Ecclesiastes · chapter 8 · verse 2
Ecclesiastes 8:2 in Telugu
నీవు దేవునికి ఒట్టుపెట్టుకొంటివని జ్ఞాపకము చేసికొని రాజుల కట్టడకు లోబడుమని నేను చెప్పు చున్నాను.
Neevu devuniki ottupettukontivani jnyaapakamu chesikoni raajula kattadaku lobadumani nenu cheppu chunnaanu.
Ecclesiastes 8:2 in English
- King James Version (KJV)
- I [counsel thee] to keep the king’s commandment, and [that] in regard of the oath of God.
- World English Bible (WEB)
- I say, “Keep the king’s command!” because of the oath to God.
- American Standard Version (ASV)
- I [counsel thee], Keep the king’s command, and that in regard of the oath of God.
- Bible in Basic English (BBE)
- I say to you, Keep the king's law, from respect for the oath of God.
- Darby Translation (DBY)
- I [say], Keep the king's commandment, and [that] on account of the oath of God.
- Webster's Bible (WBS)
- I [counsel thee] to keep the king's commandment, and [that] in regard of the oath of God.
- Young's Literal Translation (YLT)
- I pray thee, the commandment of a king keep, even for the sake of the oath of God.
Read in context
- 1జ్ఞానులతో సములైనవారెవరు? జరుగువాటి భావమును ఎరిగినవారెవరు? మనుష్యుల జ్ఞానము వారి ముఖమునకు తేజస్సు నిచ్చును, దానివలన వారి మోటుతనము మార్చ బడును.
- 2నీవు దేవునికి ఒట్టుపెట్టుకొంటివని జ్ఞాపకము చేసికొని రాజుల కట్టడకు లోబడుమని నేను చెప్పు చున్నాను.
- 3రాజుల సముఖమునుండి అనాలోచనగా వెళ్లకుము; వారు తాము కోరినదెల్ల నెరవేర్చుదురు గనుక దుష్కార్యములో పాలుపుచ్చుకొనకుము.
- 4రాజుల ఆజ్ఞ అధికారము గలది, నీవు చేయు పని ఏమని రాజుతో చెప్పగల వాడెవడు?
Cross references
- Proverbs 24:21 సామెతలు 24:21నా కుమారుడా, యెహోవాను ఘనపరచుము రాజును ఘనపరచుము ఆలాగు చేయనివారి జోలికి పోకుము.
- Titus 3:1 తీతుకు 3:1అధిపతులకును అధికారులకును లోబడి విధేయులుగా ఉండవలెననియు,
- 1 Peter 2:13–17 1 పేతురు 2:13–17మనుష్యులు నియమించు ప్రతి కట్టడకును ప్రభువు నిమిత్తమై లోబడియుండుడి. రాజు అందరికిని అధిపతి యనియు, నాయకులు దుర్మార్గులకు ప్రతిదండన చేయుట కును సన్మార్గులకు మెప్పు కలుగుటకును రాజువలన పంప బడినవారనియు వారికి లోబడియుండుడి. ఏలయనగా మీరిట్లు యుక్తప్రవర్తన గలవారై, అజ్ఞానముగా మాటలాడు మూర్ఖుల నోరు మూయుట దేవుని చిత్తము. స్వతంత్రులై యుండియు దుష్టత్వమును కప్పి పెట్టుటకు మీ స్వాతంత్ర్య మును వినియోగపరచక, దేవునికి దాసులమని లోబడి యుండుడి. అందరిని సన్మానించుడి, సహోదరులను ప్రేమించుడి, దేవునికి భయపడుడి, రాజును సన్మానించుడి.
- Romans 13:1–5 రోమీయులకు 13:1–5ప్రతివాడును పై అధికారులకు లోబడియుండవలెను; ఏలయనగా దేవునివలన కలిగినది తప్ప మరి ఏ అధికారమును లేదు; ఉన్న అధికారములు దేవునివలననే నియమింపబడి యున్నవి. కాబట్టి అధికారమును ఎదిరించువాడు దేవుని నియమమును ఎదిరించుచున్నాడు; ఎదిరించువారు తమమీదికి తామే శిక్ష తెచ్చుకొందురు. ప్రభుత్వము చేయువారు చెడ్డకార్యములకేగాని మంచి కార్యములకు భయంకరులు కారు; నీకు మేలు కలుగుటకు అధికారులు దేవుని పరిచారకులు; వారికి భయపడక ఉండ కోరితివా, మేలు చేయుము, అప్పుడు వారిచేత మెప్పు పొందుదువు. నీవు చెడ్డది చేసినయెడల భయపడుము, వారు ఊరకయే ఖడ్గము ధరింపరు; కీడు చేయువానిమీద ఆగ్రహము చూపుటకై వారు ప్రతికారము చేయు దేవుని పరిచారకులు. కాబట్టి ఆగ్రహభయమునుబట్టి మాత్రము కాక మనస్సాక్షిని బట్టియు లోబడియుండుట ఆవశ్యకము.
