Revelation · chapter 20 · verse 5
Revelation 20:5 in Telugu
ఆ వెయ్యి సంవత్సరములు గడచువరకు కడమ మృతులు బ్రదుక లేదు; ఇదియే మొదటి పునరుత్థానము.
Aa veyyi sanvatsaramulu gadachuvaraku kadama mrutulu braduka ledu; idiye modati punarutthaanamu.
Revelation 20:5 in English
- King James Version (KJV)
- But the rest of the dead lived not again until the thousand years were finished. This [is] the first resurrection.
- World English Bible (WEB)
- The rest of the dead didn’t live until the thousand years were finished. This is the first resurrection.
- American Standard Version (ASV)
- The rest of the dead lived not until the thousand years should be finished. This is the first resurrection.
- Bible in Basic English (BBE)
- The rest of the dead did not come to life again till the thousand years were ended. This is the first coming back from the dead.
- Darby Translation (DBY)
- the rest of the dead did not live till the thousand years had been completed. This [is] the first resurrection.
- Webster's Bible (WBS)
- But the rest of the dead lived not again until the thousand years were finished. This [is] the first resurrection.
- Young's Literal Translation (YLT)
- and the rest of the dead did not live again till the thousand years may be finished; this [is] the first rising again.
Read in context
- 3ఆ వెయ్యి సంవత్సరములు గడచువరకు ఇక జనములను మోసపరచకుండునట్లు అగాధమును మూసి దానికి ముద్ర వేసెను; అటుపిమ్మట వాడు కొంచెము కాలము విడిచి పెట్టబడవలెను.
- 4అంతట సింహాసనములను చూచితిని; వాటిమీద ఆసీనులై యుండువారికి విమర్శచేయుటకు అధికారము ఇయ్యబడెను. మరియు క్రూరమృగమునకైనను దాని ప్రతిమకైనను నమస్కారముచేయ తమ నొసళ్లయందు గాని చేతులయందు గాని దాని ముద్రవేయించుకొనని వారిని, యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును దేవుని వాక్యము నిమిత్తమును శిరచ్ఛేదనము చేయబడిన వారి ఆత్మలను చూచితిని. వారు బ్రదికినవారై, వెయ్యి సంవత్సరములు క్రీస్తుతోకూడ రాజ్యము చేసిరి
- 5ఆ వెయ్యి సంవత్సరములు గడచువరకు కడమ మృతులు బ్రదుక లేదు; ఇదియే మొదటి పునరుత్థానము.
- 6ఈ మొదటి పునరుత్థానములో పాలుగలవారు ధన్యులును పరిశుద్ధులునై యుందురు. ఇట్టివారిమీద రెండవ మరణమునకు అధికారములేదు; వీరు దేవునికిని క్రీస్తుకును యాజకులై క్రీస్తుతోకూడ వెయ్యి సంవత్సరములు రాజ్యము చేయుదురు.
- 7వెయ్యి సంవత్సరములు గడచిన తరువాత సాతాను తానున్న చెరలోనుండి విడిపింపబడును.
Cross references
- Philippians 3:11 ఫిలిప్పీయులకు 3:11ఆయన శ్రమలలో పాలివాడనగుట యెట్టిదో యెరుగు నిమిత్తమును, సమస్తమును నష్టపరచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను.
- Revelation 11:15 ప్రకటన 11:15ఏడవ దూత బూర ఊదినప్పుడు పరలోకములో గొప్ప శబ్దములు పుట్టెను. ఆ శబ్దములు ఈ లోక రాజ్యము మన ప్రభువు రాజ్యమును ఆయన క్రీస్తు రాజ్యము నాయెను; ఆయన యుగయుగముల వరకు ఏలు ననెను.
