనుక వచ్చెదరు.
Cross references
- 1 Kings 21:19 1 రాజులు 21:19నీవు అతని చూచి యీలాగు ప్రకటిం చుముయెహోవా సెలవిచ్చునదేమనగాదీని స్వాధీన పరచుకొనవలెనని నీవు నాబోతును చంపితివిగదా. యెహోవా సెలవిచ్చునదేమనగాఏ స్థలమందు కుక్కలు నాబోతు రక్తమును నాకెనో ఆ స్థలమందే కుక్కలు నీ రక్తమును నిజముగా నాకునని అతనితో చెప్పెను.
- Psalm 58:10 కీర్తనలు 58:10ప్రతిదండన కలుగగా నీతిమంతులు చూచి సంతో షించుదురు భక్తిహీనుల రక్తములో వారు తమ పాదములను కడుగుకొందురు.
- 1 Kings 22:38 1 రాజులు 22:38వేశ్యలు స్నానము చేయుచుండగా ఒకడు ఆ రథమును షోమ్రోను కొలనులో కడిగినప్పుడు యెహోవా సెలవిచ్చిన మాటచొప్పున కుక్కలు వచ్చి అతని రక్తమును నాకెను.
- Revelation 19:17–21 ప్రకటన 19:17–21మరియు ఒక దూత సూర్యబింబములో నిలిచి యుండుట చూచితిని. అతడు గొప్ప శబ్దముతో ఆర్భటించి–రండి, రాజుల మాంసమును సహస్రాధిపతుల మాంసమును బలిష్ఠుల మాంసమును గుఱ్ఱముల మాంసమును వాటిమీద కూర్చుండువారి మాంసమును, స్వతంత్రులదేమి దాసులదేమి కొద్దివారిదేమి గొప్పవారిదేమి, అందరియొక్క మాంసమును తినుటకై దేవుని గొప్ప విందుకు కూడిరండని ఆకాశమధ్యమందు ఎగురుచున్న సమస్త పక్షులను పిలిచెను. మరియు ఆ గుఱ్ఱముమీద కూర్చున్నవానితోను ఆయన సేనతోను యుద్ధముచేయుటకై ఆ క్రూరమృగమును భూరాజులును వారి సేనలును కూడియుండగా చూచితిని. అప్పుడా మృగమును, దానియెదుట సూచక క్రియలు చేసి దాని ముద్రను వేయించుకొనిన వారిని ఆ మృగపు ప్రతిమకు నమస్కరించినవారిని మోసపరచిన ఆ అబద్ధప్రవక్తయు, పట్టబడి వారిద్దరు గంధకముతో మండు అగ్నిగుండములో ప్రాణముతోనే వేయబడిరి. కడమ వారు గుఱ్ఱముమీద కూర్చున్న వాని నోటనుండి వచ్చిన ఖడ్గముచేత వధింపబడిరి; వారి మాంసమును పక్షులన్నియు కడుపార తినెను.
- 2 Kings 9:33–37 2 రాజులు 9:33–37దీనిని క్రింద పడద్రోయుడని అతడు చెప్పగా వారు దానిని క్రిందికి పడద్రోసినందున దాని రక్తములో కొంత గోడమీదను గుఱ్ఱములమీదను చిందెను. మరియు గుఱ్ఱ ములచేత అతడు దానిని త్రొక్కించెను. అతడు లోపల ప్రవేశించి అన్నపానములు చేసిన తరువాతఆ శాపగ్రస్తు రాలు రాజకుమార్తె గనుక మీరు వెళ్లి దానిని కనుగొనిపాతిపెట్టుడని ఆజ్ఞ ఇయ్యగా వారు దానిని పాతిపెట్ట బోయిరి; అయితే దాని కపాలమును పాదములును అర చేతులును తప్ప మరి ఏమియు కనబడలేదు. వారు తిరిగి వచ్చి అతనితో ఆ సంగతి తెలియజెప్పగా అతడిట్లనెనుఇది యెజెబెలని యెవరును గుర్తుపట్టలేకుండ యెజ్రెయేలు భూభాగమందు కుక్కలు యెజెబెలు మాంసమును తినును. యెజెబెలుయొక్క కళేబరము యెజ్రెయేలు భూభాగ మందున్న పెంటవలె నుండును అని తన సేవకుడును తిష్బీ యుడునగు ఏలీయాద్వారా యెహోవా సెలవిచ్చిన మాట చొప్పున యిది జరిగెను.
- Isaiah 63:1–6 యెషయా 63:1–6రక్తవర్ణ వస్త్రములు ధరించి ఎదోమునుండి వచ్చుచున్న యితడెవడు? శోభితవస్త్రము ధరించినవాడై గంభీరముగా నడచుచు బొస్రానుండి బలాతిశయముతో వచ్చుచున్న యితడెవడు? నీతినిబట్టి మాటలాడుచున్న నేనే రక్షించుటకు బలాఢ్యుడనైన నేనే. నీ వస్త్రము ఎఱ్ఱగా ఉన్నదేమి? నీ బట్టలు ద్రాక్షగానుగను త్రొక్కుచుండువాని బట్టలవలె ఉన్న వేమి? ఒంటరిగా ద్రాక్షగానుగను త్రొక్కితిని, జనములలో ఎవడును నాతోకూడ ఉండలేదు కోపగించుకొని వారిని త్రొక్కితిని రౌద్రముచేత వారిని అణగద్రొక్కితిని వారి రక్తము నా వస్త్రములమీద చిందినది, నా బట్టలన్నియు డాగులే. పగతీర్చుకొను దినము నా మనస్సునకు వచ్చెను విముక్తి చేయదగిన సంవత్సరము వచ్చియుండెను నేను చూచి ఆశ్చర్యపడితిని సహాయము చేయువాడొకడును లేకపోయెను ఆదరించువాడెవడును లేకపోయెను కావున నా బాహువు నాకు సహాయము చేసెను నా ఉగ్రత నాకాధారమాయెను. కోపముగలిగి జనములను త్రొక్కి వేసితిని ఆగ్రహపడి వారిని మత్తిల్లజేసితిని వారి రక్తమును నేల పోసివేసితిని.