Psalms · chapter 89 · verse 15
Psalm 89:15 in Telugu
శృంగధ్వనుల నెరుగు ప్రజలు ధన్యులు యెహోవా, నీ ముఖకాంతిని చూచి వారు నడుచు కొనుచున్నారు.
Shrungadhvanula nerugu prajalu dhanyulu yehovaa, nee mukhakaantini choochi vaaru naduchu konuchunnaaru.
Psalm 89:15 in English
- King James Version (KJV)
- Blessed [is] the people that know the joyful sound: they shall walk, O LORD, in the light of thy countenance.
- World English Bible (WEB)
- Blessed are the people who learn to acclaim you. They walk in the light of your presence, LORD.
- American Standard Version (ASV)
- Blessed is the people that know the joyful sound: They walk, O Jehovah, in the light of thy countenance.
- Bible in Basic English (BBE)
- Happy are the people who have knowledge of the holy cry: the light of your face, O Lord, will be shining on their way.
- Darby Translation (DBY)
- Blessed is the people that know the shout of joy: they walk, O Jehovah, in the light of thy countenance.
- Webster's Bible (WBS)
- Blessed [are] the people that know the joyful sound: they shall walk, O LORD, in the light of thy countenance.
- Young's Literal Translation (YLT)
- O the happiness of the people knowing the shout, O Jehovah, in the light of Thy face they walk habitually.
Read in context
- 13పరాక్రమముగల బాహువు నీకు కలదు నీ హస్తము బలమైనది నీ దక్షిణహస్తము ఉన్నతమైనది.
- 14నీతిన్యాయములు నీ సింహాసనమునకు ఆధారములు కృపాసత్యములు నీ సన్నిధానవర్తులు.
- 15శృంగధ్వనుల నెరుగు ప్రజలు ధన్యులు యెహోవా, నీ ముఖకాంతిని చూచి వారు నడుచు కొనుచున్నారు.
- 16నీ నామమునుబట్టి వారు దినమెల్ల హర్షించుచున్నారు. నీ నీతిచేత హెచ్చింపబడుచున్నారు.
- 17వారి బలమునకు అతిశయాస్పదము నీవే నీదయచేతనే మా కొమ్ము హెచ్చింపబడుచున్నది.
Cross references
- Psalm 44:3 కీర్తనలు 44:3వారు తమ ఖడ్గముచేత దేశమును స్వాధీనపరచు కొనలేదు వారి బాహువు వారికి జయమియ్యలేదు నీవు వారిని కటాక్షించితివి గనుక నీ దక్షిణహస్తమే నీ బాహువే నీ ముఖకాంతియే వారికి విజయము కలుగజేసెను.
- Psalm 4:6 కీర్తనలు 4:6మాకు మేలు చూపువాడెవడని పలుకువారనేకులు. యెహోవా, నీ సన్నిధికాంతి మామీద ప్రకాశింపజేయుము.
- Isaiah 2:5 యెషయా 2:5యాకోబు వంశస్థులారా, రండి మనము యెహోవా వెలుగులో నడుచుకొందము.
- Job 29:3 యోబు 29:3అప్పుడు ఆయన దీపము నా తలకుపైగా ప్రకాశించెను ఆయన తేజమువలన నేను చీకటిలో తిరుగులాడు చుంటిని.
- Acts 2:28 అపొస్తలుల కార్యములు 2:28నాకు జీవమార్గములు తెలిపితివి నీ దర్శన మనుగ్రహించి నన్ను ఉల్లాసముతో నింపెదవు
- Isaiah 52:7–8 యెషయా 52:7–8సువార్త ప్రకటించుచు సమాధానము చాటించుచు సువర్తమానము ప్రకటించుచు రక్షణ సమాచారము ప్రచురించువాని పాదములు, నీ దేవుడు ఏలుచున్నాడని సీయోనుతో చెప్పుచున్న వాని పాదములు పర్వతములమీద ఎంతో సుందరములై యున్నవి. ఆలకించుము నీ కావలివారు పలుకుచున్నారు కూడుకొని బిగ్గరగా పాడుచున్నారు యెహోవా సీయోనును మరల రప్పించగా వారు కన్నులార చూచుచున్నారు.
- Psalm 100:1 కీర్తనలు 100:1సమస్త్త దేశములారా, యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి.
- Numbers 6:26 సంఖ్యాకాండము 6:26యెహోవా నీమీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయును గాక.
- Numbers 10:10 సంఖ్యాకాండము 10:10మరియు ఉత్సవ దినమందును నియామక కాలములయందును నెలల ఆరంభ ములయందును మీరు దహనబలులనుగాని సమాధానబలు లనుగాని అర్పించునప్పుడు ఆ బూరలు ఊదవలెను అప్పుడు అవి మీ దేవుని సన్నిధిని మీకు జ్ఞాపకార్థముగా ఉండును మీ దేవుడైన యెహోవాను నేనే.
- Leviticus 25:9 లేవీయకాండము 25:9ఏడవ నెల పది యౌవనాడు మీ స్వదేశమంతట శృంగనాదము చేయవలెను. ప్రాయశ్చి త్తార్థదినమున మీ దేశమంతట ఆ శృంగనాదము చేయవలెను.
- John 14:21–23 యోహాను 14:21–23నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొనువాడే నన్ను ప్రేమించువాడు; నన్ను ప్రేమించువాడు నా తండ్రివలన ప్రేమింపబడును; నేనును వానిని ప్రేమించి, వానికి నన్ను కనబరచుకొందునని చెప్పెను. ఇస్కరియోతు కాని యూదా ప్రభువా, నీవు లోకమునకు కాక మాకు మాత్రమే నిన్ను నీవు కనబరచుకొనుటకేమి సంభవించెనని అడుగగా యేసు ఒకడు నన్ను ప్రేమించిన యెడల వాడు నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును, మేము వాని యొద్దకువచ్చి వానియొద్ద నివాసము చేతుము.
- Numbers 23:21 సంఖ్యాకాండము 23:21ఆయన యాకోబులో ఏ దోషమును కనుగొనలేదు ఇశ్రాయేలులో ఏ వంకరతనమును చూడలేదు అతని దేవుడైన యెహోవా అతనికి తోడైయున్నాడు.