Psalms · chapter 97 · verse 7
Psalm 97:7 in Telugu
వ్యర్థ విగ్రహములనుబట్టి అతిశయపడుచు చెక్కిన ప్రతిమలను పూజించువారందరు సిగ్గుపడుదురు సకలదేవతలు ఆయనకు నమస్కారము చేయును.
Vyartha vigrahamulanubatti atishayapaduchu chekkina pratimalanu poojinchuvaarandaru siggupaduduru sakaladevatalu aayanaku namaskaaramu cheyunu.
Psalm 97:7 in English
- King James Version (KJV)
- Confounded be all they that serve graven images, that boast themselves of idols: worship him, all [ye] gods.
- World English Bible (WEB)
- Let all them be shamed who serve engraved images, who boast in their idols. Worship him, all you gods!
- American Standard Version (ASV)
- Let all them be put to shame that serve graven images, That boast themselves of idols: Worship him, all ye gods.
- Bible in Basic English (BBE)
- Shamed be all those who give worship to images, and take pride in false gods; give him worship, all you gods.
- Darby Translation (DBY)
- Ashamed be all they that serve graven images, that boast themselves of idols. Worship him, all ye gods.
- Webster's Bible (WBS)
- Confounded be all they that serve graven images, that boast themselves of idols; worship him, all [ye] gods.
- Young's Literal Translation (YLT)
- Ashamed are all servants of a graven image, Those boasting themselves in idols, Bow yourselves to him, all ye gods.
Read in context
- 5యెహోవా సన్నిధిని సర్వలోకనాధుని సన్నిధిని పర్వతములు మైనమువలె కరగుచున్నవి.
- 6ఆకాశము ఆయన నీతిని తెలియజేయుచున్నది సమస్త జనములకు ఆయన మహిమ కనబడుచున్నది
- 7వ్యర్థ విగ్రహములనుబట్టి అతిశయపడుచు చెక్కిన ప్రతిమలను పూజించువారందరు సిగ్గుపడుదురు సకలదేవతలు ఆయనకు నమస్కారము చేయును.
- 8యెహోవా, సీయోను నివాసులు ఆ సంగతి విని నీ న్యాయవిధులనుబట్టి సంతోషించుచున్నారు యూదా కుమార్తెలు ఆనందించుచున్నారు.
- 9ఏలయనగా యెహోవా, భూలోకమంతటికి పైగా నీవు మహోన్నతుడవై యున్నావు సమస్త దేవతలకు పైగా నీవు అత్యధికమైన ఔన్న త్యము పొందియున్నావు.
Cross references
- Jeremiah 10:14 యిర్మీయా 10:14తెలివిలేని ప్రతి మనుష్యుడు పశుప్రాయుడు, పోతపోయు ప్రతివాడును తాను చేసిన విగ్రహమును బట్టి అవమానము నొందు చున్నాడు; అతడు పోతపోసినది మాయారూపము, అందులో ప్రాణమేమియు లేదు.
- Hebrews 1:6 హెబ్రీయులకు 1:6మరియు ఆయన భూలోకమునకు ఆదిసంభూతుని మరల రప్పించినప్పుడు దేవుని దూతలందరు ఆయనకు నమస్కారము చేయవలెనని చెప్పుచున్నాడు.
- Isaiah 42:17 యెషయా 42:17చెక్కినవిగ్రహములను ఆశ్రయించి పోతవిగ్రహ ములను చూచి మీరే మాకు దేవతలని చెప్పువారు వెనుకకు తొలగి కేవలము సిగ్గుపడుచున్నారు.
- Leviticus 26:1 లేవీయకాండము 26:1మీరు విగ్రహములను చేసికొనకూడదు. చెక్కిన ప్రతిమనుగాని బొమ్మనుగాని నిలువపెట్టకూడదు. మీరు సాగిలపడుటకు ఏదొక రూపముగా చెక్కబడిన రాతిని మీ దేశములో నిలుపకూడదు. నేను మీ దేవుడనైన యెహోవాను.
