Titus · chapter 3 · verse 1
Titus 3:1 in Telugu
అధిపతులకును అధికారులకును లోబడి విధేయులుగా ఉండవలెననియు,
Adhipatulakunu adhikaarulakunu lobadi vidheyulugaa undavalenaniyu,
Titus 3:1 in English
- King James Version (KJV)
- Put them in mind to be subject to principalities and powers, to obey magistrates, to be ready to every good work,
- World English Bible (WEB)
- Remind them to be in subjection to rulers and to authorities, to be obedient, to be ready for every good work,
- American Standard Version (ASV)
- Put them in mind to be in subjection to rulers, to authorities, to be obedient, to be ready unto every good work,
- Bible in Basic English (BBE)
- Make clear to them that they are to put themselves under rulers and authorities, to do what they are ordered, to be ready for every good work,
- Darby Translation (DBY)
- Put them in mind to be subject to rulers, to authorities, to be obedient to rule, to be ready to do every good work,
- Webster's Bible (WBS)
- Put them in mind to be subject to principalities and powers, to obey magistrates, to be ready to every good work,
- Young's Literal Translation (YLT)
- Remind them to be subject to principalities and authorities, to obey rule, unto every good work to be ready,
Read in context
- 1అధిపతులకును అధికారులకును లోబడి విధేయులుగా ఉండవలెననియు,
- 2ప్రతి సత్కార్యము చేయుటకు సిద్ధ పడియుండవలెననియు, మనుష్యులందరియెడల సంపూర్ణ మైన సాత్వికమును కనుపరచుచు, ఎవనిని దూషింపక, జగడమాడనివారును శాంతులునై యుండవలెననియు, వారికి జ్ఞాపకము చేయుము.
- 3ఎందుకనగా మనము కూడ మునుపు అవివేకులమును అవిధేయులమును మోసపోయిన వారమును నానావిధములైన దురాశలకును భోగములకును దాసులమునైయుండి, దుష్టత్వమునందును అసూయ యందును కాలముగడుపుచు, అసహ్యులమై యొకని నొకడు ద్వేషించుచు ఉంటిమి గాని
Cross references
- Romans 13:1–7 రోమీయులకు 13:1–7ప్రతివాడును పై అధికారులకు లోబడియుండవలెను; ఏలయనగా దేవునివలన కలిగినది తప్ప మరి ఏ అధికారమును లేదు; ఉన్న అధికారములు దేవునివలననే నియమింపబడి యున్నవి. కాబట్టి అధికారమును ఎదిరించువాడు దేవుని నియమమును ఎదిరించుచున్నాడు; ఎదిరించువారు తమమీదికి తామే శిక్ష తెచ్చుకొందురు. ప్రభుత్వము చేయువారు చెడ్డకార్యములకేగాని మంచి కార్యములకు భయంకరులు కారు; నీకు మేలు కలుగుటకు అధికారులు దేవుని పరిచారకులు; వారికి భయపడక ఉండ కోరితివా, మేలు చేయుము, అప్పుడు వారిచేత మెప్పు పొందుదువు. నీవు చెడ్డది చేసినయెడల భయపడుము, వారు ఊరకయే ఖడ్గము ధరింపరు; కీడు చేయువానిమీద ఆగ్రహము చూపుటకై వారు ప్రతికారము చేయు దేవుని పరిచారకులు. కాబట్టి ఆగ్రహభయమునుబట్టి మాత్రము కాక మనస్సాక్షిని బట్టియు లోబడియుండుట ఆవశ్యకము. ఏలయనగా వారు దేవుని సేవకులైయుండి యెల్లప్పుడు ఈ సేవయందే పని కలిగియుందురు. ఇందుకే గదా మీరు పన్నుకూడ చెల్లించుచున్నారు? కాబట్టి యెవనికి పన్నో వానికి పన్నును, ఎవనికి సుంకమో వానికి సుంకమును చెల్లించుడి. ఎవనియెడల భయముండ వలెనో వానియెడల భయమును, ఎవనియెడల సన్మాన ముండవలెనో వాని యెడల సన్మానమును కలిగియుండి, అందరికిని వారి వారి ఋణములను తీర్చుడి.
- 1 Peter 2:13–17 1 పేతురు 2:13–17మనుష్యులు నియమించు ప్రతి కట్టడకును ప్రభువు నిమిత్తమై లోబడియుండుడి. రాజు అందరికిని అధిపతి యనియు, నాయకులు దుర్మార్గులకు ప్రతిదండన చేయుట కును సన్మార్గులకు మెప్పు కలుగుటకును రాజువలన పంప బడినవారనియు వారికి లోబడియుండుడి. ఏలయనగా మీరిట్లు యుక్తప్రవర్తన గలవారై, అజ్ఞానముగా మాటలాడు మూర్ఖుల నోరు మూయుట దేవుని చిత్తము. స్వతంత్రులై యుండియు దుష్టత్వమును కప్పి పెట్టుటకు మీ స్వాతంత్ర్య మును వినియోగపరచక, దేవునికి దాసులమని లోబడి యుండుడి. అందరిని సన్మానించుడి, సహోదరులను ప్రేమించుడి, దేవునికి భయపడుడి, రాజును సన్మానించుడి.