- Ezekiel 37:2–14 యెహెజ్కేలు 37:2–14యెముకలనేకములు ఆ లోయలో కనబడెను, అవి కేవలము ఎండిపోయినవి. ఆయన నరపుత్రుడా, యెండిపోయిన యీ యెముకలు బ్రదుక గలవా? అని నన్నడుగగా ప్రభువా యెహోవా అది నీకే తెలియునని నేనంటిని. అందుకాయన ప్రవచన మెత్తి యెండిపోయిన యీ యెముకలతో ఇట్లనుము ఎండి పోయిన యెముకలారా, యెహోవామాట ఆలకించుడి. ఈ యెముకలకు ప్రభువైన యెహోవా సెలవిచ్చున దేమనగా మీరు బ్రదుకునట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను; చర్మము కప్పిమీకు నరములనిచ్చి మీ మీద మాంసము పొదిగి చర్మము మీమీద కప్పెదను; మీలో జీవాత్మనుంచగా మీరు బ్రదుకుదురు; అప్పుడునేను యెహోవానై యున్నానని మీరు తెలిసికొందురు. ఆయన నాకిచ్చిన ఆజ్ఞప్రకారము నేను ప్రవచించు చుండగా గడగడమను ధ్వని యొకటి పుట్టెను; అప్పుడు ఎముకలు ఒకదానితో ఒకటి కలిసికొనెను. నేను చూచుచుండగా నరములును మాంసమును వాటిమీదికి వచ్చెను, వాటిపైన చర్మము కప్పెను, అయితే వాటిలో జీవాత్మ ఎంత మాత్రమును లేక పోయెను. అప్పడు ఆయన నరపుత్రుడా; జీవాత్మవచ్చునట్లు ప్రవచించి ఇట్లనుము ప్రభువగు యెహోవా సెలవిచ్చునదేమనగా జీవాత్మా, నలుదిక్కుల నుండి వచ్చి హతులైన వీరు బ్రదుకునట్లు వారిమీద ఊపిరి విడువుము. ఆయన నా కాజ్ఞాపించినట్లు నేను ప్రవచింపగా జీవాత్మ వారిలోనికి వచ్చెను; వారు సజీవులై లేచి లెక్కింప శక్యముకాని మహా సైన్యమై నిలిచిరి. అప్పుడాయన నాతో ఇట్లనెను నరపుత్రుడా, ఈ యెముకలు ఇశ్రాయేలీయులనందరిని సూచించుచున్నవి. వారు మన యెముకలు ఎండి పోయెను, మన ఆశ విఫలమాయెను, మనము నాశనమై పోతివిు అని యనుకొనుచున్నారు కాబట్టి ప్రవచన మెత్తి వారితో ఇట్లనుము ప్రభువగు యెహోవా సెలవిచ్చునదేమనగా నా ప్రజలారా, మీరున్న సమాధులను నేను తెరచెదను, సమాధులలోనుండి మిమ్మును బయటికి రప్పించి ఇశ్రాయేలు దేశములోనికి తోడుకొని వచ్చెదను. నా ప్రజలారా, నేను సమాధులను తెరచి సమాధులలోనున్న మిమ్మును బయటికి రప్పించగా నేను యెహోవానై యున్నానని మీరు తెలిసికొందురు, మీరు బ్రదుకునట్లు నా ఆత్మను మీలో ఉంచి మీ దేశములో మిమ్మును నివసింపజేసెదను, యెహోవానగు నేను మాట ఇచ్చి దానిని నెరవేర్తునని మీరు తెలిసికొందురు; ఇదే యెహోవా వాక్కు.
- Luke 14:14 లూకా 14:14నీకు ప్రత్యుపకారము చేయుటకు వారి కేమియు లేదు గనుక నీవు ధన్యుడవగుదువు; నీతిమంతుల పునరుత్థానమందు నీవు ప్రత్యుపకారము పొందుదువని చెప్పెను.
- Revelation 11:11 ప్రకటన 11:11అయితే ఆ మూడుదినములన్నరయైన పిమ్మట దేవునియొద్ద నుండి జీవాత్మ వచ్చి వారిలో ప్రవేశించెను గనుక వారు పాదములు ఊని నిలిచిరి; వారిని చూచిన వారికి మిగుల భయము కలిగెను.
- Romans 11:15 రోమీయులకు 11:15వారిని విసర్జించుట, లోకమును దేవునితో సమాధానపరచుట అయిన యెడల, వారిని చేర్చుకొనుట యేమగును? మృతులు సజీవులైనట్టే అగును గదా?
- Revelation 19:20–21 ప్రకటన 19:20–21అప్పుడా మృగమును, దానియెదుట సూచక క్రియలు చేసి దాని ముద్రను వేయించుకొనిన వారిని ఆ మృగపు ప్రతిమకు నమస్కరించినవారిని మోసపరచిన ఆ అబద్ధప్రవక్తయు, పట్టబడి వారిద్దరు గంధకముతో మండు అగ్నిగుండములో ప్రాణముతోనే వేయబడిరి. కడమ వారు గుఱ్ఱముమీద కూర్చున్న వాని నోటనుండి వచ్చిన ఖడ్గముచేత వధింపబడిరి; వారి మాంసమును పక్షులన్నియు కడుపార తినెను.
- Revelation 20:8–9 ప్రకటన 20:8–9భూమి నలు దిశలయందుండు జనములను, లెక్కకుసముద్రపు ఇసుకవలె ఉన్న గోగు మాగోగు అనువారిని మోసపరచి వారిని యుద్ధమునకు పోగుచేయుటకై వాడు బయలుదేరును. వారు భూమియందంతట వ్యాపించి, పరిశుద్ధుల శిబిరమును ప్రియమైన పట్టణమును ముట్టడివేయగా పరలోకములోనుండి అగ్ని దిగివచ్చి వారిని దహించెను.
Original words (Greek)
- But · G1161δέ dé
- rest · G3062λοιποί loipoí
- dead · G3498νεκρός nekrós
- lived · G326ἀναζάω anazáō
- not · G3756οὐ ou
- again · G326ἀναζάω anazáō
- until · G2193ἕως héōs
- thousand · G5507χίλιοι chílioi
- years · G2094ἔτος étos
- finished · G5055τελέω teléō
- This · G3778οὗτος hoûtos
- first · G4413πρῶτος prōtos
- resurrection · G386ἀνάστασις anástasis