Skip to content
ThuthiThuthiThuthi

Devuni Pilupu Undani Neevu Maruvaku Aa Pilupu Song Lyricsదేవుని పిలుపు ఉందని నీవు మరువకు ఆ పిలుపు

Also searched as: devuni

Devuni Pilupu Undani Neevu Maruvaku Aa Pilupu Lyrics in Telugu & English

Present

Chorus

దేవుని పిలుపు ఉందని నీవు మరువకు

ఆ పిలుపు ఎపుడొస్తుందో నీవు ఎరుగవు (2)

ప్రతి ఒక్కరికి పంపుతాడు ఆహ్వానము

అందుకొనుటకు ఎదురుచూడాలి అందరము (2)

మరణమే ఆపిలుపనీ మరణమే ఆ ఆహ్వానమని (2)

||దేవువిపిలుపు||

Devuni Pilupu Undani Neevu Maruvaku

Aa Pilupu Epudostundo Neevu Erugavu (2)

Prati Okkariki Pamputaadu Aahvaanamu

Andukonutaku Eduruchoodaali Andaramu (2)

Maraname Aapilupanee Maraname Aa Aahvaanamani (2)

||Devuvipilupu||

Verse 1

ఆత్మగా ఉన్న నీకు తల్లిగర్భములో ఆకారమిచ్చి

కొంతకాలము ఆయుష్షునిచ్చి పుడమిపై ఉంచెను నిన్ను దేవుడు (2)

భూమిపై ఉన్నంతకాలము ఆయనపనిలో నీవుండాలని

నీకియ్యబడిన పనిపూర్తయితే ఆయనతో ఉండుటకు వెళ్లిపోవాలని

పిలిచాడు దేవుడు నరులారా తిరిగిరండని తనయొద్దకు (2)

మరణమే ఆపిలుపనీ మరణమే ఆ ఆహ్వానమని (2)

||దేవువిపిలుపు||

Aatmagaa Unna Neeku Talligarbhamulo Aakaaramichchi

Kontakaalamu Aayushshunichchi Pudamipai Unchenu Ninnu Devudu (2)

Bhoomipai Unnantakaalamu Aayanapanilo Neevundaalani

Neekiyyabadina Panipoortayite Aayanato Undutaku Vellipovaalani

Pilichaadu Devudu Narulaaraa Tirigirandani Tanayoddaku (2)

Maraname Aapilupanee Maraname Aa Aahvaanamani (2)

||Devuvipilupu||

Verse 2

అప్పగించిన పనిని చేయుటకే నాడు వచ్చాడు క్రీస్తుయేసు

భూమిపై పనిని పూర్తి చేసి ఆత్మను తండ్రికి అప్పగించుకున్నాడు (2)

దేహములో ఉన్నంతవరకు దేవుని పనిలో నీవుండాలని

నీదేహమును విడిచిపెడితే దేవునితో ఉండుటకు వెళ్లిపోవాలని

దేవునిపనిలో ఉన్నవారికి ఆయన పిలుపే ఒక వరం

లోకపనులలో మునిగిన వారికి ఆయన పిలుపే తీరని శోకము

మరణమే ఆపిలుపనీ మరణమే ఆ ఆహ్వానమని (2)

||దేవువిపిలుపు||

Appaginchina Panini Cheyutake Naadu Vachchaadu Kreestuyesu

Bhoomipai Panini Poorti Chesi Aatmanu Tandriki Appaginchukunnaadu (2)

Dehamulo Unnantavaraku Devuni Panilo Neevundaalani

Needehamunu Vidichipedite Devunito Undutaku Vellipovaalani

Devunipanilo Unnavaariki Aayana Pilupe Oka Varam

Lokapanulalo Munigina Vaariki Aayana Pilupe Teerani Shokamu

Maraname Aapilupanee Maraname Aa Aahvaanamani (2)

||Devuvipilupu||

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with D