Skip to content
ThuthiThuthiThuthi

O Karunaanidhee Mahaa Prabhuyesu Song Lyricsఓ కరుణానిధీ మహా ప్రభుయేసు

O Karunaanidhee Mahaa Prabhuyesu Lyrics in Telugu & English

Present

Verse 1

ఓ కరుణానిధీ మహా ప్రభుయేసు - నీవే సింహాసనాసీనుడవైతివి

O Karunaanidhee Mahaa Prabhuyesu - Neeve Sinhaasanaaseenudavaitivi

Verse 2

సత్యస్వరూపివి పరిశుద్ధుడవు - దావీదు తాళము కల్గియున్నావు

నీవు తెరచినది మూయగలేరు

బంధించినది తెరువగలేరెవ్వరు - నీ మహాత్మ్యమదే

Satyasvaroopivi Parishuddhudavu - Daaveedu Taalamu Kalgiyunnaavu

Neevu Terachinadi Mooyagaleru

Bandhinchinadi Teruvagalerevvaru - Nee Mahaatmyamade

Verse 3

ఏడు నక్షత్రములు నీచేత కలవు - దీప స్తంభముల మధ్య

సంచరించెదవు - జీవించువాడవు ఆది అంతములు - రెండంచుల

ఖడ్గం కలిగిన ప్రభువా - అదియే నీ ఘనత

Edu Nakshatramulu Neecheta Kalavu - Deepa Stambhamula Madhya

Sancharinchedavu - Jeevinchuvaadavu Aadi Antamulu - Rendanchula

Khadgam Kaligina Prabhuvaa - Adiye Nee Ghanata

Verse 4

అగ్నివంటి నేత్రములు కల్గి - అపరాపరంజి వంటి పాదములు కలిగి

దేవుని ఏడు ఆత్మలు కలిగి - గ్రంధము తెరచే యోగ్యుడవీవే

ధన్యుడవు నీవే

Agnivanti Netramulu Kalgi - Aparaaparanji Vanti Paadamulu Kaligi

Devuni Edu Aatmalu Kaligi - Grandhamu Terache Yogyudaveeve

Dhanyudavu Neeve

Verse 5

నమ్మకమైన సత్యసాక్షియు - సర్వసృష్టికి కర్తయైయుండి

నీతిమంతుడు బహుజ్వాలామయుడు దీర్ఘశాంతుడు

శక్తిమంతుడు - ఆమెన్ అనువాడు

Nammakamaina Satyasaakshiyu - Sarvasrushtiki Kartayaiyundi

Neetimantudu Bahujvaalaamayudu Deerghashaantudu

Shaktimantudu - Aamen Anuvaadu

Verse 6

ఎల్లరు ప్రభుని స్తుతించెదరు - సాగిల పడెదరు కృతజ్ఞులై

ఆశ్చర్యక్రియలు చేసితివంచు - ప్రభువా నీవే అగమ్యుడవంచు

నినుకొనియాడెదము

Ellaru Prabhuni Stutinchedaru - Saagila Padedaru Krutajnyulai

Aashcharyakriyalu Chesitivanchu - Prabhuvaa Neeve Agamyudavanchu

Ninukoniyaadedamu

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with O