- Revelation 5:11–14 ప్రకటన 5:11–14మరియు నేను చూడగా సింహాసనమును జీవులను, పెద్దలను ఆవరించి యున్న అనేక దూతల స్వరము వినబడెను, వారి లెక్క కోట్లకొలదిగా ఉండెను. వారువధింపబడిన గొఱ్ఱెపిల్ల, శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రమును పొందనర్హుడని గొప్ప స్వరముతో చెప్పుచుండిరి. అంతట పరలోకమందును భూలోకమందును భూమి క్రిందను సముద్రములోను ఉన్న ప్రతి సృష్టము, అనగా వాటిలోనున్న సర్వమును - సింహాసనాసీనుడై యున్నవానికిని గొఱ్ఱపిల్లకును స్తోత్రమును ఘనతయు మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాకని చెప్పుట వింటిని. ఆ నాలుగు జీవులు ఆమేన్ అని చెప్పగా ఆ పెద్దలు సాగిలపడి నమస్కారము చేసిరి.
- Exodus 20:4 నిర్గమకాండము 20:4పైన ఆకాశమందేగాని క్రింది భూమియందేగాని భూమిక్రింద నీళ్లయందేగాని యుండు దేని రూపము నయినను విగ్రహమునయినను నీవు చేసికొనకూడదు; వాటికి సాగిలపడకూడదు వాటిని పూజింపకూడదు.
- Isaiah 44:9–11 యెషయా 44:9–11విగ్రహమును నిర్మించువారందరు మాయవంటివారు వారికిష్టమైన విగ్రహములు నిష్ప్రయోజనములు తామే అందుకు సాక్షులు, వారు గ్రహించువారు కారు ఎరుగువారు కారు గనుక వారు సిగ్గుపడరు. ఎందుకును పనికిరాని విగ్రహమును పోతపోసి దాని నొక దేవునిగా నిరూపించువాడెవడు? ఇదిగో దాని పూజించువారందరు సిగ్గుపడుదురు ఆ శిల్పకారులు నరమాత్రులేగదా? వారందరు పోగు చేయబడి నిలువబడవలెను నిశ్చయముగా వారు భయపడి సిగ్గుపడుదురు.
- Isaiah 41:29 యెషయా 41:29వారందరు మాయాస్వరూపులు వారి క్రియలు మాయ వారి పోతవిగ్రహములు శూన్యములు అవి వట్టిగాలియై యున్నవి.
- Deuteronomy 5:8 ద్వితీయోపదేశకాండము 5:8పైనున్న ఆకాశమందే గాని, క్రిందనున్న భూమి యందే గాని భూమి క్రిందనున్న నీళ్లయందే గాని యుండు దేని పోలికనైన విగ్రహమును చేసికొనకూడదు.
- Exodus 25:20 నిర్గమకాండము 25:20ఆ కెరూబులు పైకి విప్పిన రెక్కలుగలవై కరుణాపీఠమును తమ రెక్కలతో కప్పుచుండగా వాటి ముఖములు ఒండొంటికి ఎదురుగా నుండవలెను. ఆ కెరూబుల ముఖములు కరుణా పీఠముతట్టు నుండవలెను. నీవు ఆ కరుణా పీఠమును ఎత్తి ఆ మందసముమీద నుంచ వలెను.
- Deuteronomy 27:15 ద్వితీయోపదేశకాండము 27:15మలి చిన విగ్రహమునేగాని పోతవిగ్రహమునేగాని చేసి చాటున నుంచువాడు శాపగ్రస్తుడని యెలుగెత్తి ఇశ్రా యేలీయులందరితోను చెప్పగా ఆమేన్ అనవలెను.
- Isaiah 37:18–19 యెషయా 37:18–19యెహోవా, అష్షూరు రాజులు ఆ జనములను వారి దేశములను పాడు చేసి వారి దేవతలను అగ్నిలో వేసినది నిజమే. ఆ రాజ్యముల దేవతలు నిజమైన దేవుడు కాక మనుష్యులచేత చేయబడిన కఱ్ఱలు రాళ్లు గాని దేవతలు కావు గనుక వారు వారిని నిర్మూలముచేసిరి.