Psalms · chapter 78 · verse 59
Psalm 78:59 in Telugu
దేవుడు దీని చూచి ఆగ్రహించి ఇశ్రాయేలు నందు బహుగా అసహ్యించుకొనెను.
Devudu deeni choochi aagrahinchi ishraayelu nandu bahugaa asahyinchukonenu.
Psalm 78:59 in English
- King James Version (KJV)
- When God heard [this], he was wroth, and greatly abhorred Israel:
- World English Bible (WEB)
- When God heard this, he was angry, and greatly abhorred Israel,
- American Standard Version (ASV)
- When God heard [this], he was wroth, And greatly abhorred Israel;
- Bible in Basic English (BBE)
- When this came to God's ears he was very angry, and gave up Israel completely;
- Darby Translation (DBY)
- God heard, and was wroth, and greatly abhorred Israel:
- Webster's Bible (WBS)
- When God heard [this] , he was wroth, and greatly abhorred Israel:
- Young's Literal Translation (YLT)
- God hath heard, and sheweth Himself wroth. And kicketh exceedingly against Israel.
Read in context
- 57తమ పితరులవలె వారు వెనుకకు తిరిగి ద్రోహులైరి జౌకిచ్చు విల్లు పనికిరాకపోయినట్లు వారు తొలగి పోయిరి.
- 58వారు ఉన్నతస్థలములను కట్టి ఆయనకు కోపము పుట్టించిరి విగ్రహములను పెట్టుకొని ఆయనకు రోషము కలుగ జేసిరి.
- 59దేవుడు దీని చూచి ఆగ్రహించి ఇశ్రాయేలు నందు బహుగా అసహ్యించుకొనెను.
- 60షిలోహు మందిరమును తాను మనుష్యులలో సంస్థా పన చేసిన గుడారమును ఆయన విడిచిపెట్టెను.
- 61ఆయన తన బలమును చెరకును, తన భూషణమైనదానిని విరోధులచేతికిని అప్పగించెను.
Cross references
- Psalm 106:40 కీర్తనలు 106:40కావున యెహోవా కోపము ఆయన ప్రజలమీద రగులుకొనెను ఆయన తనస్వాస్థ్యమందు అసహ్యపడెను.
- Lamentations 2:7 విలాపవాక్యములు 2:7ప్రభువు తన బలిపీఠము విడనాడెను తన పరిశుద్ధస్థలమునందు అసహ్యించుకొనెను దాని నగరుల ప్రాకారములను శత్రువులచేతికి అప్పగించెను వారు నియామక కాలమున జనులు చేయునట్లు యెహోవా మందిరమందు ఉత్సాహధ్వని చేసిరి.
- Deuteronomy 32:19 ద్వితీయోపదేశకాండము 32:19యెహోవా దానిని చూచెను. తన కూమారులమీదను కుమార్తెలమీదను క్రోధపడెను వారిని అసహ్యించుకొనెను.
- Genesis 18:20–21 ఆదికాండము 18:20–21మరియు యెహోవా సొదొమ గొమొఱ్ఱాలను గూర్చిన మొర గొప్పది గనుకను వాటి పాపము బహు భారమైనది గనుకను నేను దిగిపోయి నాయొద్దకు వచ్చిన ఆ మొర చొప్పుననే వారు సంపూర్ణముగా చేసిరో లేదో చూచెదను; చేయనియెడల నేను తెలిసికొందుననెను.
- Leviticus 20:23 లేవీయకాండము 20:23నేను మీ యెదుటనుండి వెళ్లగొట్టుచున్న జనముల ఆచారములను బట్టి నడుచుకొనకూడదు. వారు అట్టి క్రియలన్నియు చేసిరి గనుక నేను వారియందు అసహ్య పడితిని.
- Psalm 11:4 కీర్తనలు 11:4యెహోవా తన పరిశుద్ధాలయములో ఉన్నాడు యెహోవా సింహాసనము ఆకాశమందున్నదిఆయన నరులను కన్నులార చూచుచున్నాడు తన కనుదృష్టిచేత ఆయన వారిని పరిశీలించుచున్నాడు.
- Psalm 14:2–5 కీర్తనలు 14:2–5వివేకము కలిగి దేవుని వెదకువారు కలరేమో అని యెహోవా ఆకాశమునుండి చూచి నరులను పరి శీలించెను వారందరు దారి తొలగి బొత్తిగా చెడియున్నారు మేలుచేయువారెవరును లేరు, ఒక్కడైనను లేడు యెహోవాకు ప్రార్థన చేయక ఆహారము మింగునట్లు నా ప్రజలను మింగుచుపాపము చేయువారికందరికిని తెలివి లేదా?పాపము చేయువారు బహుగా భయపడుదురు. ఎందుకనగా దేవుడు నీతిమంతుల సంతానము పక్ష మున నున్నాడు
- Leviticus 26:44 లేవీయకాండము 26:44అయితే వారు తమ శత్రువుల దేశములో ఉన్నప్పుడు వారిని నిరాకరింపను; నా నిబంధనను భంగపరచి వారిని కేవలము నశింపజేయునట్లు వారి యందు అసహ్యపడను. ఏలయనగా నేను వారి దేవుడనైన యెహోవాను.
- Zechariah 11:8 జెకర్యా 11:8ఒక నెలలోగా కాపరులలో ముగ్గురిని సంహరించితిని; ఏలయనగా నేను వారి విషయమై సహనము లేనివాడను కాగా వారు నా విషయమై ఆయాసపడిరి.