- Ecclesiastes 10:4 ప్రసంగి 10:4ఏలువాడు నీమీద కోపపడినయెడల నీ ఉద్యోగమునుండి నీవు తొలగిపోకుము; ఓర్పు గొప్ప ద్రోహకార్యములు జరుగకుండ చేయును.
- Galatians 6:9–10 గలతీయులకు 6:9–10మనము మేలుచేయుటయందు విసుకక యుందము. మనము అలయక మేలు చేసితిమేని తగినకాలమందు పంట కోతుము. కాబట్టి మనకు సమయము దొరకినకొలది అందరియెడలను, విశేష ముగా విశ్వాసగృహమునకు చేరినవారియెడలను మేలు చేయుదము.
- Proverbs 24:21 సామెతలు 24:21నా కుమారుడా, యెహోవాను ఘనపరచుము రాజును ఘనపరచుము ఆలాగు చేయనివారి జోలికి పోకుము.
- Matthew 22:21 మత్తయి 22:21అందుకాయన ఆలాగైతే కైసరువి కైసరునకును, దేవునివి దేవునికిని చెల్లించు డని వారితో చెప్పెను.
- Hebrews 13:21 హెబ్రీయులకు 13:21యేసు క్రీస్తుద్వారా తన దృష్టికి అనుకూలమైనదానిని మనలో జరిగించుచు, ప్రతి మంచి విషయములోను తన చిత్తప్రకారము చేయుటకు మిమ్మును సిద్ధపరచును గాక. యేసుక్రీస్తుకు యుగయుగములకు మహిమ కలుగునుగాక. ఆమేన్.
- 1 Timothy 5:10 1 తిమోతికి 5:10సత్క్రియలకు పేరుపొందిన విధవరాలు పిల్లలను పెంచి, పరదేశులకు అతిథ్యమిచ్చి, పరిశుద్ధుల పాదములు కడిగి, శ్రమపడువారికి సహాయముచేసి, ప్రతి సత్కార్యముచేయ బూనుకొనినదైతే ఆమెను విధవరాండ్ర లెక్కలో చేర్చవచ్చును.
- 2 Timothy 2:21 2 తిమోతికి 2:21ఎవడైనను వీటిలో చేరక తన్నుతాను పవిత్ర పరచుకొనినయెడల వాడు పరిశుద్ధపరచబడి, యజమానుడు వాడుకొనుటకు అర్హమై ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి, ఘనత నిమిత్తమైన పాత్రయై యుండును.
- Ecclesiastes 8:2–5 ప్రసంగి 8:2–5నీవు దేవునికి ఒట్టుపెట్టుకొంటివని జ్ఞాపకము చేసికొని రాజుల కట్టడకు లోబడుమని నేను చెప్పు చున్నాను. రాజుల సముఖమునుండి అనాలోచనగా వెళ్లకుము; వారు తాము కోరినదెల్ల నెరవేర్చుదురు గనుక దుష్కార్యములో పాలుపుచ్చుకొనకుము. రాజుల ఆజ్ఞ అధికారము గలది, నీవు చేయు పని ఏమని రాజుతో చెప్పగల వాడెవడు? ధర్మము నాచరించువారికి కీడేమియు సంభవింపదు; సమయము వచ్చుననియు న్యాయము జరుగుననియు జ్ఞానులు మనస్సున తెలిసికొందురు.
- 2 Timothy 1:6 2 తిమోతికి 1:6ఆ హేతువుచేత నా హస్తనిక్షేపణమువలన నీకు కలిగిన దేవుని కృపావరము ప్రజ్వలింప చేయవలెనని నీకు జ్ఞాపకము చేయుచున్నాను.
- 2 Peter 3:1–2 2 పేతురు 3:1–2ప్రియులారా, యీ రెండవ పత్రిక మీకిప్పుడు వ్రాయుచున్నాను పరిశుద్ధ ప్రవక్తలచేత పూర్వమందు పలుకబడిన మాటలను, ప్రభువైన రక్షకుడు మీ అపొస్తలుల ద్వారా ఇచ్చిన ఆజ్ఞను మీరు జ్ఞాపకము చేసికొనవలెనను విషయమును మీకు జ్ఞాపకముచేసి, నిర్మలమైన మీ మనస్సులను రేపుచున్నాను.
Original words (Greek)
- Put · G5279ὑπομιμνήσκω hypomimnḗskō
- them · G846αὐτός autós
- mind · G5279ὑπομιμνήσκω hypomimnḗskō
- to · G5293ὑποτάσσω hypotássō
- principalities · G746ἀρχή archḗ
- and · G2532καί kaí
- powers · G1849ἐξουσία exousía
- magistrates · G3980πειθαρχέω peitharchéō
- be · G1511εἶναι eînai
- ready · G2092ἕτοιμος hétoimos
- to · G4314πρός prós
- every · G3956πᾶς pâs
- good · G18ἀγαθός agathós
- work · G2041ἔργον érgon