Revelation · chapter 2 · verse 21
Revelation 2:21 in Telugu
మారుమనస్సు పొందుటకు నేను దానికి సమయమిచ్చితినిగాని అది తన జారత్వము విడిచిపెట్టి మారుమనస్సు పొందనొల్లదు.
Maarumanassu pondutaku nenu daaniki samayamichchitinigaani adi tana jaaratvamu vidichipetti maarumanassu pondanolladu.
Revelation 2:21 in English
- King James Version (KJV)
- And I gave her space to repent of her fornication; and she repented not.
- World English Bible (WEB)
- I gave her time to repent, but she refuses to repent of her sexual immorality.
- American Standard Version (ASV)
- And I gave her time that she should repent; and she willeth not to repent of her fornication.
- Bible in Basic English (BBE)
- And I gave her time for a change of heart, but she has no mind to give up her unclean ways.
- Darby Translation (DBY)
- And I gave her time that she should repent, and she will not repent of her fornication.
- Webster's Bible (WBS)
- And I gave her time to repent of her lewdness, and she repented not.
- Young's Literal Translation (YLT)
- and I did give to her a time that she might reform from her whoredom, and she did not reform;
Read in context
- 19నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్యను, నీ సహనమును నేనెరుగుదును; నీ మొదటి క్రియల కన్న నీ కడపటి క్రియలు మరియెక్కువైనవని యెరుగుదును.
- 20అయినను నీమీద తప్పు ఒకటి నేను మోపవలసి యున్నది; ఏమనగా, తాను ప్రవక్త్రినని చెప్పుకొనుచున్న యెజెబెలను స్త్రీని నీ వుండనిచ్చుచున్నావు. జారత్వము చేయుటకును, విగ్రహములకు బలియిచ్చిన వాటిని తినుటకును అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరచుచున్నది.
- 21మారుమనస్సు పొందుటకు నేను దానికి సమయమిచ్చితినిగాని అది తన జారత్వము విడిచిపెట్టి మారుమనస్సు పొందనొల్లదు.
- 22ఇదిగో నేను దానిని మంచము పట్టించి దానితోకూడ వ్యభిచరించు వారు దాని క్రియలవిషయమై మారుమనస్సు పొందితేనే గాని వారిని బహు శ్రమలపాలు చేతును,
- 23దాని పిల్లలను నిశ్చయముగా చంపెదను. అందువలన అంతరింద్రియములను హృదయములను పరీక్షించువాడను నేనే అని సంఘము లన్నియు తెలిసికొనును. మరియు మీలో ప్రతివానికి వాని వాని క్రియల చొప్పున ప్రతిఫలము ఇచ్చెదను.
Cross references
- 2 Peter 3:9 2 పేతురు 3:9కొందరు ఆలస్యమని యెంచుకొనునట్లు ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడు గాని యెవడును నశింపవలెనని యిచ్ఛయింపక, అందరు మారుమనస్సు పొందవలెనని కోరుచు, మీ యెడల ధీర్ఘశాంతముగలవాడై యున్నాడు.
- Romans 2:4–5 రోమీయులకు 2:4–5లేదా, దేవుని అనుగ్రహము మారు మనస్సు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని యెరుగక, ఆయన అనుగ్రహైశ్వర్యమును సహనమును దీర్ఘ శాంతమును తృణీకరించుదువా? నీ కాఠిన్యమును, మార్పు పొందని నీ హృదయమును అనుసరించి, ఉగ్రత దినమందు, అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలు పరచబడు దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చు కొనుచున్నావు.
- Revelation 9:20–21 ప్రకటన 9:20–21ఈ దెబ్బలచేత చావక మిగిలిన జనులు, దయ్యములను, చూడను వినను నడువను శక్తిలేనివై, బంగారు వెండి కంచు రాయి కర్రలతో చేయబడిన తమ హస్తకృతములైన విగ్రహములను పూజింపకుండ విడిచిపెట్టునట్లు మారుమనస్సు పొందలేదు. మరియు తాము చేయు చున్న నరహత్యలును మాయమంత్రములును జారచోరత్వములును చేయకుండునట్లు వారు మారుమనస్సు పొందిన వారు కారు.
- Revelation 16:11 ప్రకటన 16:11తమకు కలిగిన వేదనలను బట్టియు పుండ్లను బట్టియు పరలోకమందున్న దేవుని దూషించిరి గాని తమ క్రియలను మాని మారు మనస్సు పొందినవారు కారు.
- Revelation 16:9 ప్రకటన 16:9కాగా మనుష్యులు తీవ్రమైన వేడిమితో కాలిపోయి, యీ తెగుళ్లమీద అధికారముగల దేవుని నామమును దూషించిరి గాని, ఆయనను మహిమ పరచునట్లు వారు మారుమనస్సు పొందినవారుకారు.
- 2 Peter 3:15 2 పేతురు 3:15మరియు మన ప్రభువుయొక్క దీర్ఘశాంతము రక్షణార్థమైనదని యెంచుకొనుడి. ఆలాగు మన ప్రియ సహోదరుడైన పౌలుకూడ తనకు అనుగ్రహింపబడిన జ్ఞానము చొప్పున మీకు వ్రాసి యున్నాడు.
- 1 Peter 3:20 1 పేతురు 3:20దేవుని దీర్ఘశాంతము ఇంక కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోవహు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా, అవిధేయులైనవారియొద్దకు, అనగా చెరలో ఉన్న ఆత్మలయొద్దకు, ఆయన ఆత్మరూపి గానే వెళ్లి వారికి ప్రకటించెను. ఆ ఓడలో కొందరు, అనగా ఎనిమిది మంది నీటిద్వారా రక్షణపొందిరి.
- Jeremiah 8:4–6 యిర్మీయా 8:4–6మరియు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడని వారితో చెప్పుముమనుష్యులు పడి తిరిగి లేవకుందురా? తొలగిపోయిన తరువాత మనుష్యులు తిరిగిరారా? యెరూషలేము ప్రజలు ఏల విశ్వాసఘాతకులై నిత్యము ద్రోహము చేయుచున్నారు? వారు మోసమును ఆశ్రయము చేసికొని తిరిగిరామని యేల చెప్పుచున్నారు? నేను చెవియొగ్గి వారి మాటలు వినియున్నాను, పనికిమాలిన మాటలు వారాడుకొనుచున్నారు నేనేమి చేసితినని చెప్పితన చెడుతనమునుగూర్చి పశ్చాత్తాపపడువాడొకడును లేక పోయెను? యుద్ధమునకు చొరబడు గుఱ్ఱమువలె ప్రతి వాడును తనకిష్టమైన మార్గమునకు తిరుగుచున్నాడు.
- Romans 9:22 రోమీయులకు 9:22ఆలాగు దేవుడు తన ఉగ్రతను అగపరచుటకును, తన ప్రభావమును చూపుటకును, ఇచ్చయించినవాడై, నాశనమునకు సిద్ధపడి ఉగ్రతాపాత్రమైన ఘటములను ఆయన బహు ధీర్ఘశాంతముతో సహించిన నేమి?