Skip to content
ThuthiThuthiThuthi

Kreestuni Svaramu Vindunu Song Lyricsక్రీస్తుని స్వరము విందును

Kreestuni Svaramu Vindunu Lyrics in Telugu & English

Present

Chorus

క్రీస్తుని స్వరము విందును ప్రభువే పలికినప్పుడు

మధుర స్వరమేయది మెల్లని స్వరమేయది – (2)

యెహోవా నీ స్వరము జలములపై వినబడెను (2)

మహిమగల దేవుడు ఉరుమువలె గర్జించెను (2) ||క్రీస్తుని||

Kreestuni Svaramu Vindunu Prabhuve Palikinappudu

Madhura Svarameyadi Mellani Svarameyadi – (2)

Yehovaa Nee Svaramu Jalamulapai Vinabadenu (2)

Mahimagala Devudu Urumuvale Garjinchenu (2) ||Kreestuni||

Verse 1

బలమైన నీ స్వరము బహుప్రభావము గలది (2)

దేవదారుల విరచును ప్రజ్వలింప చేయునగ్నిని (2) ||క్రీస్తుని||

Balamaina Nee Svaramu Bahuprabhaavamu Galadi (2)

Devadaarula Virachunu Prajvalimpa Cheyunagnini (2) ||Kreestuni||

Verse 2

అద్భుత ప్రభు స్వరము అరణ్యము కదిలించును (2)

ఆకుల రాలజేయును లేళ్ళ నీనజేయును (2) ||క్రీస్తుని||

Adbhuta Prabhu Svaramu Aranyamu Kadilinchunu (2)

Aakula Raalajeyunu Lella Neenajeyunu (2) ||Kreestuni||

Verse 3

ఆలయమందన్నియు ఆయననే ఘనపరచున్ (2)

ఆశీర్వాదము శాంతి నొసగునాయన స్వరమే (2) ||క్రీస్తుని||

Aalayamandanniyu Aayanane Ghanaparachun (2)

Aasheervaadamu Shaanti Nosagunaayana Svarame (2) ||Kreestuni||

Verse 4

నీ మధుర స్వరము నీ వాక్యమును విందున్ (2)

ప్రార్థనల యందున ప్రతిదినము పల్కెదవు (2) ||క్రీస్తుని||

Nee Madhura Svaramu Nee Vaakyamunu Vindun (2)

Praarthanala Yanduna Pratidinamu Palkedavu (2) ||Kreestuni||

Verse 5

నీ మధుర స్వరము నీ చిత్తము తెల్పును (2)

అనుదిన జీవితములో అనుసరించెద నిన్ను (2) ||క్రీస్తుని||

Nee Madhura Svaramu Nee Chittamu Telpunu (2)

Anudina Jeevitamulo Anusarincheda Ninnu (2) ||Kreestuni||

Verse 6

నీ మధుర స్వరము నీ మార్గము జూపును (2)

కుడి యెడమల తిరిగిన నీ స్వరమే వినబడును (2) ||క్రీస్తుని||

Nee Madhura Svaramu Nee Maargamu Joopunu (2)

Kudi Yedamala Tirigina Nee Svarame Vinabadunu (2) ||Kreestuni||

Verse 7

తుఫానులు కలిగి భయభీతులలో నుండ (2)

భయపడకు మని పలికె ప్రేమగల నీ స్వరము (2) ||క్రీస్తుని||

Tuphaanulu Kaligi Bhayabheetulalo Nunda (2)

Bhayapadaku Mani Palike Premagala Nee Svaramu (2) ||Kreestuni||

Verse 8

మరణాంధకార లోయలో నేనుండ (2)

నీకు తోడైయుంటి ననెడి స్వరమును వింటిన్ (2) ||క్రీస్తుని||

Maranaandhakaara Loyalo Nenunda (2)

Neeku Todaiyunti Nanedi Svaramunu Vintin (2) ||Kreestuni||

Verse 9

ప్రభువా సెలవిమ్ము నీ దాసుడాలించున్ (2)

దీనుడనై నీ మాట అంగీకరించెదను (2) ||క్రీస్తుని||

Prabhuvaa Selavimmu Nee Daasudaalinchun (2)

Deenudanai Nee Maata Angeekarinchedanu (2) ||Kreestuni||

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with K