- 1 Kings 2:43 1 రాజులు 2:43కాబట్టి యెహోవాతోడని నీవు చేసిన ప్రమాణమును మేము నీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞను నీవు గైకొనక పోతివేమి అని అడిగి
- Exodus 22:11 నిర్గమకాండము 22:11వాడు తన పొరుగువాని సొమ్మును తీసికొనలేదనుటకు యెహోవా ప్రమాణము వారిద్దరిమధ్య నుండవలెను. సొత్తుదారుడు ఆ ప్రమాణమును అంగీకరింపవలెను; ఆ నష్టమును అచ్చుకొననక్కరలేదు.
- 1 Chronicles 29:24 1 దినవృత్తాంతములు 29:24అధిపతులందరును యోధులందరును రాజైన దావీదు కుమారులందరును రాజైన సొలొమోనునకు లోబడిరి.
- Ezekiel 17:13–20 యెహెజ్కేలు 17:13–20మరియు అతడు రాజసంతతిలో ఒకని నేర్పరచి, ఆ రాజ్యము క్షీణించి తిరుగుబాటు చేయలేక యుండు నట్లును, తాను చేయించిన నిబంధనను ఆ రాజు గైకొనుట వలన అది నిలిచియుండునట్లును, అతనితో నిబంధనచేసి అతనిచేత ప్రమాణముచేయించి, దేశములోని పరాక్రమ వంతులను తీసికొనిపోయెను. అయితే అతడు తనకు గుఱ్ఱములను గొప్ప సైన్యము నిచ్చి సహాయముచేయవలెనని యడుగుటకై ఐగుప్తుదేశమునకు రాయబారులను పంపి బబులోనురాజు మీద తిరుగుబాటు చేసెను; అతడు వర్ధిల్లునా? అట్టి క్రియలను చేసిన వాడు తప్పించుకొనునా? నిబంధనను భంగము చేసెను గనుక తప్పించుకొనడు ఎవనికి తాను ప్రమాణముచేసి దాని నిర్లక్ష్యపెట్టెనో, యెవనితో తానుచేసిన నిబంధనను అతడు భంగముచేసెనో, యెవడు తన్ను రాజుగా నియమించెనో ఆ రాజునొద్దనే బబులోను పురములోనే అతడు మృతినొందునని నా జీవ ముతోడు ప్రమాణము చేయుచున్నాను; ఇదే ప్రభు వైన యెహోవా వాక్కు. యుద్ధము జరుగగా అనేక జనులను నిర్మూలము చేయవలెనని కల్దీయులు దిబ్బలువేసి బురుజులు కట్టిన సమయమున, ఫరో యెంత బలము ఎంత సమూహము కలిగి బయలుదేరినను అతడు ఆ రాజునకు సహాయము ఎంతమాత్రము చేయజాలడు. తన ప్రమాణము నిర్లక్ష్యపెట్టి తాను చేసిన నిబంధనను భంగము చేసెను, తన చెయ్యి యిచ్చియు ఇట్టి కార్యములను అతడు చేసెనే, అతడు ఎంతమాత్రమును తప్పించుకొనడు. ఇందుకు ప్రభువైన యెహోవా ఈలాగున సెలవిచ్చుచున్నాడు అతడు నిర్లక్ష్యపెట్టిన ప్రమాణము నేను చేయించినది గదా, అతడు రద్దుపరచిన నిబంధన నేను చేసినదే గదా, నా జీవముతోడు ఆ దోషశిక్ష అతని తలమీదనే మోపుదును, అతని పట్టుకొనుటకై నేను వలనొగ్గి యతని చిక్కించుకొని బబులోనుపురమునకు అతని తీసికొనిపోయి, నామీద అతడు చేసియున్న విశ్వాస ఘాతకమునుబట్టి అక్కడనే అతనితో వ్యాజ్యెమాడుదును.
- 2 Samuel 21:7 2 సమూయేలు 21:7తానును సౌలు కుమారుడగు యోనాతానును యెహోవా నామ మునుబట్టి ప్రమాణము చేసియున్న హేతువుచేత రాజు సౌలు కుమారుడగు యోనాతానునకు పుట్టిన మెఫీబోషెతును అప్పగింపక