Psalms · chapter 50 · verse 18
Psalm 50:18 in Telugu
నీవు దొంగను చూచినప్పుడు వానితో ఏకీభవించెదవు వ్యభిచారులతో నీవు సాంగత్యము చేసెదవు.
Neevu donganu choochinappudu vaanito ekeebhavinchedavu vyabhichaarulato neevu saangatyamu chesedavu.
Psalm 50:18 in English
- King James Version (KJV)
- When thou sawest a thief, then thou consentedst with him, and hast been partaker with adulterers.
- World English Bible (WEB)
- When you saw a thief, you consented with him, and have participated with adulterers.
- American Standard Version (ASV)
- When thou sawest a thief, thou consentedst with him, And hast been partaker with adulterers.
- Bible in Basic English (BBE)
- When you saw a thief, you were in agreement with him, and you were joined with those who took other men's wives.
- Darby Translation (DBY)
- When thou sawest a thief, thou didst take pleasure in him, and thy portion was with adulterers;
- Webster's Bible (WBS)
- When thou sawest a thief, then thou consentedst with him, and hast been partaker with adulterers.
- Young's Literal Translation (YLT)
- If thou hast seen a thief, Then thou art pleased with him, And with adulterers [is] thy portion.
Read in context
- 16భక్తిహీనులతో దేవుడు ఇట్లు సెలవిచ్చుచున్నాడు నా కట్టడలు వివరించుటకు నీ కేమి పని? నా నిబంధన నీనోట వచించెదవేమి?
- 17దిద్దుబాటు నీకు అసహ్యముగదా నీవు నా మాటలను నీ వెనుకకు త్రోసివేసెదవు.
- 18నీవు దొంగను చూచినప్పుడు వానితో ఏకీభవించెదవు వ్యభిచారులతో నీవు సాంగత్యము చేసెదవు.
- 19కీడుచేయవలెనని నీవు నోరు తెరచుచున్నావు నీ నాలుక కపటము కల్పించుచున్నది.
- 20నీవు కూర్చుండి నీ సహోదరునిమీద కొండెములు చెప్పుచున్నావు నీ తల్లి కుమారునిమీద అపనిందలు మోపుచున్నావు.
Cross references
- Romans 1:32 రోమీయులకు 1:32ఇట్టి కార్యములను అభ్యసించువారు మరణమునకు తగినవారు అను దేవుని న్యాయ విధిని వారు బాగుగ ఎరిగియుండియు, వాటిని చేయు చున్నారు. ఇది మాత్రమే గాక వాటిని అభ్యసించు వారితో సంతోషముగా సమ్మతించుచున్నారు.
- 1 Timothy 5:22 1 తిమోతికి 5:22త్వరపడి యెవనిమీదనైనను హస్తనిక్షేపణము చేయకుము. పరులపాప ములలో పాలివాడవై యుండకుము. నీవు పవిత్రుడవుగా ఉండునట్లు చూచుకొనుము.
- Hebrews 13:4 హెబ్రీయులకు 13:4వివాహము అన్ని విషయములలో ఘనమైనదిగాను, పానుపు నిష్కల్మషమైనది గాను ఉండవలెను; వేశ్యా సంగులకును వ్యభిచారులకును దేవుడు తీర్పు తీర్చును.
- Jeremiah 5:8–9 యిర్మీయా 5:8–9బాగుగా బలిసిన గుఱ్ఱములవలె ప్రతివాడును ఇటు అటు తిరుగుచు తన పొరుగువాని భార్యవెంబడి సకి లించును అట్టి కార్యములనుబట్టి నేను దండింపకుందునా? అట్టి జనముమీద నా కోపము తీర్చుకొనకుందునా? ఇదే యెహోవా వాక్కు.
- Proverbs 2:16–19 సామెతలు 2:16–19మరియు అది జారస్త్రీనుండి మృదువుగా మాటలాడు పరస్త్రీనుండి నిన్ను రక్షిం చును. అట్టి స్త్రీ తన ¸యౌవనకాలపు ప్రియుని విడుచునది తన దేవుని నిబంధనను మరచునది. దాని యిల్లు మృత్యువునొద్దకు దారితీయును అది నడచు త్రోవలు ప్రేతలయొద్దకు చేరును దానియొద్దకు పోవువారిలో ఎవరును తిరిగి రారు జీవమార్గములు వారికి దక్కవు. నా మాటలు వినినయెడల
- Leviticus 20:10 లేవీయకాండము 20:10పరుని భార్యతో వ్యభిచరించిన వానికి, అనగా తన పొరుగు వాని భార్యతో వ్యభిచరించినవానికిని ఆ వ్యభిచారిణికిని మరణశిక్ష విధింపవలెను.
- Proverbs 7:19–23 సామెతలు 7:19–23పురుషుడు ఇంట లేడు దూరప్రయాణము వెళ్లియున్నాడు అతడు సొమ్ముసంచి చేత పట్టుకొని పోయెను. పున్నమనాటివరకు ఇంటికి తిరిగి రాడు అనెను అది తన అధికమైన లాలనమాటలచేత వానిని లోపరచు కొనెను తాను పలికిన యిచ్చకపుమాటలచేత వాని నీడ్చుకొని పోయెను. వెంటనే పశువు వధకు పోవునట్లును పరులచే జిక్కినవాడు సంకెళ్లలోనికి పోవునట్లును తనకు ప్రాణహానికరమైనదని యెరుగక ఉరియొద్దకు పక్షి త్వరపడునట్లును వాని గుండెను అంబు చీల్చువరకు వాడు దానివెంట పోయెను.
- Isaiah 5:23 యెషయా 5:23వారు లంచము పుచ్చుకొని దుష్టుడు నీతిమంతుడని తీర్పు తీర్చుదురు నీతిమంతుల నీతిని దుర్నీతిగా కనబడచేయుదురు.
- Ephesians 5:11–13 ఎఫెసీయులకు 5:11–13నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలి వారైయుండక వాటిని ఖండించుడి. ఏలయనగా అట్టి క్రియలు చేయువారు రహస్యమందు జరిగించు పనులను గూర్చి మాటలాడుటయైనను అవమానకరమై యున్నది. సమస్తమును ఖండింపబడి వెలుగుచేత ప్రత్యక్షపరచబడును; ప్రత్యక్షపరచునది ఏదో అది వెలుగేగదా
- Proverbs 1:10–19 సామెతలు 1:10–19నా కుమారుడా, పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పకుము. మాతోకూడ రమ్ము మనము ప్రాణముతీయుటకై పొంచియుందము నిర్దోషియైన యొకని పట్టుకొనుటకు దాగియుందము పాతాళము మనుష్యులను మింగివేయునట్లు వారిని జీవముతోనే మింగివేయుదము సమాధిలోనికి దిగువారు మింగబడునట్లు వారు పూర్ణ బలముతోనుండగా మనము వారిని మింగివేయుదము రమ్ము అని వారు చెప్పునప్పుడు ఒప్పకుము. పలువిధములైన మంచి సొత్తులు మనకు దొరుకును మన యిండ్లను దోపుడుసొమ్ముతో నింపుకొందము నీవు మాతో పాలివాడవై యుండుము మనకందరికిని సంచి ఒక్కటే యుండును అని వారు నీతో చెప్పుదురు. నా కుమారుడా, నీవు వారి మార్గమున పోకుము వారి త్రోవలయందు నడువకుండ నీ పాదము వెనుకకు తీసికొనుము. కీడు చేయుటకై వారి పాదములు పరుగులెత్తును నరహత్య చేయుటకై వారు త్వరపడుచుందురు. పక్షి చూచుచుండగా వల వేయుట వ్యర్థము. వారు స్వనాశనమునకే పొంచియుందురు తమ్మును తామే పట్టుకొనుటకై దాగియుందురు. ఆశాపాతకులందరి గతి అట్టిదే దానిని స్వీకరించువారి ప్రాణము అది తీయును.
- Micah 7:3 మీకా 7:3రెండు చేతులతోను కీడు చేయ పూనుకొందురు, అధిపతులు బహుమానము కోరుదురు, న్యాయాధిపతులు లంచము పుచ్చుకొందురు, గొప్పవారు తమ మోసపు కోరికను తెలియజేయుదురు. ఆలాగున వారు ఏకపట్టుగానుండి దాని ముగింతురు.
- Matthew 23:30 మత్తయి 23:30మనము మన పితరుల దినములలో ఉండినయెడల ప్రవక్తల మరణ విషయములో వారితో పాలివారమై యుండక పోదుమని చెప్పుకొందురు.